ink attack
-
Rakesh Tikait: రాకేష్ టికాయత్‌పై ఇంకు దాడి
బెంగళూరు: రైతు సంఘాల నేత రాకేష్ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. టికాయత్‌తోపాటు యుద్విర్ సింగ్ ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్ మద్ధతుదారులేనని టికాయత్ చెప్తున్నారు. -
మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం
పాట్నా: కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఓ మహిళ చేతిలో ఘోర అవమానం జరిగింది. అంతకుముందు ఆయన పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల నల్లజెండాలు ఎదురుపడ్డాయి. పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంకు కేంద్ర మంత్రిపై చల్లింది. మంత్రి కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి మంత్రి దుస్తులు మార్చుకుని యథావిధిగా కార్యక్రమం కొనసాగించారు. ఓ పార్టీలో చిచ్చు రేపడంతోనే ఈ తీవ్ర నిరసనకు కారణమని తెలుస్తోంది. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో బిహార్‌లోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)కి చెందిన పశుపతి కుమార్ పారాస్ హాజీపూర్ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బిహార్‌లో రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా పశుపతి మారారు. ఆ ఫలితమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడానికి కారణం. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కించుకున్న పశుపతి తొలిసారి సొంత నియోజకవర్గం హాజీపూర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు పరాభవం ఎదురైంది. ఈ క్రమంలోనే అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ మరణంతో ఎల్జేపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్‌ను విబేధించాడు. ప్రస్తుతం పార్టీపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ చీల్చాడని పార్టీ వర్గాల్లో పశుపతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రిగా నియమితుడై తొలిసారిగా వస్తున్నప్పుడే ఈ పరాభవం ఎదురవడం గమనార్హం. చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు -
‘వారు ఇంక్ చల్లింది ప్రజాస్వామ్యం మీద’
పట్నా: కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్విని చౌబేకు పరాభవం ఎదురయ్యింది. డెంగ్యూ పేషెంట్లను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మంత్రిపై గుర్తు తెలియని వ్యక్తి ఇంకు చల్లాడు. వివరాలు.. బిహార్‌లో డెంగ్యూ వ్యాధి తీవ్రంగా ఉంది. ఐదు రోజుల్లోనే దాదాపు 1500 మందిలో డెంగ్యూ లక్షణాలను గుర్తించారు. ఒక్క రాజధానిలోనే దాదాపు 900 కేసులు నమోదయ్యాయి. తాజాగా రాష్ట్రంలో సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా డెంగ్యూ మరింత విజృంభించింది. ఈ నేపథ్యంలో అశ్విని చౌబే పట్నా మెడికల్ కాలేజీ అండ్ హస్పటల్‌ని సందర్శించారు. అనంతరం ఆస్పత్రి నుంచి తిరిగి వెళ్తుండగా ఓ వ్యక్తి అశ్విని చౌబేపై ఇంక్ చల్లాడు. అప్రత్తమైన భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోపే ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లి పోయాడు. అనంతరం అశ్విని చౌబే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది నా మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఆ వ్యక్తి మీడియా మీద ఇంక్ చల్లేందుకు ప్రయత్నించాడు. దాంతో కొంత ఇంక్ నా మీద పడింది. ఈ సంఘటన వెనక ఉన్న నేరస్తులు నేడు రాజకీయ నాయకులుగా ఎదగాలని చూస్తున్నారు. ఈ రోజు వారు ఇంక్ చల్లింది నా మీద కాదు.. ప్రజాస్వామ్యం మీద, జనాల మీద.. ప్రజాస్వామ్య మూల స్తంభం మీద’ అని చెప్పి వెళ్లి తన వాహనంలో కూర్చున్నారు. ఇక అశ్విని చౌబే మీద దాడి చేసిన వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే పప్పు యాదవ్ అనుచరుడిగా అనుమానిస్తున్నారు. -
జిగ్నేష్, కన్హయ్యపై సిరా దాడి
గ్వాలియర్: హిందూ సేనల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హిందూ సేన కార్యకర్త ఒకరు సిరాతో దాడికి పాల్పడ్డాడు. గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ సిరా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ‘సంవిధాన్ బచావో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సెమినార్‌కు వెళుతుండగా వీరిపై సిరా చల్లినట్టు వెల్లడించారు. వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ అనే వ్యక్తి ఇంక్ చల్లాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. సిరా దాడి జరిగినప్పటికీ జిగ్నేష్, కన్హయ్యకుమార్ సెమినార్లో పాల్గొన్నారని తెలిపారు. ముకేశ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఆదివారం జిగ్నేష్, కన్హయ్యకుమార్ దిష్టిబొమ్మలను తగులబెట్టిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
హర్దిక్ పటేల్‌పై ఇంకు దాడి
-
వెధవలను చేస్తున్నాడంటూ ఇంకు జల్లాడు
ఉజ్జయిని : పటీదార్ ఉద్యమ నేత హర్దిక్ పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి ఇంకుతో హర్దిక్‌పై దాడి చేశాడు. హఠాత్ పరిణామంతో యువనేత బిత్తర పోగా.. దాడి చేసిన వ్యక్తిని హర్దిక అనుచరులు చితకబాదారు. శనివారం మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో దాడి చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉజ్జయినిలో ఓ హెటల్ లో ప్రెస్ మీట్ కోసం హర్దిక్ బయలుదేరారు. అంతలో మిలింద్ గుజ్జర్ అనే వ్యక్తి దూసుకొచ్చి హర్దిక్‌పై ఇంకు పోసేశాడు. వెంటనే హర్దిక్ పక్కనున్న వ్యక్తులు మిలింద్‌ను కొట్టి.. ఆపై పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కాగా, పటీదార్, గుజ్జర్ తెగలను స్వప్రయోజనాల కోసం హర్దిక్ వెధవలను చేస్తున్నాడని.. అది తట్టుకోలేకనే ఇంక్ పోసినట్లు మిలింద్ వివరించాడు. అంతకు ముందు మిలింద్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ హర్దిక్ ఇంకు దాడి చేస్తానని ప్రకటించటం విశేషం. ఇక ఆ పరిణామాలను పట్టించుకోని హర్దిక్ తన ప్రెస్ మీట్‌ను కొనసాగించించాడు. బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ జ్యోతిరాదిత్య సింధియాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే.. తాము అడ్డుకోబోమని.. ఆయన తరపున ప్రచారం కూడా చేస్తామని హర్దిక్ తెలిపారు. -
ముఖ్యమంత్రిపై ఇంకు దాడి..
సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం హాజరైన ఆయన మీద ఇంకు జల్లేందుకు ఓ యువకుడు యత్నించగా.. సిబ్బంది అప్రమత్తతో ఆయన తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. శనివారం ఉదయం రాలేగావ్ సిద్ధీలో ఓ శంకుస్థాపన క్యార్యక్రమానికి సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ఆయనకు అత్యంత దగ్గరగా వచ్చేందుకు యత్నించాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఇంక్ బాటిల్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనెవరు? ఆ పని ఎందుకు చేయాలనుకున్నాడన్న విషయాలు తెలియాల్సి ఉంది. -
మాజీ సీఎంపై ఇంకు దాడి
నాగ్ పూర్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై ఓ వ్యక్తి ఇంకు దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న చవాన్ బహిరంగ సభలో మాట్లాడటానికి నిల్చొని ఉండగా ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయన ముఖంపై నల్ల ఇంకు చల్లాడు. చవాన్ పై ఇంకు దాడిని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఖండించారు. ప్రజాస్వామ్యం వ్యతిరేకత తెలియజేసే విధానం ఇది కాదని అన్నారు. ఇంకు చల్లిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. -
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు
-
కేంద్ర మంత్రిపై ఇంక్ చల్లిన విద్యార్థులు
భోపాల్: కేంద్ర మంత్రికి సమస్యలు విన్నవించుకోవాలనుకున్న విద్యార్థులు.. ఆగకుండా వెళ్లిపోతున్న ఆయనను ఆపేందుకు పరిధిదాటి ప్రవర్తించారు. మంత్రిగారిపైనే ఇంక్ చల్లారు. శనివారం భోపాల్ ఎయిమ్స్ లో చోటుచేసుకుందీ సంఘటన. అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు భోపాల్ ఎయిమ్స్ కు వచ్చిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను అదే కళాశాల మెడిసిన్ విద్యార్థులు చుట్టుముట్టారు. ఎయిమ్స్ లో నెలకొన్న సమస్యలను మంత్రికి విన్నవించుకోవాలనుకున్నారు. కానీ ఎంతకూ వినిపించుకోకపోవడంతో ఆయనపై ఇంక్ చల్లారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి మంత్రి నడ్డాను కారు వద్దకు తీసుకెళ్లి పంపించేశారు. 'మా కాలేజీలో అనేక సమస్యలున్నాయి. సరైన అధ్యాపకులు లేరు. వసతి కూడా దారుణంగా ఉంది. ఈ విషయాలను మంత్రిగారి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ ఆయన ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఎలాగైనా ఆపాలనే ఇంక్ చల్లాం తప్ప మరో ఉద్దేశం కాదు'అని విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసు ఫిర్యాదు దాఖలుకాలేదు. -
ఆమెకు బెయిల్ లభించలేదు!
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లిన 26 ఏళ్ల భావన అరోరాకు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. ఆమెను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సీఎం కేజ్రీవాల్‌పై భావన ఇంకు చల్లడం పబ్లిసిటీ స్టంట్ లాంటిదని, ఆమె చర్య శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, న్యాయంపై దాడి చేయడమేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. భావన ఇంకు దాడి వెనుక వాస్తవ ప్రేరేపణ ఏమిటో తాము తెలుసుకోదలిచామని న్యాయస్థానానికి నివేదించారు. ఈ కేసులో కోర్టు రహస్యంగా విచారణ జరుపుతున్నది. 'సరి-బేసి' అంకెల విధానం విజయవంతమైన సందర్భంగా ఢిల్లీలోని ఛత్రసల్ మైదానంలోని జరిగిన కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగిస్తుండగా గత ఆదివారం భావన ఆరోరా ఇంకు చల్లిన సంగతి తెలిసిందే. సీఎన్జీ స్టిక్కర్స్ కుంభకోణంలో ఆప్ ప్రమేయం ఉందంటూ ఆరోపిస్తూ ఆమె ఈ చర్యకు పాల్పడింది. -
'కేజ్రీవాల్‌ను చంపేందుకు ఇంకు దాడి రిహార్సల్'
-
'కేజ్రీవాల్‌ను చంపేందుకు ఇంకు దాడి రిహార్సల్'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను భౌతికంగా రూపుమాపే కుట్రకు ముందస్తు రిహార్సల్‌గానే ఆయనపై ఇంకు దాడి జరిగిందని ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపించింది. కేజ్రీవాల్‌కు భద్రత చేకూర్చడంలో ఢిల్లీ పోలీసులు కావాలనే తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడింది. 'కేజ్రీవాల్‌ను హతమార్చే ప్రయత్నంలో భాగంగానే ఇంకు దాడి జరిగి ఉంటుందనే అంశాన్ని మేం కొట్టిపారేయడం లేదు' అని ఆప్ నేత అశుతోష్ పేర్కొన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ నుంచి పంజాబ్‌కు ఓ ర్యాలీలో పాల్గొనేందుకు రైలులో వెళ్లారని, అయినా ఆయనకు భద్రతగా ఒక్క పోలీసు కూడా రైలులో వెంట రాలేదని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు నేరుగా కేంద్ర హోంశాఖకు కాకుండా ప్రధానమంత్రి కార్యాలయానికి రిపోర్ట్ చేస్తున్నారని, ఇందులో ఏదో తీవ్రమైన కుట్ర కనిపిస్తోందని ఆయన అన్నారు. -
'ఆ యువతిని అరెస్ట్ చేశాం'
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లిన యువతిని అరెస్ట్ చేశామని, ఆమెపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేజ్రీవాల్ కు తగిన సదుపాయాలు, భద్రత కల్పించామని ఆయన చెప్పారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ పై ఇంకు దాడి ఘటనకు సంబంధించి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కేజ్రీవాల్‌పై ఆదివారం భావన అరోరా(26) అనే యువతి ఇంకు చల్లింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన ఆమె ఇంకుతో దాడికి పాల్పడింది. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని మనీశ్ సిసోడియా ఆరోపించారు. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. -
కేజ్రీవాల్‌పై సిరా దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఆదివారం ఓ యువతి ఇంకు చల్లి నిరసన తెలిపింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన భావన అరోరా(26) ఆయనకు కొన్ని పేపర్లు చూపింది. వెంటనే తన దగ్గరున్న సిరాను కేజ్రీపై చల్లి, ఆగ్రహం ప్రకటించింది. కేజ్రీపై, అక్కడున్న మరికొందరిపైన ఇంకు పడింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. భావన సీఎన్జీ స్కాం గురించి చెబుతోందని, ఆమె దగ్గరున్న కాగితాలు తీసుకుని వదిలేయాలని సీఎం పోలీసులకు చెప్పారు. భావన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విడిపోయిన ఆమ్ ఆద్మీ సేన పంజాబ్ విభాగంలో సభ్యురాలని సమాచారం. పోలీసులు ఆమెపై ఐపీసీ 185, 353 సెక్షన్ల కింద కేసు పెట్టి, అరెస్ట్ చేసేందుకు మేజిస్ట్రేట్ అనుమతి కోరారు. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని ఆప్ ఆరోపించింది. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ సూపర్: హజారే రాలెగావ్‌సిద్ధి(మహారాష్ట్ర): ఒకప్పటి తన సహచరుడు కేజ్రీవాల్ ఆదర్శవాది, సచ్చరితుడని, రాజకీయాల్లో నైతిక విలువలకు కట్టుబడి ఉన్న నేత అని సామాజిక కార్యకర్త అన్నా హజారే పొగిడారు. కేజ్రీ ఢిల్లీ సీఎంగా బాధ్యత స్వీకరించినప్పటి నుంచి కేజ్రీవాల్ ఒక్క తప్పటడుగు కూడా చేయలేదని తన స్వగ్రామమైన రాలెగావ్ సిద్ధిలో అన్నారు. -
కేజ్రీవాల్‌పై యువతి ఇంకుదాడి!
-
'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా'
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ కు చెందిన స్వతంత్ర్య ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ పై ఢిల్లీలో నల్ల ఇంకుతో దుండగులు దాడి చేశారు. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఇదివరకే రషీద్‌ను తోటి సభ్యులు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోనే చితకబాదిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రషీద్ మోహం పై ఇంకు కుమ్మరించారు. 'గో మాతాకీ జై అంటూ' నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను రాజేశారు. 'భారత్‌లోకూడా తాలీబన్ల సంస్కృతి వస్తోంది. ఇది మోదీ ఇండియా, గాంధీ ఇండియా కాదు.. నా పై దాడికి పాల్పడింది ఎవరో తెలియదు. కానీ 80,000 మంది కశ్మీరీలను రాష్ట్రం కోల్పోయింది. నాపై ఇంకు చల్లితే సమస్య పరిష్కరం కాదంటూ' రషీద్ ఉద్యేగభరితంగా మీడియాతో మాట్లాడారు. ఈ దాడికి పాల్పడింది తామే అంటూ 'హిందూ సేన' ప్రకటించింది.