గత పదేళ్ల పాలన భోజనంలో ఒక స్టార్టర్ మాత్రమే: మోదీ
జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీ తమ పదేళ్లకాలంలో దేశంలో జరిగిన అభివృద్ధిని ఆకలి పుట్టించే స్టార్టర్‌గా అభివరి్ణంచారు. అసలైన అభివృద్ధి భోజనం ముందుందని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. భారత సైన్యాన్ని కాంగ్రెస్ అవమానిస్తోందని ఇదే కాంగ్రెస్ అసలైన మనస్తత్వమని విపక్ష పార్టీపై మోదీ విమర్శలు గుప్పించారు.
‘ ఇప్పుడున్న నయా భారత్ శత్రువును ఇంట్లోకి చొరబడి మరీ దెబ్బ కొట్టగలదు. శత్రువు గడ్డపైనా దాడి చేసే సరికొత్త భారత్ ఆవిష్కృతమైంది’ అని అన్నారు. ‘‘ గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఒక ట్రైలర్ మాత్రమే. అది భోజనాల వేళ ఆకలి పుట్టించే స్టార్టర్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్సు భోజనం(అభివృద్ధి) ముందుంది. చేయాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి మనం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment