తిరుపతి, సాక్షి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల శిలాతోరణం వరకు క్యూలైన్‌లో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం కాగా, సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది.
ఇక.. నిన్న(శుక్రవారం) 71,510 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 43,199 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా లెక్క తేలింది.
నేడు ఆగష్టు కోటా టికెట్లు
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల.
సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ సేవా టికెట్లు మే 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
టికెట్లు పొందిన వారు మే 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.
మే 17 ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవాటికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్రోత్సవాల సేవా టికెట్లను విడుదల.
మే 21న మద్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదల.
మే 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ టికడట్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా విడుదల.
మే 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
మే 24 మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల.
https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచన.
Comments
Please login to add a commentAdd a comment