Black Ink was Thrown on Farmer Leader Rakesh Tikait In Karnataka - Sakshi
Sakshi News home page

రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై ఇంక్‌ దాడి.. వాళ్లే పనే అని అనుమానం!

Published Mon, May 30 2022 1:56 PM | Last Updated on Mon, May 30 2022 2:49 PM

Black ink thrown on farmer leader Rakesh Tikait At Karnataka - Sakshi

బెంగళూరు: రైతు సంఘాల నేత రాకేష్‌ టికాయత్‌పై కర్ణాటకలో దాడి జరిగింది. బెంగళూరులో సోమవారం ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. రసాభాసా నెలకొంది. ఆయన ముఖంపై కొందరు సిరా చల్లి దాడి చేశారు. 

టికాయత్‌తోపాటు యుద్విర్‌ సింగ్‌  ముఖంపై నల్లసిరా చల్లింది ఆయన వ్యతిరేక వర్గమని తెలుస్తోంది. అంతేకాదు ఆయనపై కుర్చీలు విసిరారు నిరసనకారులు. ఈ క్రమంలో అక్కడున్నవాళ్లు దాడిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. 
 
కర్ణాటక రైతు నేత కొడిహల్లి చంద్రశేఖర్‌ డబ్బు తీసుకుంటూ స్థానిక మీడియా స్టింగ్‌ ఆపరేషన్‌కు పట్టుబడ్డారు. ఈ ఘటనపై టికాయత్‌, సింగ్‌లు వివరణ ఇచ్చే సమయంలోనే దాడి జరిగింది. 

ఆ ఘటనలో తమ ప్రమేయం లేదంటూ వాళ్లు వివరణ ఇవ్వబోతుండగా.. కొందరు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉంటే.. దాడికి పాల్పడింది చంద్రశేఖర్‌ మద్ధతుదారులేనని టికాయత్‌ చెప్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement