మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం | Women Thrown Ink On Union Minister Pasupati Kumar Paras | Sakshi
Sakshi News home page

మహిళ చేతిలో కేంద్ర మంత్రికి ఘోర అవమానం

Published Mon, Aug 23 2021 8:59 PM | Last Updated on Mon, Aug 23 2021 9:44 PM

Women Thrown Ink On Union Minister Pasupati Kumar Paras - Sakshi

పాట్నా: కేంద్ర మంత్రిగా అయిన తర్వాత తొలిసారి తన నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు ఓ మహిళ చేతిలో ఘోర అవమానం జరిగింది. అంతకుముందు ఆయన పర్యటనను నిరసిస్తూ పలుచోట్ల నల్లజెండాలు ఎదురుపడ్డాయి. పలువురు నిరసనలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇంకు కేంద్ర మంత్రిపై చల్లింది. మంత్రి కుర్తాపై ఇంకు మరకలు పడ్డాయి. ఇది జరిగిన కాసేపటికి మంత్రి దుస్తులు మార్చుకుని యథావిధిగా కార్యక్రమం కొనసాగించారు. ఓ పార్టీలో చిచ్చు రేపడంతోనే ఈ తీవ్ర నిరసనకు కారణమని తెలుస్తోంది.
చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్‌ వీడియో

బిహార్‌లోని లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ)కి చెందిన పశుపతి కుమార్‌ పారాస్‌ హాజీపూర్‌ నుంచి ఎంపీగా గెలిచారు. ఇటీవల బిహార్‌లో రాజకీయ పరిణామాలకు కేంద్ర బిందువుగా పశుపతి మారారు. ఆ ఫలితమే కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడానికి కారణం. ఇటీవల జరిగిన మంత్రివర్గ కూర్పులో స్థానం దక్కించుకున్న పశుపతి తొలిసారి సొంత నియోజకవర్గం హాజీపూర్‌లో సోమవారం పర్యటించారు. ఈ సమయంలో ఆయనకు పరాభవం ఎదురైంది.

ఈ క్రమంలోనే అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ పార్టీ అధినేత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ మరణంతో ఎల్‌జేపీలో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ను విబేధించాడు. ప్రస్తుతం పార్టీపై వివాదం కొనసాగుతోంది. రాజకీయ అవసరాల కోసం పార్టీ చీల్చాడని పార్టీ వర్గాల్లో పశుపతిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఆయన కేంద్రమంత్రిగా నియమితుడై తొలిసారిగా వస్తున్నప్పుడే ఈ పరాభవం ఎదురవడం గమనార్హం.

చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement