జైపూర్: ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తోన్న ఆందోళన ఫలించింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
ఈ బిల్లులో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లను కల్పించింది. ఈ తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21% నుంచి 26%కు పెరిగాయి. తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ గత శుక్రవారం నుంచి గుజ్జర్ల నేత కిరోరీ సింగ్ భైన్సాలా నేతృత్వంలోని వివిధ కులాలు సవాయి మాధోపూర్ జిల్లాలోని ఢిల్లీ–ముంబై రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వీరికి రిజర్వేషన్లను కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment