'ఆ యువతిని అరెస్ట్ చేశాం' | The girl who attacked Delhi CM with ink has been arrested | Sakshi
Sakshi News home page

'ఆ యువతిని అరెస్ట్ చేశాం'

Published Mon, Jan 18 2016 12:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

'ఆ యువతిని అరెస్ట్ చేశాం'

'ఆ యువతిని అరెస్ట్ చేశాం'

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఇంకు చల్లిన యువతిని అరెస్ట్ చేశామని, ఆమెపై కేసు నమోదు చేశామని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు. కేజ్రీవాల్ కు తగిన సదుపాయాలు, భద్రత కల్పించామని ఆయన చెప్పారు. సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కేజ్రీవాల్ పై ఇంకు దాడి ఘటనకు సంబంధించి చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తమపై ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.

కేజ్రీవాల్‌పై ఆదివారం భావన అరోరా(26) అనే యువతి ఇంకు చల్లింది. ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం విజయవంతం కావడంపై ప్రజలకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తుండగా, వేదికకు దగ్గరగా వెళ్లిన ఆమె ఇంకుతో దాడికి పాల్పడింది. కాగా, కేజ్రీపై ఇంకు దాడిలో బీజేపీ కుట్ర ఉందని, ఢిల్లీ పోలీసులూ భాగస్వాములని మనీశ్ సిసోడియా ఆరోపించారు. సరి-బేసి విధానం విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేక, మనుషుల్ని చంపేందుకూ వెనకాడబోరని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement