TDP Leaders Arrested In Jagajjanani Chit Funds Scam, Details Inside - Sakshi
Sakshi News home page

జగజ్జనని చిట్‌ ఫండ్స్‌.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్‌ 

Published Sun, Apr 30 2023 12:55 PM | Last Updated on Sun, Apr 30 2023 4:09 PM

TDP Leaders Arrested In Jagajjanani Chit Funds Scam - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కుటుంబీకులు చిట్‌ఫండ్‌ నిర్వహిస్తున్నారు. అయితే, ప్రజల నుంచి చిట్స్‌ వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారనే విషయం బయటకు వచ్చింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై సీఐడీకి కాకినాడ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నకిలీ ఖాతాలను సృష్టించి మోసాలకు పాల్పడినట్టు, చిట్స్‌ చెల్లింపుల్లోనూ అక్రమాలకు పాల్పడినట్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించి సీఐడీకి ఆధారాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల డబ్బులను దుర్వినియోగం చేసినట్టు, ఫాల్స్‌ డిక్లరేషన్‌ను అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ గుర్తించారు. 

49 సబ్‌స్కైబర్‌ల వివరాలను తనిఖీ చేసి ఆధారాలిచ్చారు. డాక్యుమెంట్ల నిర్వహణలోనూ ఆక్రమాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్దంగా చిట్‌ఫండ్‌ నిధులతో ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించడంతో 1982 చిట్‌ ఫండ్‌ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిపారు. దీంతో, జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లు ఆదిరెడ్డి, వాసులను సీఐడీ అరెస్ట్‌ చేసింది. 

ఇక, గత నవంబర్‌ నుంచి రాష్ట్రంలో చిట్‌ఫండ్‌ కంపెనీల్లో రిజిస్ట్రేషన్‌ శాఖ తనిఖీలు చేపట్టింది. మార్చి 16న జగజ్జనని చిట్స్‌ సహా రాష్ట్రంలో పలు చిట్‌ఫండ్‌ సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో వెలుగు చూసిన అంశాల ఆధారంగా సీఐడీకి అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేశారు. 

ఇది కూడా చదవండి: కిడ్నీ రాకెట్‌ కేసును ఛేదించిన పోలీసులు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement