Tirupati: Srivari Arjitha Seva Tickets Will Release On 19 June - Sakshi
Sakshi News home page

తిరుమల: 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల

Published Sat, Jun 17 2023 7:43 AM | Last Updated on Sat, Jun 17 2023 4:03 PM

Tirupati: Srivari Arjitha Seva Tickets Quota Release 19 June - Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం షెడ్యూల్‌ ప్రకారం శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా సెప్టెంబరు నెల కోటాను జూన్‌ 19న విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.  సుప్రభాతం, అర్చన, తోమాల, అషాదటళ పాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్‌లైన్‌ లక్కీ డిప్‌ కోసం జూన్‌ 19న ఉదయం 10గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్కీడిప్‌లో టికెట్లు పొందిన భక్తులు నగదు చెల్లించి టికెట్‌ను ఖరారు చేసుకోవాలి. 

కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవాకు సంబంధించిన టికెట్లు జూన్‌ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. సెప్టెంబరు మాసం కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్‌ సేవల కోటా, సంబంధించిన దర్శన టికెట్ల  జూన్‌ 22న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. సెప్టెంబరు నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను ఈనెల 23న 10 గంటలకు విడుదల చేస్తారు. ఆగస్టు 27 నుంచి 29 వరకు జరగనున్న పవిత్రోత్సవాల సేవా టికెట్ల కోటాను ఈ నెల 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

చదవండి: ఏది నిజం?: అసలే డ్రామోజీ.. చేతిలో ‘ఛీ’నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement