ఉజ్జయిని : పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఇంకుతో హర్దిక్‌పై దాడి చేశాడు. హఠాత్ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక అనుచరులు చితకబాదారు. శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దాడి చోటు చేసుకుంది.
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉజ్జయినిలో ఓ హెటల్ లో ప్రెస్ మీట్ కోసం హర్దిక్ బయలుదేరారు. అంతలో మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి దూసుకొచ్చి హర్దిక్‌పై ఇంకు పోసేశాడు. వెంటనే హర్దిక్ పక్కనున్న వ్యక్తులు మిలింద్‌ను కొట్టి.. ఆపై పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, పటీదార్, గుజ్జర్ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్ పోసినట్లు మిలింద్ వివరించాడు. అంతకు ముందు మిలింద్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ హర్దిక్ ఇంకు దాడి చేస్తానని ప్రకటించటం విశేషం.
ఇక ఆ పరిణామాలను పట్టించుకోని హర్దిక్ తన ప్రెస్ మీట్‌ను కొనసాగించించాడు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. తాము అడ్డుకోబోమని.. ఆయన తరపున ప్రచారం కూడా చేస్తామని హర్దిక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment