ranganayakulu
-
వైఎస్సార్సీపీలోకి హిందూపురం మాజీ ఎమ్మెల్యే
హిందూపురం: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత పి.రంగనాయకులు మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఆదర్శ పాలనకు ఆకర్షితులై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్సీపీలో చేరారు. రంగనాయకులు కుమారులు, అనుచరులు కూడా ఎమ్మెల్సీ సమక్షంలో పార్టీలో చేరారు. -
అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం
అనంతపురం: అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ లో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఆత్మచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. రంగనాయకులు ఆర్టీసీలో డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. అయితే ఏమైందో తెలియదు కానీ, పురుగుల మందు తాగి అనంతపురం బస్టాండులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరవకొండ డిపో మేనేజర్ వేధింపులే కారణమని మృతుని తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగనాయకులు కుటుంబానికి న్యాయం చేయాలని అతడి సన్నిహితులు, బంధువులు పోలీసులు, అధికారులను కోరుతున్నారు. -
హాత్వే రాజశేఖర్‌కు పితృ వియోగం
విశాఖ : ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌వో అధ్యక్షుడు హాత్వే రాజశేఖర్‌కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి రంగనాయకులు (80) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రంగనాయకులు కార్మిక నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. రంగనాయకులు అంత్యక్రియలు విశాఖలో జరగనున్నట్లు సమాచారం. -
అబ్దుల్ ఘని, రంగనాయకులు హౌస్ అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లా హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాయకులును పోలీసులు బుధవారం గృహ నిర్బంధం చేశారు. హిందుపురం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లారు. దాంతో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించిన రంగనాయకులును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనిని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. -
మట్టిలో మాణిక్యాలుగా సునీల్‌చౌదరి, రంగనాయకులు
కారంచేడు, న్యూస్‌లైన్: మట్టిలో మాణిక్యాలు.. ఎదిగిన కొద్దీ ఒదిగివుండే వ్యక్తిత్వమున్న తాళ్ళూరి సునీల్‌చౌదరి, జాగర్లమూడి రంగనాయకులు కారంచేడు ముద్దు బిడ్డలని కేంద్రమంత్రి డాక్టర్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. బుధవారం రాత్రి చినవంతెన సెంటర్లో జరిగిన హైకోర్టు అదనపు న్యాయమూర్తి తాళ్లూరి సునీల్‌చౌదరి, సెక్యూరిటీ సెర్చ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జాగర్లమూడి రంగనాయకులు ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దగ్గుబాటి దంపతులు హాజరయ్యారు. మాజీ ఎంపీపీ యార్లగడ్డ వెంకటరాఘవయ్య అధ్యక్షతన, వీఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల అధ్యాపకులు పేర్ని వెంకటేశ్వరరావు వ్యాఖ్యాతగా వ్యవహరించిన సన్మాన కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ కారంచేడు గడ్డ నుంచి ఎందరో విశిష్ట వ్యక్తులు ఉద్భవించారని అన్నారు. విశిష్ట పౌర సన్మానం అందుకుంటున్న వారి తల్లిదండ్రులు ఎంతో ధన్యులని ఆమె కొనియాడారు. కారంచేడు గ్రామ కోడలిగా ఇక్కడ అందరి సమక్షంలో మాట్లాడటం తనకు గర్వంగా ఉందని ఆమె అన్నారు. కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యులమన్నారు. ఇద్దరినీ ఒకేసారి దగ్గుబాటి దంపతులు దుశ్శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అనంతరం స్థానిక న్యాయవాదుల సంఘం ప్రతినిధులు, గ్రామస్తులు సన్మానించారు. తోటి చిన్ననాటి స్నేహితులు, గురువులు సన్మాన గ్రహీతలనుద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో సన్మానగ్రహీతల చిన్ననాటి స్నేహితులు, న్యాయవాదులు, ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ పాల్గొన్నారు.