Churu
-
PM Narendra Modi: అసలైన అభివృద్ధి ముందుంది
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్‌గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు. ‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు. -
బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ రాహుల్ కుశ్వాన్
జైపూర్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు నేతలు పార్టీల మారుతూ సార్వత్రిక సమరాన్ని మరింత ఆసక్తి రేపుతున్నారు. కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి.. బీజేపీ నేతలు కాంగ్రెస్‌లోకి వరుస కడుతున్నారు. తాజాగా రాజస్తాన్‌లోని చురూ సెగ్మెంట్‌కు చెందిన ఎంపీ బీజేపీకి షాక్ ఇచ్చారు. రాహుల్ కుశ్వాన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవకి రాజీనామా చేసి.. సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ‘నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సహకరించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే, సీనియర్ నేత సొనియా గాంధీ, రాహుల్ గాంధీ, గోవింద్ సింగ్ దోస్తారా, ఇతర నేతలకు ధన్యవాదాలు’ అని కాంగ్రెస్ చేరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతకంటే ముందు.. ప్రజాజీవితంగా గురించి పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నానని రాహుల్ కుశ్వాన్ ‘ఎక్స్’(ట్వీటర్) వేదికగా వెల్లడించారు. ‘కొన్ని రాజకీయ కారణాల రీత్యా ఈ రోజు కీలక పరిణామం జరగబోతుంది. నేను బీజేపీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నా’అని పేర్కొన్నారు. అదేవిధంగా చురూ నియోజకవర్గ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే లోక్‌సభలో ఎన్నికల్లో చురూ సెగ్మెంట్ నుంచి బీజేపీ టికెట్ తిరస్కరించిన నేపథ్యంలో రాహుల్ కుశ్వాన్ పార్టీ మారటం గమనార్హం. బీజేపీ మొదటి జాబితాలో చురూ లోక్‌సభ స్థానంలో రాహుల్ కుశ్వాన్ బదులు పారా ఒలింపియన్ దేవేంద్ర ఝఝరియాను బరిలోకి దించిన విషయం తెలిసిందే. చదవండి: డీప్‌ఫేక్ బారినపడ్డ యోగి ఆదిత్యనాథ్ -
ఏమిటి నేను చేసిన నేరం? బీజేపీ ఎంపీ తీవ్ర ఆవేదన!
భారతీయ జనతా పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించింది. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి కొత్త వ్యక్తి దేవేంద్ర ఝజారియాకు టిక్కెట్ ఇచ్చింది. అయితే ప్రస్తుతం చురు ఎంపీగా ఉన్న రాహుల్ కశ్వాన్.. తనను తప్పించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు తన చురు స్థానం నుంచి మరో అభ్యర్థిని బీజేపీ బరిలోకి దించగా రాహుల్ కశ్వాన్ సోషల్ మీడియాలో తన స్పందనను తెలియజేశారు. కస్వాన్ తన ‘ఎక్స్’ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "నా నేరం ఏమిటి? నేను నిజాయితీగా లేనా? కష్టపడి పనిచేయలేదా? విధేయుడిని కాదా? నేను ఏమి కళంకం తెచ్చాను? చురు లోక్‌సభలో పనిచేయలేదా? ఏదైనా పొరపాటు జరిగిందా?" అంటూ ప్రశ్నలు సంధించారు. "ప్రధానమంత్రి అన్ని పథకాల అమలులో నేను ముందంజలో ఉన్నాను. ఇంకా ఏమి కావాలి? ఈ ప్రశ్న ఎవరిని అడిగినా మౌనమే వినిపిస్తోంది. ఎవరూ సమాధానం చెప్పలేక పోతున్నారు" అంటూ వాపోయారు. అయితే రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమని, టిక్కెట్ దక్కలేదన్న నైరాశ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా భావిస్తున్నారు. కాగా రాహుల్ కస్వాన్ తండ్రి రామ్ సింగ్ కూడా చురు నుంచి బీజేపీ ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. అలాగే రాహుల్ తల్లి కమలా కశ్వాన్ కూడా సాదుల్పూర్ నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికలకు రాజస్థాన్‌లోని 25 స్థానాలకు గాను 15 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో పాటు నలుగురు కేంద్ర మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. -
Devendra Jhajaria: పార్లమెంట్ బరిలో పతకాల వీరుడు
Paralympian Devendra Jhajaria: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. క్రీడా ప్రపంచంలో పేరుగాంచిన అథ్లెట్ దేవేంద్ర ఝజారియా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పారాలింపిక్స్‌లో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించిన రాజస్థాన్‌కు చెందిన దేవేంద్ర ఝజారియా 2024 లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. రాజస్థాన్‌లోని చురు లోక్‌సభ స్థానం నుంచి ఆయనకు బీజేపీ అవకాశం కల్పించింది. భారత పారాలింపియన్ దేవేంద్ర ఝజారియా జావెలిన్ త్రోయర్. 2004 ఏథెన్స్లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో తన మొదటి బంగారు పతకాన్ని సాధించారు. అంతేకాదు దేశానికి రెండో పారాలింపిక్ బంగారు పతకాన్ని అందించిన క్రీడాకారుడు దేవేంద్ర ఝజారియా. ఒలింపిక్స్ లేదా పారాలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత స్వర్ణ పతకాలు సాధించిన ఏకైక భారతీయుడు కూడా ఈయనే. రాజస్థాన్‌లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికలకు వీటిలో 15 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ తన తొలి జాబితాలో విడుదల చేసింది. వీరిలో పారాలింపియన్ దేవేంద్ర ఝజారియాతోపాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, నలుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. దేవేంద్ర ఝజారియాకు టికెట్ ఇవ్వడం కోసం చురు నుండి రెండుసార్లు ఎంపీగా గెలిచిన రాహుల్ కశ్వాన్‌ను బీజేపీ పక్కన పెట్టింది. ఈసారి ఆయనకు ఇక్కడి నుంచి టిక్కెట్ దక్కలేదు. క్రీడా క్షేత్రంలో పతకాలు గెలిచిన దేవేంద్ర ఝజారియా ప్రజా క్షేత్రంలో గెలుస్తాడో లేదో చూడాలి. -
మరిదిని చంపి.. వదినపై పోలీసుల గ్యాంగ్ రేప్!
సాక్షి, జైపూర్: దొంగతనం చేశారంటూ దళితులైన మరిది, వదినను అరెస్టు చేసిన కేసులో.. కస్టడీలో ఉన్న మరిది చనిపోవడం, పోలీసులు తనపై సామూహిక అత్యాచారం చేశారంటూ వదిన వాంగ్మూలం ఇవ్వడం రాజస్థాన్‌లో సంచలనం రేపుతోంది. దీనిపై స్పందించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీతో పాటు స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక హెడ్ కానిస్టేబుల్, ఆరుగురు కానిస్టేబుళ్లను సస్సెండ్ చేసింది. అంతేకాక, జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్‌తో విచారణకు ఆదేశించింది. ’రాజస్థాన్‌లోని చురు పోలీసులు దొంగతనం కేసులో నా తమ్ముడి(22)ని జూన్ 30న అనుమానితుడిగా తమ అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న నా భార్య(35)ను తీసుకెళ్లారు. ఆ తర్వాత 6వ తేదీ రాత్రి నా తమ్ముడిని చిత్ర హింసలు పెట్టి చంపేశారు. ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న నా భార్యపై సామూహికంగా అత్యాచారం చేసి, చేతి గోర్లను పీకేసి హింసించారు. ఎనిమిది రోజుల పాటు నా భార్యను అక్రమంగా నిర్బంధించి తమ్ముడు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత 10వ తేదీన విడిచిపెట్టారు’ అని మృతుని సోదరుడు మీడియాకు తెలిపారు. మృతుని సోదరి మాట్లాడుతూ.. 6వ తేదీన తన తమ్ముడిని గ్రామానికి తీసుకొచ్చి ఇదే నీ చివరి చూపని చెప్పారని విలపిస్తూ చెప్పింది. 8 రోజుల తర్వాత వచ్చిన వదిన ఆరోగ్య పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పింది. ఈ దొంగతనం కేసులో మరిది, వదినలను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఎలాంటి చార్జిషీట్ దాఖలు చేయలేదని తమ దృష్టికి వచ్చిందని చురు జిల్లా అదనపు ఎస్పీ ప్రశాంత్ కుమార్ శర్మ వెల్లడించారు. మృతుని పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందనీ, మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చామన్నారు. సామూహిక అత్యాచారం కేసులో బాధిత మహిళ వాంగ్మూలం తీసుకున్నామనీ, ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని క్రైమ్ బ్రాంచ్ అదనపు డీజీపీ బీఎల్ సోనీ పేర్కొన్నారు. -
ఆ 8 ప్రాంతాలు మండిపోతున్నాయి...
సాక్షి, న్యూఢిల్లీ : భూగోళం అగ్నిగోళంగా మారుతోంది. ప్రపంచంలోనే అట్టుడుకిపోతోన్న 15 ప్రాంతాల్లో ఉత్తర, కేంద్ర భారత్‌లోని ఎనిమిది ప్రాంతాలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో రాజస్తాన్‌లోని చురు, గంగానగర్ ప్రాంతాలున్నాయని ‘ఎల్ డొరాడో’ అనే వాతావరణ సంస్థ వెబ్సైట్ సోమవారం వెల్లడించింది. ఆదివారం నాడు చురులో 48.9, గంగానగర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. వాటితోపాటు రాజస్తాన్‌లోని ఫలోడి, బికనర్, జైసాల్మర్, మధ్యప్రదేశ్‌లోని నౌగాంగ్, కజూరహో, హర్యానాలోని నార్నౌల్ ప్రాంతాలు మండిపోతున్నాయి. నైరుతి, కేంద్ర భారత్ ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు మరో రెండు రోజులపాటు కొనసాగి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు, తూర్పు రాజస్థాన్, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, సౌరాష్ట్ర, కచ్, విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో మోస్తారు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పాకిస్థాన్, రాజస్తాన్ ఎడారుల్లో ఉత్పన్నమైన వేడి కారణంగా ఈ వడగాలులు వీస్తున్నాయని, రాళ్లవాన, ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల మరో రెండు రోజుల్లో వాతావరణం చల్లబడే అవకాశం ఉందని వెల్లడించింది. రాజస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో ఓ రైతు సహా ముగ్గురు మరణించారు. తూర్పు, ఉత్తర భారత్ ప్రాంతాల్లో జూన్ 7 నుంచి 9 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ మారుమూల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
సుర్రుమన్న ఛురు
న్యూఢిల్లీ: భారత్‌పై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో శనివారం సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్తాన్‌లోని ఛురు ప్రాంతంలో ఏకంగా 50.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే వారం రోజులవరకూ దేశమంతటా ఇదేతరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఢిల్లీలో 46.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు పాలమ్ అబ్జర్వేటరీ తెలిపగా, 46.1 డిగ్రీలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో ఎండ తీవ్రతను సూచించే రెడ్ కేటగిరి హెచ్చరికను ఐఎండీ జారీచేసింది. రాజస్తాన్‌లోని గంగానగర్‌లో 49 డిగ్రీలు, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా బందాలో 48.4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. రాబోయే ఐదు రోజులు మధ్యప్రదేశ్, రాజస్తాన్, విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హరియాణాలోని నర్నౌల్లో 47.2 డిగ్రీలు,పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో 45.7 డిగ్రీలు, లూథియానాలో 44.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చల్లగా ఉండే హిమాచల్‌ప్రదేశ్‌లోనూ ఎండలు చుక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉనాలో శనివారం 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. ఇక జమ్మూకశ్మీర్‌లోని జమ్మూలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మహారాష్ట్ర, హిమాచల్, తూర్పు మధ్యప్రదేశ్ ఉత్తర కర్ణాటకలోని కొన్నిప్రాంతాల్లో సాధారణం కంటే 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైనట్లు వెల్లడించింది. రాయలసీమ, కేరళ, విదర్భ, హరియాణాలోని కొన్నిప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3–5 డిగ్రీలు అధికంగా రికార్డైనట్లు పేర్కొంది. ఒడిశాలోని దక్షిణ భాగంలో అధికతేమ కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. -
రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభం
రాజస్థాన్ రాష్ట్ర శాసనసభకు ఆదివారం ఉదయం 8.00 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో 199 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. దాదాపు నాలుగు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజస్థాన్ వాసులు పొలింగ్ కేంద్రాల వైపు అడుగులు వేస్తున్నారు. రాజస్థాన్ శాసనసభకు 200 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది. 2087 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే చురు నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి మృతి చెందాడు. దాంతో ఆ నియోజకవర్గం పోలింగ్ డిసెంబర్ 13న వాయిదా వేసన సంగతి తెలిసిందే.