
జిగ్నేష్ మేవాని, కన్హయ్యకుమార్
గ్వాలియర్: హిందూ సేనల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో హిందూ సేన కార్యకర్త ఒకరు సిరాతో దాడికి పాల్పడ్డాడు. గుజరాత్ శాసనసభ్యుడు జిగ్నేష్ మేవాని, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్యకుమార్ సిరా దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ‘సంవిధాన్ బచావో’ ఆందోళన కార్యక్రమంలో భాగంగా స్థానిక చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సెమినార్‌కు వెళుతుండగా వీరిపై సిరా చల్లినట్టు వెల్లడించారు. వీరిపై హిందూ సేనకు చెందిన ముకేశ్ పాల్ అనే వ్యక్తి ఇంక్ చల్లాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.
సిరా దాడి జరిగినప్పటికీ జిగ్నేష్, కన్హయ్యకుమార్ సెమినార్‌లో పాల్గొన్నారని తెలిపారు. ముకేశ్ పాల్‌ను అరెస్ట్ చేశారు. కాగా, ఆదివారం జిగ్నేష్, కన్హయ్యకుమార్ దిష్టిబొమ్మలను తగులబెట్టిన మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment