లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. బీజేపీ 195 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించగా, కాంగ్రెస్ కూడా త్వరలో ఈ జాబితాను విడుదల చేయనుంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఢిల్లీలోని చాందినీ చౌక్, నార్త్-వెస్ట్, ఈశాన్య సీట్ల కోసం పార్టీ పలువురి పేర్లను చర్చిస్తోంది. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తు కుదిరిన నేపధ్యంలో ఢిల్లీలోని ఏడు స్థానాలలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. ఈ సీట్లలో పోటీకి నిలబెట్టేందుకు కొన్ని కొత్త పేర్లతో పాటు పాత అభ్యర్థులు, కులాల సమీకరణకు తగిన అభ్యర్థులు ఎవరనే అంశంపై కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది.
ఇందుకోసం కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ పలు సమావేశాలు నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చాందినీ చౌక్ నుంచి అభ్యర్థిత్వం కోసం భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, మాజీ ఎమ్మెల్యే హరిశంకర్ గుప్తా, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ పోటీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
అలాగే ఈశాన్య ఢిల్లీ స్థానం నుంచి కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్ లవ్లీ, ఢిల్లీ కాంగ్రెస్ మాజీ చీఫ్ చౌదరి అనిల్ కుమార్, ఢిల్లీ సీనియర్ నేత ఛత్తర్ సింగ్ పోటీదారులుగా ఉన్నట్లు తెలుస్తోంది. జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా ఈ రేసులో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నార్త్-వెస్ట్ ఢిల్లీకి కేంద్ర మాజీ మంత్రి కృష్ణ తీరథ్, ఢిల్లీ మాజీ మంత్రి రాజ్ కుమార్ చౌహాన్, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్, బవానా మాజీ ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఈ జాబితాను ఇంకా విడుదల చేయలేదు. ఈ మూడు స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారిని ఎంపిక చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment