Rajasthan assembly
-
రాజస్థాన్ పీఠంపై బీజేపీ కన్ను.. ఎన్నికల సన్నద్ధత షురూ!
జైపుర్: దేశంలోని ఒక్కో రాష్ట్రంలో పాగా వేస్తూ తన ప్రబల్యాన్ని విస్తరించుకుంటోంది భారతీయ జనతా పార్టీ. తాజాగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే 2023లో శాసనసభ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్‌లో పాగా వేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 10 నుంచి 12 వరకు మూడు రోజుల పాటు కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయమై రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ కార్యకర్తలు, నేతలకు ఈ క్యాంప్‌కు హాజరయ్యే జాతీయ స్థాయి నాయకులు ఎన్నికల వ్యూహాలను వివరించనున్నారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా వారికి శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ శిబిరం ప్రారంభానికి ఒక రోజు ముందే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జైపుర్ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ట్రైనింగ్ క్యాంప్ అనంతరం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపూర్ శర్మకు మద్దతు తెలిపిన హిందూ వ్యక్తి హత్యకు గురైన విషయం, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులపై ఈ భేటీలో చర్చించనున్నారు. శిక్షణ శిబిరానికి వచ్చే నేతలెవరు? రాజస్థాన్‌లో మూడు రోజుల పాటు నిర్వహించి ట్రైనింగ్ క్యాంప్‌కు పలువురు జాతీయ స్థాయి నేతలు హాజరుకానున్నారు. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు వీ సతీశ్, బీఎల్ సంతోష్, రాజస్థాన్ బీజేపీ అధ్యక్షుడు సతీశ్ పూనియా, కేంద్ర మంత్రులు.. కైలాశ్ చౌదరి, అరుణ్ రామ్ మెఘ్వాల్, గజేంద్ర సింగ్ శేఖావత్, ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా, మాజీ ముఖ్యమంత్రి వసుందర రాజే సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. చదవండి: మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం -
రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో మాట్లాడారు. ఆ తరువాత గవర్నర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్ భేటీలో గహ్లోత్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. జైపూర్ శివార్లలోని ఒక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్ నేతృత్వంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్ వద్ద గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చేందుకు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్ గార్గ్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం. కానీ, ఇప్పటివరకు గవర్నర్ నుంచి స్పందన లేదు. పైలట్ వర్గం ప్రస్తుతానికి సేఫ్ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది. -
కేరళ, పంజాబ్ బాటలో రాజస్తాన్..!
జైపూర్: పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు చల్లారడం లేదు. వివాదాస్పద సీఏఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్తాన్ తీర్మానాన్ని ఆమోదించింది. గతంలో సీఏఏకు వ్యతిరేకంగా కేరళ, పంజాబ్ రాష్ట్రాలు కూడా ఇలాగే చేశాయి. అయితే రాజస్తాన్‌లో సభలో తీర్మానం ప్రవేశపెట్టే సమయంలో.. అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లారు. సీఏఏను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. ఇదే విషయంపై కేరళ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టుకు వెళ్లగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. అంతకుముందు రాజస్తాన్ కేబినెట్ సీఏఏ వ్యతిరేక ప్రతిపాదనను ఓ సర్క్యులేషన్ ద్వారా ఆమోదించింది. ఈ చట్టాన్ని తమ ప్రభుత్వం అమలు చేయబోదని సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. సంవిధాన్ బచావో ర్యాలీ పేరిట ఈ చట్టాన్ని నిరసిస్తూ ఈ నెల 22 న జరిగిన ఓ ర్యాలీకి ఆయన నేతృత్వం వహించడం కూడా విశేషం. ('రాహుల్.. దమ్ముంటే సీఏఏపై 10 వాక్యాలు మాట్లాడు') (సీఏఏపై కేరళ సంచలన నిర్ణయం) -
గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తోన్న ఆందోళన ఫలించింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లను కల్పించింది. ఈ తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21% నుంచి 26%కు పెరిగాయి. తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ గత శుక్రవారం నుంచి గుజ్జర్ల నేత కిరోరీ సింగ్ భైన్సాలా నేతృత్వంలోని వివిధ కులాలు సవాయి మాధోపూర్ జిల్లాలోని ఢిల్లీ–ముంబై రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వీరికి రిజర్వేషన్లను కల్పించింది. -
గుజ్జర్ల ఆందోళనకు దిగొచ్చిన రాజస్థాన్ ప్రభుత్వం
-
రాజస్థాన్ రాష్ట్రంలో భారీ పోలింగ్ నమోదు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. 200 అసెంబ్లీ సీట్లకు జరిగిన ఈ ఎన్నికల్లో 72.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రస్తుతం సమాచారం మేరకు రాష్ట్ర జనాభాలో సుమారుగా మూడు కోట్ల మంది పోలింగ్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. కాగా, పోలింగ్ నమోదు ఇంకా పెరిగే అవకాశం ఉండవచ్చన్నారు. సాయంత్రం 5గం.ల వరకూ ఓటర్లు భారీగా రావడంతో ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. జైసల్మర్ జిల్లాలో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు అవ్వగా, భరత్పూర్ 55 శాతం మాత్రమే నమోదైంది. రాష్ట్ర రాజధాని జైపూర్‌లో 68శాతం మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 199 నియోజక వర్గాలకు చెందిన ఈ ఎన్నికల్లో 2,087 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇదిలా ఉండగా చురు నియోజక వర్గానికి జరగాల్సిన పోలింగ్ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా పడింది. ఈ ఎన్నికల్లో విజయంపై కాంగ్రెస్, బీజేపీ లు భారీ ఆశలు పెట్టుకున్నాయి. గెలుపుపై ఇరుపార్టీలు తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. -
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజస్థాన్ వాసులు పొలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. రాజస్థాన్ శాసనసభకు 200 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. 2087 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే చురు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి మృతి చెందాడు. దాంతో ఆ నియోజకవర్గం పోలింగ్ డిసెంబర్ 13న వాయిదా వేసన సంగతి తెలిసిందే.