gujjars
-
కేరళ నాయర్లూ... రాజస్థాన్ గుజ్జర్లూ చుట్టాలే!
కేరళలో ఉన్న నాయర్లకు.. రాజస్థాన్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లోని గుజ్జర్లకు మధ్య సంబంధం ఏమిటి? మీకు తెలుసా? ఈ రోజు ఇరువురికీ మధ్య అస్సలు సంబంధం లేకపోవచ్చునేమో కానీ.. ఒకప్పుడు మాత్రం ఇద్దరు దగ్గరి చుట్టాల్లాంటి వారు అంటోంది సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ). ఒక్క నాయర్లు మాత్రమే కాదు.. కేరళలోనే ఉండే థియ్యాలు, ఎళవ తెగల ప్రజలు కూడా ఒకప్పుడు దేశ వాయువ్య ప్రాంతానికి చెందిన వారని వీరు జన్యుక్రమాల ఆధారంగా నిర్ధారించారు. కొంచెం వివరంగా చూస్తే.. భారత దేశ నైరుతి ప్రాంతం అంటే కేరళ, కర్ణాటక, తమిళనాడు దక్షిణ భాగాలు జీవ వైవిధ్యానికే కాదు.. జన్యువైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. వేల సంవత్సరాలుగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారని చెబుతారు. యూదులు, పార్సీలు, రోమన్ కేథలిక్కులు కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నప్పటికీ నాయర్లు, థియ్యాలు, ఎళవ తెగల వారు ఎక్కడి నుంచి వలస వచ్చారన్న విషయంపై భిన్నాభిప్రాయాలు ఉండేవి. చరిత్రకారుల అంచనాల ప్రకారం వీరందరూ గంగా తీరంలోని అహిఛాత్ర (ఇనుప రాతి యుగం) ప్రాంతం నుంచి వలస వచ్చిన వారని చారిత్రక, లిఖిత దస్తావేజుల సాయంతో వాదిస్తున్నారు. మరోవైపు ఇతరులు మాత్రం వీరందరూ ఇండో సిథియన్ వర్గం వారని, దేశ వాయువ్య ప్రాంతం నుంచి వలస వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో జన్యుపరంగా వీరి వలస ఎలా సాగింది? వీరు ఏ ప్రాంతానికి చెందిన వారై ఉండవచ్చో నిర్ధారించేందుకు సీసీఎండీ సీనియర్ శాస్త్రవేత్త కుమారస్వామి తంగరాజ్ నేతృత్వంలోని బృందం ప్రయత్నించింది. నాయర్లు, థియ్యాలు, ఎళవ వంటి భూస్వామ్య, యుద్ధ వీరుల తెగలకు చెందిన 213 మంది జన్యుక్రమాలను సేకరించి అటు తల్లివైపు నుంచి మాత్రమే అందే మైటోకాండ్రియల్ డీఎన్ఏ గుర్తులు, ఇటు జన్యుక్రమం మొత్తమ్మీద ఉండే ఆటోసోమల్ గుర్తులు (మన మునుపటి తరాల గురించి తెలిపేవి. సెక్స్ క్రోమోజోములు మినహా మిగిలిన 22 క్రోమోజోముల్లో ఈ మార్పులు ఉంటాయి. వారసత్వంతోపాటు జన్యుపరమైన సంబంధాలు, నిర్దిష్ట వ్యాధులు సోకేందుకు అన్న అవకాశాల గురించి ఈ మార్పులు సూచిస్తాయి) గుర్తించారు. వీటిని యూరేసియా ప్రాంతంలోని పురాతన, ప్రస్తుత తెగల జన్యుక్రమాలతో పోల్చి చూశారు. కేరళలోని నాయర్లు, థియ్యాలు, ఎళవలతోపాటు కర్ణాటకలోని బంట్స్ (ఐశ్వర్యరాయ్ బంట్ తెగకు చెందిన మహిళే), హొయసళ సామాజిక వర్గ ప్రజలు కూడా జన్యుపరంగా దేశ వాయువ్య ప్రాంత ప్రజలతో దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నారని ఈ పరిశోధన ద్వారా స్పష్టమైంది. ‘‘నాయర్లు, థియ్యా, ఎళవ తెగల ప్రజలకు దేశ వాయ్యు ప్రాంతంలోని కాంభోజ్, గుజ్జర్ తెగల ప్రజలకు మధ్య జన్యుసంబంధాలు ఎక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధన స్పష్టం చేసింది. అంతేకాకుండా వీరిలో ఇరాన్ ప్రాంత జన్యు వారసత్వం కూడా ఇతరుల కంటే ఎక్కువగా ఉంది’’ అని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ తెలిపారు. అంతేకాకుండా... తల్లివైపు నుంచి అందిన జన్యు సమారాన్ని విశ్లేషిస్తే పశ్చి యురేసియా ప్రాంత వారసత్వం కనిపిస్తోందని దీన్నిబట్టి మహిళల నేతృత్వంలో జరిగిన వలసలో వీరు భాగమై ఉంటారని చెప్పవచ్చునని ఆయన వివరించారు. ‘జినోమ్ బయాలజీ అండ్ ఎవల్యూషన్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనపై సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి మాట్లాడుతూ భారతదేశ దక్షిణ, పశ్చిమ తీర ప్రాంతంలోని వాయువ్య ప్రాంతం నుంచి గోదావరి తీరం ద్వారా కర్ణాటకకు ఆ తరువాత అక్కడి నుంచి మరింత దక్షిణంగా కేరళకు వలస వచ్చినట్లు ఈ పరిశోధన ద్వారా తెలుస్తుందని అన్నారు. -
అణగారిన వర్గాల సాధికారతే ధ్యేయం
జైపూర్: ‘‘సమాజంలో అణగారిన వర్గాల సాధికారతే మా ప్రభుత్వ ధ్యేయం. అందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. వంచిత్ కో వరీయత (పీడితులకు తొలి ప్రాధాన్యం) నినాదంతో సాగుతున్నామన్నారు. శనివారం రాజస్తాన్‌లో భిల్వారా జిల్లా మాలాసేరీ డుంగ్రీలో గుజ్జర్ల ఆరాధ్యుడు శ్రీదేవనారాయణ్ ఆధ్యాత్మిక వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రపంచ దేశాలు ఆశలు, ఆకాంక్షలతో భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ తన బలాన్ని, అధికారాన్ని ప్రదర్శిస్తోంది, అంతర్జాతీయ వేదికలపై శక్తిని నిరూపించుకుంటోంది’’ అన్నారు. పొరపాట్లను సరిదిద్దుకుంటున్న ‘నవ భారత్’ స్వాతంత్య్ర పోరాటంతోపాటు ఇతర ఉద్యమాల్లో గుజ్జర్ల పాత్ర మరువలేనిదని మోదీ ప్రశంసించారు. వారికి చరిత్రలో తగిన గుర్తింపు దక్కకపోవడం దురదృష్టకరమని అన్నారు. ‘‘గత పొరపాట్లను ‘నవ భారత్’ సరిదిద్దుకుంటోంది. దేశాన్ని సిద్ధాంతపరంగా విచ్ఛిన్నం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగినా విఫలమయ్యాయి. నాగరికత, సంస్కృతి, సామరస్యం, శక్తి సామర్థ్యాల వ్యక్తీకరణే భారత్’’ అన్నారు. దేశ ఐక్యతను భగ్నం చేసే వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మన వారసత్వం మనకు గర్వకారణం వేలాది సంవత్సరాల భారతదేశ ప్రయాణంలో సామాజిక బలం గణనీయమైన పాత్ర పోషించిందని నరేంద్ర మోదీ వివరించారు. మన వారసత్వం మనకు గర్వకారణమని, బానిస మనస్తత్వం నుంచి బయటపడాలని ఉద్బోధించారు. దేశం పట్ల మనం నిర్వర్తించాల్సిన విధులను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని కోరారు. ‘‘ప్రజాసేవకు శ్రీదేవనారాయణ్ ప్రాధాన్యమిచ్చారు. ఆయన కమలంలో ఉద్భవించారు. భారత్ సారథ్యం వహిస్తున్న జి–20 లోగోలో కమలం ఉంది. బీజేపీ ఎన్నికల గుర్తయిన కమలంతో నాకెంతో అనుబంధముంది. గుజ్జర్ సామాజిక వర్గంతోనూ చక్కటి స్నేహ సంబంధాలున్నాయి’’ అన్నారు. ఐక్యతా మంత్రమే విరుగుడు న్యూఢిల్లీ: ప్రజల మధ్య విభేదాలు, అంతరాలను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎన్నడూ విజయవంతం కాబోవని మోదీ అన్నారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప గ్రౌండ్లో ఎన్సీసీ ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘‘దేశ పునర్వైభవ సాధనకు ఐక్యతే ఏకైక మార్గం. అన్నింటికీ అదే ఏకైక విరుగుడు. యువత తన ముంగిట ఉన్న అపార అవకాశాలను వాడుకోవాలి’’ అన్నారు. ఎన్సీసీ 75వ వ్యవస్థాపక దినం సందర్భంగా ముద్రించిన 75 రూపాయల నాణేన్ని, కవర్‌ను విడుదల చేశారు. -
గుజ్జర్, బకర్వాల్, పహాడీ వర్గాలకు ఎస్టీ హోదా
రాజౌరీ(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో వెనక బడిన వర్గాలైన గుజ్జర్, బకర్వాల్, పహాడీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ పర్యటనలో ఉన్న అమిత్ మంగళవారం రాజౌరీలో ఏర్పాటుచేసిన ఒక ర్యాలీలో ప్రసంగించారు. ‘ జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ మూడు వర్గాల ప్రజలకు ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి. వీరికి కొత్తగా రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇప్పటికే ఎస్టీ కోటా లబ్ధి పొందుతున్న వర్గాలకు ఎలాంటి నష్టం జరగబోదు. మూడేళ్ల క్రితం ఆర్టికల్ 370, ఆర్టికల్ 35–ఏ రద్దుచేశాక నేడు ఈ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం వచ్చింది’ అని షా అన్నారు. ‘ఒక్క పహాడీలకే ఎస్టీ హోదా దక్కుతుందని కొందరు విష ప్రచారం చేసి గుజ్జర్, బకర్వాల్‌లను నిరసనలకు రెచ్చగొట్టారు. కానీ ఆ పాచికలు పారలేదు. గతంలో కేవలం మూడు కుటుంబాలే కశ్మీర్‌ను దశాబ్దాలపాటు ఏలాయి. ఇప్పుడు పంచాయతీ, జిల్లా మండళ్లకు జరిగిన పారదర్శకమైన ఎన్నికల ద్వారా 30 వేల మందికి తమ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అధికారమొచ్చింది’ అని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలను అమిత్ దుయ్యబట్టారు. ‘పునర్వ్యవస్థీకరణ తర్వాత రాజౌరీ, పూంచ్, దోడా, కిష్ట్వార్లలో సీట్లు పెరుగుతాయి. తర్వాతే రాష్ట్ర ఎన్నికలు ఉంటాయి. గతంలో రాష్ట్రానికొచ్చే కేంద్ర నిధులతో కొన్ని వర్గాలే లబ్ధి పొందేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడింది’ అని షా అన్నారు. సరిహద్దు జిల్లాలైన రాజౌరీ, పూంచ్‌లలో జనాభాలో 40 శాతం మంది బకర్వాల్, గుజ్జర్లే. పహాడీల జనాభా అతి స్వల్పం. 1991 ఏప్రిల్ నుంచి కశ్మీరీలు, డోగ్రాలకు 10 శాతం ఎస్టీ రిజర్వేషన్ ఫలాలు దక్కుతున్నాయి. తమకు రిజర్వేషన్ కల్పించాలని చాన్నాళ్లుగా పహాడీలు డిమాండ్ చేస్తుండగా గుజ్జర్, బకర్వాల్లు వ్యతిరేకిస్తున్నారు. 2020 జనవరి నుంచి ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో పహాడీలకు 4 శాతం కోటా కల్పించారు. -
గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తోన్న ఆందోళన ఫలించింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లను కల్పించింది. ఈ తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21% నుంచి 26%కు పెరిగాయి. తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ గత శుక్రవారం నుంచి గుజ్జర్ల నేత కిరోరీ సింగ్ భైన్సాలా నేతృత్వంలోని వివిధ కులాలు సవాయి మాధోపూర్ జిల్లాలోని ఢిల్లీ–ముంబై రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వీరికి రిజర్వేషన్లను కల్పించింది. -
గుజ్జర్ల ఆందోళనకు దిగొచ్చిన రాజస్థాన్ ప్రభుత్వం
-
గుజ్జర్ల ఆందోళన హింసాత్మకం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్ కోరుతూ రాజస్తాన్‌లో గుజ్జర్లు ప్రారంభించిన ఆందోళన మూడో రోజైన ఆదివారం హింసాత్మకంగా మారింది. రాజస్తాన్ మంత్రి విశ్వేంద్ర సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతినిధుల బృందం గుజ్జర్లతో జరిపిన చర్చలు సఫలం కాని నేపథ్యంలో ధోల్పూర్ జిల్లాలో ఆందోళనకారులు ఆగ్రా–మొరేనా రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా కొందరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో 8–10 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆందోళనకారులు 3 పోలీస్ వాహనాలకు నిప్పు పెట్టారు. పోలీస్ సిబ్బందిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపైకి బాష్పవాయువును ప్రయోగించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అల్లర్లు వ్యాపించకుండా ధోలాపూర్, కరౌలీ జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. మరోవైపు ఆందోళనకారులు వేర్వేరు నగరాల్లో జాతీయ రహదారులపై బైఠాయించారు. ఈ నేపథ్యంలో ఆందోళనలను నిలిపివేసేందుకు గుజ్జర్ ఆరక్షన్ సంఘర్షణ్ సమితి చీఫ్ కిరోరీ సింగ్ బైంస్లా నిరాకరించారు. రైకా–రెబారీ, గడియా లుహార్, బంజారా, గదరియా, గుజ్జర్ సామాజికవర్గాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేవరకూ వెనక్కు తగ్గబోమని స్పష్టం చేశారు. కాగా, ఆందోళనకారులు రైలు పట్టాలపై ధర్నాకు దిగడంతో రాజస్తాన్‌లో 20 సర్వీసులను అధికారులు రద్దుచేశారు. ఈ ప్రాంతంలో మరో 250 రైళ్లను దారి మళ్లించారు. కాగా, గుజ్జర్ల ఆందోళనలోకి సంఘవిద్రోహక శక్తులు చొరబడ్డాయని సీఎం అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. -
ఆ ఐదు కులాలకు కోటా..
జైపూర్ : గుజ్జర్లతో పాటు ఐదు కులాలకు ఒక శాతం రిజర్వేషన్లను వర్తింపచేసేందుకు రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అత్యంత వెనుకబడిన వర్గాల (ఎంబీసీ) కేటగిరీ కింద ఈ కోటాను ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఐదు కులాల వారు ఓబీసీ కేటగిరీ కింద 21 శాతం కోటాకు కూడా అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఈనెల 7న జైపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. తమకు కోటా కల్పించకుంటే ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో నిరసనలకు దిగుతామని గుజ్జర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంతో గుజ్జర్లు సహా గొదియా లొహర్, బంజారా, రైకా, గదారియా కులాలు లబ్ధి పొందనున్నాయి. ఆయా కులాలకు రిజర్వేషన్లకు సంబంధించి విద్యా సంస్థల్లో ప్రవేశానికి, ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకు రెండు వేర్వేరు ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. -
హర్దిక్ పటేల్‌పై ఇంకు దాడి
-
వెధవలను చేస్తున్నాడంటూ ఇంకు జల్లాడు
ఉజ్జయిని : పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఇంకుతో హర్దిక్‌పై దాడి చేశాడు. హఠాత్ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక అనుచరులు చితకబాదారు. శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దాడి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉజ్జయినిలో ఓ హెటల్ లో ప్రెస్ మీట్ కోసం హర్దిక్ బయలుదేరారు. అంతలో మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి దూసుకొచ్చి హర్దిక్‌పై ఇంకు పోసేశాడు. వెంటనే హర్దిక్ పక్కనున్న వ్యక్తులు మిలింద్‌ను కొట్టి.. ఆపై పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, పటీదార్, గుజ్జర్ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్ పోసినట్లు మిలింద్ వివరించాడు. అంతకు ముందు మిలింద్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ హర్దిక్ ఇంకు దాడి చేస్తానని ప్రకటించటం విశేషం. ఇక ఆ పరిణామాలను పట్టించుకోని హర్దిక్ తన ప్రెస్ మీట్‌ను కొనసాగించించాడు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. తాము అడ్డుకోబోమని.. ఆయన తరపున ప్రచారం కూడా చేస్తామని హర్దిక్ తెలిపారు. -
మేం కూడా గుజ్జర్లలాగా ఫైట్ చేస్తాం
నాంపల్లి: ఓసీల సమస్యలు పరిష్కరించకపోతే రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో ఉద్యమం చేపడతామని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకర్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. శుక్రవారం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సంఘం తెలుగు రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల సాధనకు రాజ్యాంగ సవరణ చేసే విధంగా ఎంపీలపై ఒత్తిడి తెస్తామన్నారు. ఓసీల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రకటించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. విద్యా, ఉద్యోగ, పదోన్నతులతోపాటు, ప్రైవేట్ రంగంలోనూ రిజర్వేషన్లు ప్రకటిస్తూ ఓసీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించడం సరికాదన్నారు. అగ్రవర్ణాల పేరుతో ఎందరో పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా నిరుపేద ఓసీల సమస్యల పరిష్కారం కోసం అనేక కమిటీలు వేసిన ప్రభుత్వాలు వాటని ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆరుకోట్ల మంది అగ్రవర్ణ పేదలను ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఓసీల అభివృద్థికి రాజస్థాన్, బీహార్ రాష్ట్రాల్లో కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లుగానే జాతీయ ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు.