RTC bus stand
-
ఆర్టీసీ ఉద్యోగిపై దాడి
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆన్‌డ్యూటీలో ఉన్న ఉద్యోగి(కంట్రోలర్)పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్ చేయడానికి వచ్చి ఇన్‌గేట్(అనుమతిలేని చోట) వద్ద కారు పార్కింగ్ చేసి వె ళ్తుండగా కంట్రోలర్ గమనించారు. కారును అక్కడ నుంచి తీసివేయాలని సూచించారు. దీంతో వారిద్ద రు ఉద్యోగి జమాల్పాషాపై పిడగుద్దులు గుద్దారు. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్క ర్లు కొడుతోంది. ఆర్టీసీ కంట్రోలర్ జమాల్‌పాషా దాడి విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సీఐ బన్సీలాల్ తెలిపారు. -
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
హుస్నాబాద్‌లో నాటుబాంబుల కలకలం.. పేలుడుతో ఉలిక్కిపడ్డ జనం..
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ ఆర్డీసీ బస్టాండ్ ఆవరణలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రెండు బాంబులు పేలగా ఐదు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడుతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం బస్టాండ్‌లోని పార్కింగ్ స్థలం పక్కన ఒక్కసారిగా పేలుడు శబ్ధం రావడంతో ప్రయాణికులు, అక్కడున్న జనం ఉలిక్కిపడ్డారు. తోపుడు బండి కార్మికుడు బస్టాండ్‌లోని తన తోపుడు బండిని బయటకు తీస్తుండగా అక్కడే చెల్లాచెదురుగా పడి ఉన్న నాటుబాంబులకు తగిలి పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో ఆ కార్మికుడు ఆర్టీసీ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఏసీపీ సతీశ్, ఎస్సై శ్రీధర్ వెంటనే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని రప్పించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ, పార్కింగ్ స్థలంలో తనిఖీలు చేపట్టారు. బాంబులు ఉన్న స్థలం వద్దకు ఎవర్నీ రానివ్వకుండా కట్టడి చేశారు. అయితే బస్టాండ్ ఆవరణలోకి నాటు బాంబులు ఎలా వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారన్న విషయంపై స్పష్టత రాలేదు. ఈ నాటు బాంబులు ఊర పందులు, అడవి పందులను అరికట్టేందుకు వినియోగిస్తారని తెలుస్తోంది. గన్‌పౌడర్ (నల్ల మందు)తో వీటిని తయారు చేస్తారని సమాచారం. ఎస్సై శ్రీధర్ మాట్లాడుతూ బస్టాండ్ ఆవరణలోకి గుర్తు తెలియని వ్యక్తులు నాటు బాంబులను పడేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలిస్తున్నామన్నారు. -
శరవేగంగా పులివెందుల ‘ఆర్టీసీ’ పనులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా పులివెందులలో కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణ పనులు నిర్దేశిత ప్రణాళిక ప్రకారం వేగంగా సాగుతున్నాయని, నిర్ణీత కాలంలో వాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ.. కరోనా సెకండ్ వేవ్‌తో పనులకు కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ముందుగా ప్రకటించిన గడువులోగానే పూర్తి చేస్తామని తెలిపింది. కొత్త ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఏడాది డిసెంబర్ 24న శంకుస్థాపన చేయగా.. అన్ని పనులు శరవేగంగా సాగుతున్నాయని పేర్కొంది. పనుల పురోగతి ఇలా..: టరూ.2.80 కోట్లతో ప్రహరీ నిర్మాణం, గ్రావెల్ లెవలింగ్ పనుల పూర్తికి గడువు తేదీ ఈ ఏడాది జులై 31. ఆ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 1,100 మీటర్ల ప్రహరీకి గాను 900 మీటర్ల గోడ నిర్మాణం పూర్తయ్యింది. మిగతా 200 మీటర్ల నిర్మాణం పూర్తి కావచ్చింది. ఇంతవరకు రూ.2.30 కోట్ల మేర పనులు పూర్తి చేశారు. ► రూ.9 కోట్లతో చేపట్టిన కొత్త బస్ డిపో భవనాల నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ 30 నాటికి పూర్తి చేయాలి. గ్యారేజీ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయ్యింది. మొదటి అంతస్తు గోడల నిర్మాణం జరుగుతోంది. ఆయిల్ రూమ్‌కు శ్లాబ్ వేశారు. మిగతా నిర్మాణాలు బేస్మెంట్ వరకు పూర్తి చేశారు. మొత్తం రూ.3 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ► రూ.22.40 కోట్లతో కొత్త బస్ స్టేషన్ నిర్మాణాన్ని 2022 సెప్టెంబరు 1నాటికి పూర్తి చేయాలి. మొత్తం 128 స్తంభాలకు గాను 108 స్తంభాల నిర్మాణం బేస్మెంట్ వరకు పూర్తయ్యింది. ఇంతవరకు రూ.2 కోట్ల విలువైన పనులు చేశారు. -
