సీబీఐకి రాబర్ట్ వాద్రా బికనీర్ స్కామ్
జైపూర్: రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో భూముల ఒప్పందానికి సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా నిందితుడైన బికనీర్ భూములు, మనీ ల్యాండరింగ్ కేసులను త్వరలో సీబీఐ విచారించనుంది. ఈ కేసులపై సీబీఐ విచారణ కోరుతూ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టు రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా తెలిపారు. ఈ కేసు ప్రాధాన్యత, సుదీర్ఘంగా విచారణ సాగుతున్న క్రమంలో తదుపరి సీబీఐచే విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్కొన్నారు. కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశామని చెప్పారు. రాజస్థాన్‌లోని బికనీర్‌లో రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు 275 బిగాల భూమి అక్రమ క్రయవిక్రయాల్లో పాలుపంచుకున్నాయని ఆరోపణలున్నాయి.
మహజన్ ఫైరింగ్ రేంజ్ కోసం సేకరించిన భూమికి పరిహారంగా ఈ స్థలాలను కేటాయించారని 2010 నుంచి వీటి క్రయవిక్రయాల్లో పలు అవకతవకలు చోటుచేసుకున్నాయని చెప్పారు. అధికారులు నకిలీ గుర్తింపులు, పేర్లతో భూములను ఇతరులకు రిజిస్టర చేశారనే అనుమానాలున్నందునే సీబీఐ విచారణ కోరామని తెలిపారు.