
చవితి ఎఫెక్ట్..!
అనంతపురం న్యూసిటీ: వినాయక చవితి... తెలుగు పండుగల్లో ఓ ముఖ్యమైన పండుగ. దీంతో సొంత ఊళ్లకు వెళ్లి పండుగకు వెళ్లాలనుకునే వారి సంఖ్యా ఎక్కువ. గురువారం జిల్లా కేంద్రం నుంచి వారి వారి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో అనంతపురం బస్టాండ్ కిటకిటలాడింది. తమ ఊరి బస్సు రాగానే సీటు కోసం పరుగులు తీశారు.