ముఖ్యమంత్రిపై ఇంకు దాడి.. | CM Fadnavis escaped from ink attack | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిపై ఇంకు దాడి..

Published Sat, Nov 4 2017 1:39 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

CM Fadnavis escaped from ink attack  - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమం కోసం హాజరైన ఆయన మీద ఇంకు జల్లేందుకు ఓ యువకుడు యత్నించగా.. సిబ్బంది అప్రమత్తతో ఆయన తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నారు.

శనివారం ఉదయం రాలేగావ్‌ సిద్ధీలో ఓ శంకుస్థాపన క్యార్యక్రమానికి సీఎం ఫడ్నవిస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ యువకుడు ఆయనకు అత్యంత దగ్గరగా వచ్చేందుకు యత్నించాడు. అది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని నిలువరించి అదుపులోకి తీసుకున్నారు. 

అతని నుంచి ఇంక్‌ బాటిల్‌ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతనెవరు? ఆ పని ఎందుకు చేయాలనుకున్నాడన్న విషయాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement