
మాజీ ఎమ్మెల్యే రంగనాయకులు నివాసంలో చర్చిస్తున్న ఎమ్మెల్సీ ఇక్బాల్, పార్టీ నాయకులు
హిందూపురం: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత పి.రంగనాయకులు మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఆదర్శ పాలనకు ఆకర్షితులై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్‌సీపీలో చేరారు. రంగనాయకులు కుమారులు, అనుచరులు కూడా ఎమ్మెల్సీ సమక్షంలో పార్టీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment