రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజస్థాన్ వాసులు పొలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు.
రాజస్థాన్ శాసనసభకు 200 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. 2087 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే చురు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి మృతి చెందాడు. దాంతో ఆ నియోజకవర్గం పోలింగ్ డిసెంబర్ 13న వాయిదా వేసన సంగతి తెలిసిందే.