మాస్క్‌లు ధరించకుంటే టికెట్ ఇవ్వొద్దు
సాక్షి, ఖమ్మం: ప్రతి ప్రయాణికుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని లేకుంటే టికెట్ ఇవ్వొద్దని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజారవాణా ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రోజున ఖమ్మం బస్టాండ్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల వివరాలు, ప్రయాణికులకు అందిస్తున్న సాకర్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి డిపోలో కండక్టర్‌కు తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజర్ ఇవ్వాలని.. బస్సులో ప్రయాణికులకు హ్యాండ్ శానిటైజ్ చేసిన తర్వాతే టికెట్ ఇవ్వాలని సూచించారు. మాస్కులు ధరించని ప్రయాణికులకు టికెట్ ఇవ్వవద్దని ఆదేశించారు. అనంతరం.. కోదాడు బస్సు డిపోను సైతం మంత్రి పరిశీలించారు. ప్రయాణికులకు స్వయంగా శానిటైజర్ స్ప్రే చేశారు. చదవండి: ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలోని ప్రతి బస్సుకు విధిగా శానిటైజర్ అందించాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్యటనలో మంత్రి వెంట జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మేయర్ పాపాలాల్ మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు. చదవండి: ధూంధాంగా నిశ్చితార్థం: 15 మందికి కరోనా -
సైకో వీరంగం.. గాజు ముక్కలతో..
సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ సైకో వీరంగం సృష్టించారు. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకుంటూ హల్ చల్ చేశాడు. బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడ్డ నాని అనే సైకోను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని ఆర్టీసీ బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని.. అవుట్ పోస్ట్‌లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
9వ తరగతి విద్యార్థి లంచ్‌బాక్స్‌లో గ్రెనేడ్ తీసుకొచ్చి
-
జమ్మూలో గ్రెనేడ్ దాడి చేసింది 9వ తరగతి విద్యార్థి!
జమ్మూ: జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మైనర్ అయిన నిందితుడు యూట్యూబ్ సాయంతో గ్రేనేడ్ తయారు చేశాడని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇక నిందితుడు జమ్ముకు రావడం ఇదే తొలిసారని, అతను కారులో బుధవారమే ఇక్కడికి చేరాడని పేర్కొన్నారు. అతన్ని తీసుకొచ్చిన కారు డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నామన్నారు. మైనర్ అయిన నిందితుడు ఒక్కడే 250 కిలోమీటర్లు ఎలా ప్రయాణించాడు? అది వన్‌వే ట్రాఫిక్ కలిగిన శ్రీనగర్-జమ్ము నేషనల్ హైవేపై ఎలా సాధ్యం అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. మరోవైపు ఈ ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో నిందితుడు చెప్పాడన్నారు. జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడ్డారని పేర్కొన్న సంగతి తెలిసిందే. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్‌ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్‌తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్‌ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్‌లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్‌గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్‌కు చెందిన యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్‌ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్‌కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. -
నడిరోడ్డుపై తిష్ట.. రహదారిలో వెళ్లేదెట్ట..?
సాక్షి, కడప: రాత్రి వేళ వాహనదారులు, చిరు వ్యాపారులు పనులు ముగించుకొని హడావుడిగా ఇళ్లకు వెళ్లే సమయంలో కడప నగర వాసులకు ప్రతి రోజు ఓ సమస్య వేధిస్తోంది. సరిగ్గా రోడ్డు మధ్యలో పశువులు తిష్టవేసి వచ్చి పోయే వాహనాలకు స్పీడు బ్రేకర్లుగా తయారవుతున్నాయి. వీటిని తప్పించుకు పోవాలంటే ప్రజలకు గగనమవుతోంది. నగర శివారు ప్రాంతంల్లోనో లేక ఏదైనా వీధిలో అయితే పర్వాలేదు. ఏకంగా ప్రధాన కూడళ్లైన ఆర్టీసీ బస్టాండు, ఏడురోడ్లు, అప్సర సర్కిల్, ఐటీఐ, చిన్నచౌక్లలో రోడ్ల మధ్యలో గంటల తరబడి ఇవి నిలబడడం, పడుకోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. రాత్రి పూట దగ్గరికి వచ్చినంత వరకు పశువులు పడుకున్నది అర్థం కాని పరిస్థితి. వాహనాలు రాత్రిపూట కొద్దిగా వేగంగా వెళుతున్న సమయంలో పశువులు గుంపులు గుంపులుగా రోడ్డుకు అడ్డంగా రావడంతో వాహనాలు తిరగబడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయని చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువులు రోడ్లపైకి విచ్చలవిడిగా తిరుగుతూ వాహనచోదకులతోపాటు చిరువ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. తోపుడు బండ్లపై ఆకుకూరలు, కూరగాయలు, పలు రకాల పండ్లను తింటూ పాడు చేస్తున్నాయని చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరికలు సరే.. చర్యలేవీ? రోడ్డు మీదకు ఆవులు, గేదెలను వదిలితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేసే కార్పొరేషన్ అధికారులు వాటిని అమలు చేయటంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. రోడ్డు మీదకు వదిలిన పశువులను బందించి రోజుకు రూ.50 అపరాద రుసం వసూలు చేస్తామని, 15 రోజుల్లోపు బంధించిన పశువులను యజమానులు వచ్చి తోలుకెళ్లకపోతే వాటిని అడవులకు తరలిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేయటంతో కొద్దిరోజుల పాటు మాత్రమే వాటిని బయటకు రానీయకుండా యజమానులు జాగ్రత్త పడ్డారు. ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో మళ్లీ రోడ్లపైకి వచ్చి యథేచ్చగా తిరుగుతున్నాయి. ఇప్పటికైనా వాటి యజమానులు జాగ్రత్తలు తీసుకునే విధంగా కార్పొరేషన్ అధికారులు కట్టడి చేయాలని నగర ప్రజలు, వాహనచోదకులు కోరుతున్నారు. -
సినిమా చూపిస్తా మామా!
సాక్షి, హైదరాబాద్: బస్టాండ్లలో వివిధ కారణాల వల్ల వేచి ఉండాల్సిన ప్రయాణికులకు శుభవార్త. తమ ప్రాంగణాల్లో వినోదాన్ని అందించేందుకు మినీ థియే టర్లు నిర్మించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయిం చింది. ఆర్టీసీ ప్రతిపాదనకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) ముందుకు వచ్చింది. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయి, టికెట్టేతర ఆదాయం కోసం వివిధ మార్గాలు అన్వేషిస్తోన్న ఆర్టీసీకి ఈ ఆలోచన కాసులు కురిపిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మినీ థియేటర్ల నిర్మాణానికి చకాచకా అడుగులు వేస్తోంది. త్వరలో విజయవాడకు బృందం.. టికెట్టేతర ఆదాయం పెంపులో భాగంగా ఇప్పటికే పలు దుకాణాలను వేలం వేసిన ఆర్టీసీ, ఇకపై మినీ థియేటర్లను ఏర్పాటు చేయనుందని సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్ శర్మ వెల్లడించారు. ఇప్పటికే ఇందుకోసం ఆర్టీసీకి చెందిన 23 స్థలాలను గుర్తించామని, ఇందులో 15 ప్రాంగణాల్లో మినీ థియేటర్లు నిర్మించేందుకు టీఎఫ్‌డీసీ ముందుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ థియేటర్ల ద్వారా ఏటా రూ. 3.11 కోట్ల ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నామన్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో పండిట్‌నెహ్రూ బస్టాండ్‌లో ఇలాంటి మినీథియేటర్ నడుస్తోంది. ఈ మినీ థియేటర్ నిర్వహణ పని తీరును పరిశీలించేందుకు త్వరలోనే ఈడీ పురుషోత్తమ్ నేతృత్వం లోని బృందం విజయవాడ వెళుతుందని ఆయన వివరించారు. ఏయే ప్రాంతాల్లో.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కొల్లూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, ధర్మపురి, హుజూరాబాద్, సిరిసిల్ల, పెద్ద పల్లి, జడ్చర్ల, షాద్‌నగర్, నర్సా పూర్, సంగారెడ్డి, నాగార్జున సాగర్, కోదాడ, ఆర్మూర్, బోధన్, చేవెళ్ల, తాండూరు, వికారాబాద్, స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. -
రూ.31.50లక్షల నగదు స్వాధీనం
సాక్షి, తాడిపత్రి టౌన్ : స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం రూ.31.50లక్షల నగదును అక్రమంగా తరలిస్తున్న తాడిపత్రి పట్టణం పతాంజలి వీధికి చెందిన నజీర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నగదును ఐటీ శాఖకు అప్పగించినట్లు పట్టణ సీఐ సురేంద్రరెడ్డి తెలిపారు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నజీర్ జువెలర్స్ యజమాని నజీర్ అక్రమంగా డబ్బు తరలిస్తున్నట్లు డీఎస్పీకి వచ్చిందన్నారు. ఆ మేరకు స్థానిక ఆర్టీసీ బస్డాండ్‌లో బుధవారం సాయంత్రం ఎస్ఐలు రాఘవరెడ్డి, శ్రీధర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. బంగారు షాపు యజమానిని అదుపులోకి తీసుకొని ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించామన్నారు. -
ఇక ఆటోలో ప్రయాణం..సులభతరం.. సురక్షితం
అనంతపురం సెంట్రల్ : అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్‌లో దిగే ప్రయాణికుల జేబులకు చిల్లులు పడే విధంగా ప్రయాణ చార్జీలు వసూలు చేసే ఆటో డ్రైవర్లకు కళ్లెం వేస్తూ జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు. మహానగరాల తరహాలో ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రీ పెయిడ్ ఆటో బూత్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ... ప్రయాణికుల ఆటోలలో రాకపోకలను సులభతరంతో పాటు సురక్షితంగా గమ్యాన్ని చేరేందుకు ప్రీ పెయిడ్ ఆటో బూత్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి గమ్యస్థానాలకు ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు, ఆటో కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కమిటీలో ఈ ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. ప్రయాణికులు నేరుగా సెంటర్ వచ్చి వారు పోవాల్సిన చిరునామాకు టికెట్ తీసుకోవచ్చని చెప్పారు. ముందే ధరలు నిర్ణయించడంతో ఇష్టానుసారం వసూలు చేయడానికి కుదరదన్నారు. అంతేకాకుండా అర్ధరాత్రి మహిళలు బస్టాండ్‌లో దిగితే సురక్షితంగా గమ్యాన్ని చేరచ్చని చెప్పారు. సదరు ప్రయాణికురాలు ఏ ఆటో ద్వారా వెళ్తున్నారనే సమాచారం ముందే తెలిసిపోన్నారు. దీని వలన నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. నగరాన్ని ఎనిమిది రూట్లుగా విభజించడం జరిగిందన్నారు. ఒకటిన్నర కిలోమీటరుకు రూ. 25లు నిర్ణయించడం జరిగిందని, ఆ తర్వాత అదనపు చార్జీలు పడుతుందన్నారు. నగరంలో శివారు ప్రాంతానికి కూడా రూ. 150లు మించి ఉండదని తెలిపారు. దీని వలన ప్రయాణికునికి, ఆటో నిర్వాహకునికి ఇద్దరికీ మేలు జరుగుతుందన్నారు. ఈ కేంద్రం 24 గంటలు పనిచేస్తుందన్నారు. త్వరలో రైల్వే స్టేషన్లో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీఎస్పీ నర్సింగప్ప, కార్పొరేషన్ కమిషనర్ మూర్తి, ఎంవీఐ రమేష్, సీటీఎం గోపాల్‌రెడ్డి, డీఎం బాలచంద్రప్ప సీఐలు, ట్రాఫిక్ ఎస్ఐలు పాల్గొన్నారు. -
ఎస్సార్బీసీ ప్రధాన కాలువకు గండి
-
చవితి ఎఫెక్ట్..!
అనంతపురం న్యూసిటీ: వినాయక చవితి... తెలుగు పండుగల్లో ఓ ముఖ్యమైన పండుగ. దీంతో సొంత ఊళ్లకు వెళ్లి పండుగకు వెళ్లాలనుకునే వారి సంఖ్యా ఎక్కువ. గురువారం జిల్లా కేంద్రం నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో అనంతపురం బస్టాండ్ కిటకిటలాడింది. తమ ఊరి బస్సు రాగానే సీటు కోసం పరుగులు తీశారు. -
ప్రయాణీకుల పాట్లు.. ఫీట్లు..!
వైవీయూ: ఆదివారం కడప నగరం ప్రయాణికులతో కిటకిటలాడింది. పోలీసు ఉద్యోగార్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దాదాపు 20వేల మంది కడప నగరానికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత ఇంటికెళ్లేందుకు బస్టాండుకు వెళితే.. బస్సుల కొరత కారణంగా వేచి ఉండక తప్పలేదు. ఒక్కసారిగా వందలాది మంది వేచి ఉండటంతో బస్సు వచ్చిన సమయంలో సీటు కోసం ఫీట్లు చేయాల్సి వచ్చింది. పరీక్ష కోసం.. పరుగో.. పరుగో.. కడప నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల సందడి కనిపించింది. కేంద్రం వద్ద హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డులు సరిచూశాక పరీక్షకు అనుమతి ఇచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు రాత పరీక్ష నిర్వహించారు. చాలా మంది టైం అయిపోతోందని పరుగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకున్నారు. -
ఇక విజయవాడలోనే రవాణా కమిషనరేట్
సాక్షి, విజయవాడ : రవాణా శాఖ కమిషనరేట్ ఉద్యోగుల కార్యకలాపాలు ఈ నెల 27 నుంచి విజయవాడలో మొదలవుతాయని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఎన్.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. గురువారం ఉదయం విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న భవనంలో రవాణా శాఖ రాష్ట్ర కార్యాలయాన్ని ఆయన పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈనెల 27కల్లా 80 మంది అధికారులు, ఉద్యోగులతో కార్యకలాపాలు ప్రారంభిస్తామని, రెండో దశలో జూలై 15నాటికి సుమారు 70 మంది అధికారులు, ఉద్యోగులు వస్తారని వివరించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా తమ శాఖ కార్యాలయాన్ని ఇక్కడి మార్చామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయంలో కీలక భూమిక పోషించే తమ శాఖ కార్యకలాపాలు విజయవాడ నుంచి ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర కార్యాలయ రికార్డులు, ఫర్నిచర్, ఇతర సామగ్రి 27వ తేదీనాటికి ఇక్కడికి వస్తామని చెప్పారు. 13 జిల్లాలకు చెందిన రవాణా శాఖ అధికారులు, ఇతర విభాగాల అధికారులకు ఇక్కడ్నుంచే ఉత్తరప్రత్యుత్తరాలు నిర్వహిస్తామని చెప్పారు. రవాణా శాఖ నాన్ టెక్నికల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.మణికుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి విజయవాడకు ఎలాంటి షరతులు, డిమాండ్లు లేకుండా వచ్చి తాము పనిచేయడానికి సుముఖత తెలిపామని చెప్పారు. -
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం
అనంతపురం: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగనాయకులు ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏమైందో తెలియదు కానీ, పురుగుల మందు తాగి అనంతపురం బస్టాండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగనాయకులు కుటుంబానికి న్యాయం చేయాలని అతడి సన్నిహితులు, బంధువులు పోలీసులు, అధికారులను కోరుతున్నారు. -
చోరీకి యత్నించిన మహిళకు దేహశుద్ధి
వనపర్తి : స్థానిక ఆర్టీసీ బస్డాండులో చోరీ చేయటానికి విఫల ప్రయత్నం చేసిన ఓ మహిళకు ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల వద్ద ఉన్న చిన్నపిల్లాడి కాళ్లకు ఉన్న వెండికడియాలను చోరీ చేయటానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి పట్టుకున్నానని పిల్లవాడి తల్లి ఆరోపించారు. విషయం గమనించి చుట్టుపక్కల వారు చోరీకి ప్రయత్నం చేసిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆమెకు అవగాహన కల్పించి వదిలేశారు. -
మార్కాపురం బస్టాండు వద్ద వ్యక్తి హత్య
మార్కాపురం(ప్రకాశం జిల్లా): ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండువద్ద మంగళవారం ఉదయం ఒక వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కత్తులు, గొడ్డళ్లతో అతన్ని కిరాతకంగా నరికి హత్యచేశారు. మార్కాపురం పట్టణానికి చెందిన చెన్నకేశవులు(43) ఉదయం బస్టాండు వద్ద నడుచుకుంటూ వెళుతుండగా వెంబడించిన దుండగులు దారుణంగా నరికి చంపారు. పాతకక్షల వల్లే ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్లాస్టిక్ కవర్లో పసికందు..
