
సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ సైకో వీరంగం సృష్టించారు. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకుంటూ హల్ చల్ చేశాడు. బస్టాండ్‌లో సెల్‌ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడ్డ నాని అనే సైకోను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని ఆర్టీసీ బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని.. అవుట్ పోస్ట్‌లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment