
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం
అనంతపురం: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగనాయకులు ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏమైందో తెలియదు కానీ, పురుగుల మందు తాగి అనంతపురం బస్టాండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగనాయకులు కుటుంబానికి న్యాయం చేయాలని అతడి సన్నిహితులు, బంధువులు పోలీసులు, అధికారులను కోరుతున్నారు.