గుంతకల్లు పట్టణం ఆర్టీసీ బస్టాండ్‌లో పసికందు మృతదేహాన్ని కనుగొన్నారు. గుర్తు తెలియని మహిళ, పసికందును ప్లాస్టిక్ కవర్లో చుట్టి మూడో నెంబర్ ఫ్లాట్‌ఫారంపై వదిలివెళ్లింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
15కోట్లతో సౌకర్యాలు మెరుగుపరుస్తాం
-
ఆర్టీసీ బస్టాండ్ వద్ద వ్యక్తి మృతి
అనంతపురం టౌన్ : అనంతపురం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం ఉదయం నుంచి అలాగే పడుకుని ఉండటంతో అనుమానం వచ్చి స్థానికులు సాయంత్రం తట్టి చూడగా ఒంట్లో ప్రాణం లేదు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 45 ఉంటుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బాధ్యతగా వ్యవహరించకపోతే వేటే!
- ఆర్టీసీ సిబ్బందికి ఆర్ఎం హెచ్చరిక - డీఎంలతో సమీక్షాసమావేశం పట్నంబజారు(గుంటూరు) : విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించని పక్షంలో వేటు తప్పదని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి హెచ్చరించారు. ఆర్టీసీ బస్టాండ్‌లోని తన చాంబర్లో గురువారం సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మాచర్ల, నరసరావుపేట, చిలకలూరిపేట డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఇక నుంచి జిల్లావ్యాప్తంగా పదిమందితో కూడిన బృందాలు తిరుగుతాయని, సిబ్బంది, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పక్కన పెట్టాల్సివస్తుందని స్పష్టం చేశారు. ఆయా డిపోల పరిధిలో బ్రేక్ డౌన్స్ అధికమైపోతున్నాయని, ఎప్పటికప్పుడు బస్సుల స్థితిగతులను చూసుకోవాల్సిన బాధ్యత డీఎంలపైనే ఉందన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి రీజియన్ పరిధిలో జరుగుతున్న ‘బస్సు ప్రయాణ మాసం’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ప్రతి డిపో మేనేజర్ వారి వారి పరిధిలోని ప్రాంతాల్లో బస్సుల్లో పర్యటిస్తూ ప్రయాణికుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలన్నారు. ప్రతి ఆదివారం డీఎంలు సూపర్వైజర్లతో సమావేశాన్ని నిర్వహించి ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు గత నెల 27వ తేదీన శ్రీరామపురం తండా నుంచి ప్రసవం కోసం మాచర్ల బయలుదేరిన అరుణాబాయి బస్సులోనే ప్రసవించింది. ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా బాధ్యతగా వ్యవహరించిన డ్రైవర్ కృష్ణ, కండక్టర్ రహీంలను ఆర్ఎం శ్రీహరి అభినందించారు. -
జనవాహిణి
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పుష్కరాలకు వెళ్లే ప్రయాణికులకు విజ్ఞప్తి... ధర్మపురిలో జనం నిండిపోయారు. పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించే పనిలో ఉన్నారు. దయచేసి భక్తులంతా ఇతర పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లండి - కరీంనగర్ బస్‌స్టేషన్‌లో మైకు ద్వారా ఆర్టీసీ అధికారుల సూచనలివి. కాళేశ్వరంలో భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీల దర్శనాన్ని రద్దు చేయడమైనది. భక్తులు సహకరించాల్సిందిగా మనవి - కాళేశ్వరంలో భక్తులు పోటెత్తడంతో ఆలయ అధికారులు చేసిన విజ్ఞప్తి ఇది. కోటిలింగాలకు ఈరోజు, రేపు వెళ్లడం కష్టమే. పది కిలోమీటర్ల దూరంలోనే వాహనాలన్నీ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్నాయని వార్తలొస్తున్నాయి. వేరే చోటుకు వెళ్లి పుష్కరస్నానం చేసొద్దాం పదండి - కోటిలింగాలలో పరిస్థితిని తెలుసుకుని జిల్లాలోని ఇతర ఘాట్లకు వెళ్లే ముందు ఆర్టీసీ బస్టాండ్‌లో కుటుంబ సభ్యులకు చెబుతున్న ఓ భక్తుడి మాటలివి. కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లలో శనివారం భక్తుల తాకిడి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఇవి నిదర్శనం. ముందుగా ఊహించినట్లుగానే పుష్కరాలకు వెళ్లే దారులన్నీ జిల్లావైపే మళ్లాయి. పొరుగు జిల్లాల, రాష్ట్రాల భక్తుల్లో అధికంగా జిల్లాలోని పుష్కర ఘాట్లకే విచ్చేశారు. ఏకంగా లక్షల సంఖ్యలో భక్తుల తాకిడి పెరగడంతో ఘాటన్నీ జనసంద్రాన్ని తలపించాయి. ఎటుచూసినా ఇసుకేస్తే రాలనంతగా జనం కనిపించారు. చీమల దండు మాదిరిగా ప్రధాన పుష్కర ఘాట్లన్నింటి వద్దకు వాహనాలు బారులు తీరాయి. రాజీవ్హ్రదారి టోల్గేట్ల వద్ద వాహనాల రుసుం వసూళ్లు ఆలస్యం కావడంతో దాదాపు 20 కిలోమీటర్ల కొద్దీ వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. టోల్గేట్ల వద్దనున్న ప్రజల బాధలు వర్ణణాతీతం. శనివారం ఒక్కరోజే ఏకంగా 26 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో ఒక్క ధర్మపురిలోనే సుమారు 10 లక్షల మంది పుష్కర స్నానం చేశారు. కాళేశ్వరంలోనూ 7 లక్షల మందికిపైగా భక్తులు త్రివేణి సంగమం వద్ద తనివీ తీరా స్నానాలు ఆచరించారు. కోటిలింగాలలో 2 ల క్షలు, మంథనిలో 1.25 లక్షల మంది పుష్కర స్నానాల్లో మునిగితేలారు. వాహనాలు పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడం..దారి పొడవునా వాహనాలు ఆగిపోవడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి పోలీసులది. వాహనాలను నియంత్రించేందుకు గంటల తరబడి చెమటోడ్చాల్సి వచ్చింది. ధర్మపురి, కాళేశ్వరంలో భక్తుల క్యూలైన్లు కిలోమీటర్ల కొద్దీ సాగారుు. దైవదర్శనం కోసం ధర్మపురిలో 6 గంటలు, కాళేశ్వరంలో 4 గంటలకుపైగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధర్మపురి జనసంద్రమైన వేళ ధర్మపురి పుష్కరానికి శనివారం ఒక్కరోజే దాదాపు 10 లక్షల మంది తరలిరావడంతో వాహనాల రాకపోకలు గంటల తరబడి స్తంభించిపోయాయి. ధర్మపురికి వచ్చే వాహనాలు దాదాపు 25-30 కిలోమీటర్ల వరకు నిలిచిపోవడంతో వాహనాల్లో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధర్మపురికి వచ్చే రోడ్లను మూసివేసి ఒకే రోడ్డు గుండా స్నానఘట్టానికి వెళేల్లా చేయడంతో భక్తులు ఒక్కరికొకరు తోసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ప్రదేశాల నుంచి వచ్చిన జనమే ఎక్కువగా ఉండటంతో స్నాన ఘట్టాలు తెలియక ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్ నీతూప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు నిరంతరం అక్కడే ఉంటూ పర్యవేక్షించారు. రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, తన్నీరు హరీష్‌రావు ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ దంపతులు ధర్మపురిలో పుష్కర స్నానమాచరించారు. డీజీపీ అనురాగ్‌శర్మ, పంబ పీఠాధిపతి గోవిందనంద సరస్వతీశర్మ, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తదితరులు ధర్మపురిలో పుణ్యస్నానం చేశారు. కిక్కిరిసిన కాళేశ్వరం.. శుక్రవారం రాత్రే వేలాది మంది భక్తులు కాళేశ్వరంలో బసచేసి శనివారం తెల్లవారుజామునే గోదావరి నది బాట పట్టారు. సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రైవేటు, ఆర్టీసీ పార్కింగ్ నుంచి గోదావరి నది ప్రధాన ఘాట్, వీఐపీ ఘాట్ వరకు ఎక్కడ చూసినా భక్తులే కనిపించారు. మధ్యాహ్నం 3గంటల వరకు సుమారు 6.25 లక్షల మంది స్నానాలు చేయగా, రాత్రి 8 గంటల వరకు ఆ సంఖ్య 7ల క్షలు దాటినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం గోదావరి నదీ వరకు ఆటోలను అనుమతించగా రద్దీ పెరగడంతో వాటిని నిలిపివేశారు. మూడు గంటల పాటు ఏకదాటిగా నదికి వరదలా భక్తులు తరలిరావడంతో స్వల్పతోపులాట జరిగింది. భక్తుల తాకిడిని ముందే పసిగట్టిన ఓఎస్టీ సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ పౌసమిబసు శాంతిభధ్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. ఒకేసారి పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కాటారం నుంచి కాళేశ్వరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు ఆరు గంటల పాటు వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతారావు సైతం మూడు గంటలు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. పుష్కర స్నానాల అనంతరం అనేక మంది భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకోవడానికి సుమారు కిలోమీటర్ మేర రెండు వరుసల క్యూలైన్లను ఏర్పాటు చేశారు. సాధారణ ద ర్శనానికి మూడు గంటల సమయం పట్టింది. భక్తుల రద్దీ దష్ట్యా వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దీ చేశారు. జాయింట్ కలెక్టర్ పౌసమిబసు స్వయంగా వీఐపీ, సాధారణ దర్శనాల వద్ద బైఠాయించి పరిస్థితిని చక్కదిద్దారు. మంథనిలో 1.25 లక్షల మంది భక్తులు పుష్కర స్నానం చేశారు. పంప పీఠాధిపతి గోవిందనాథ సరస్వతీస్వామి, సంగారెడ్డి జిల్లా జడ్జి శాంతకుమారి, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ భగవాన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎల్.రాజం పుష్కరస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటిలింగాలలో 2 ల క్షలు కోటిలింగాల పుష్కర ఘాట్లన్నీ శనివారం ఇసుకేస్తే రాలనంతగా మారాయి. ఏకంగా 2లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. సెలవు దినాల్లో భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశముందని గ్రహించిన అధికారులు రాత్రికి రాత్రే కొత్త ఘాట్‌ను ఏర్పాటు చేశారు. గోదావరిఖని బ్రిడ్జి వద్ద పుష్కరఘాట్‌లో శనివారం 50 వేల మంది భక్తులు పుణ్యస్నానం చేశారు. సమీపంలోని ఇంటెక్వెల్ వద్ద గల మరో పుష్కరఘాట్ వద్ద 15 వేల మంది పుష్కరస్నానమాచరించారు. రామగుండం మండల పరిధిలోని గోలివాడ పుష్కరఘాట్ వద్ద సుమారు ఐదు వేల మంది పుణ్యస్నానాలు చేశారు. శనివారం పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పిల్లాపాపలతో భక్తులు అధిక సంఖ్యలో పుష్కరఘాట్లకు తరలివచ్చారు. ఆదివారం కూడా మరింత ఎక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు పుష్కరఘాట్ల వద్ద అధికారులు ఏర్పాట్లు చేశారు. టోల్గేట్లు ఎత్తేస్తారా.... ధ్వంసం చేయాలా? బీజేపీ జిల్లా అధ్యక్షుడు అర్జున్‌రావు హెచ్చరిక గోదావరి మహా పుష్కరాలకు వచ్చే భక్తులంతా టోల్గేట్ల వద్ద నరకం కన్పిస్తోంది. వృద్ధులు, మహిళలు, బాలింతలు శనివారం అల్లాడిపోయారు. భక్తుల రద్దీ దృష్ట్యా పుష్కరాలు పూర్తయ్యేంతవరకు టోల్గేట్లను తక్షణమే ఎత్తివేయాలి. లేనిపక్షంలో టోల్గేట్లను ధ్వంసం చేసేందుకూ వెనుకాడం.