'గాంధీ ఇండియా కాదు.. మోదీ ఇండియా'
ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ కు చెందిన స్వతంత్ర్య ఎమ్మెల్యే ఇంజినీర్ రషీద్ పై ఢిల్లీలో నల్ల ఇంకుతో దుండగులు దాడి చేశారు. బీఫ్ పార్టీ ఇచ్చినందుకు ఇదివరకే రషీద్ను తోటి సభ్యులు జమ్మూకశ్మీర్ అసెంబ్లీలోనే చితకబాదిన విషయం తెలిసిందే. అయితే ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం రషీద్ మోహం పై ఇంకు కుమ్మరించారు. 'గో మాతాకీ జై అంటూ' నినాదాలు చేస్తూ ఉద్రిక్తతను రాజేశారు.
'భారత్లోకూడా తాలీబన్ల సంస్కృతి వస్తోంది. ఇది మోదీ ఇండియా, గాంధీ ఇండియా కాదు.. నా పై దాడికి పాల్పడింది ఎవరో తెలియదు. కానీ 80,000 మంది కశ్మీరీలను రాష్ట్రం కోల్పోయింది. నాపై ఇంకు చల్లితే సమస్య పరిష్కరం కాదంటూ' రషీద్ ఉద్యేగభరితంగా మీడియాతో మాట్లాడారు. ఈ దాడికి పాల్పడింది తామే అంటూ 'హిందూ సేన' ప్రకటించింది.