Mohammed Iqbal
-
సినిమాలు తప్ప ప్రజా సమస్యలపై బాలకృష్ణకు ధ్యాసేలేదు: ఎమ్మెల్సీ ఇక్బాల్
హిందూపురం టౌన్: నియోజకవర్గ ప్రజల గోడు వినిపించుకునేలా ఎమ్మెల్యే బాలకృష్ణకు బుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కోరాలని టీడీపీ నాయకులకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సూచించారు. సోమవారం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమాలు తప్ప ప్రజల సమస్యలపై బాలకృష్ణకు ధ్యాసేలేదని మండిపడ్డారు. ఆరు నెలలకోసారైనా ఎమ్మెల్యేను హిందూపురానికి తీసురాగలరా అని టీడీపీ నేతలను ప్రశ్నించారు. సినిమా హిట్ అంటూ భారీ వసూళ్లు వస్తున్నాయని మాట్లాడుతున్న బాలకృష్ణ.. నియోజకవర్గ ప్రజల సమస్యలపై కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన ఎమ్మెల్యే విధులు, కర్తవ్యాలు చదివైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ఓటీఎస్‌పై అసత్య ప్రచారాలు మానుకోండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం–ఓటీఎస్ పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ అన్నారు. ప్రజలకు మంచి జరుగుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ఓటీఎస్‌పై అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. నామమాత్రపు రుసుముతో గృహంపై ఎంతమేర రుణం ఉన్నా ఓటీఎస్ (వన్ టైమ్ సెటిల్మెంట్) ద్వారా మాఫీ చేసి సంపూర్ణ హక్కు పత్రాలను లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. రుణవిముక్తి పొందిన లబ్ధిదారులు తమ ఇంటిని ఇతరులకు బదలాయింవచ్చని, ఇంటిపై బ్యాంకు రుణాలు పొందవచ్చని తెలిపారు. చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓటీఎస్ పథకం ఎందుకు మంచిది కాదో టీడీపీ నాయకులు చెప్పాలని, హిందూపురంలో బాలకృష్ణతోనే తాము చర్చకు సిద్దమని ఎమ్మెల్సీ సవాల్ విసిరారు. ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. సూగూరు మరువ వద్ద శ్రమదానం పట్టణంలోని సూగూరు మరువ వద్ద ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శ్రమదానం చేశారు. గొడ్డలి చేతపట్టి కంపచెట్లను, పిచ్చి మొక్కలను తొలగించారు. చెరువు కట్టల పటిష్టతను, మరువ నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గుర్తుతెలియని వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదంలో గాయాలపాలై ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న సడ్లపల్లి చెందిన వారిని ఎమ్మెల్సీ పరామర్శించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మారుతీరెడ్డి, కోఆప్షన్ మెంబర్ రహమత్ తదితరులు పాల్గొన్నారు. -
‘అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉంటే.. 25 ఏళ్ల జైలు శిక్ష పడేది’
అనంతపురం: అమర్‌రాజ ఫ్యాక్టరీపై ఎల్లోమీడియా వక్రభాష్యం చెబుతోంది అంటూ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. అమర్‌రాజ ఫ్యాక్టరీ అమెరికాలో ఉండి ఉంటే వారు చేసిన కాలుష్యానికి.. 25 ఏళ్ల జైలు శిక్ష, భారీ జరిమానాలు వేసేవారు అని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది చంద్రబాబే అని మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు విజయవాడ: పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు.. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం, బీజేపీకి క్యాడర్ లేదన్నారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పులిచింతల ప్రాజెక్ట్ పనులను చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లపైనా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రాష్ట్రంలో పేద ప్రజలకు సీఎం జగన్ అండగా నిలిచారని మల్లాది విష్ణు తెలిపారు. -
వైఎస్సార్సీపీలోకి హిందూపురం మాజీ ఎమ్మెల్యే
హిందూపురం: హిందూపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత పి.రంగనాయకులు మంగళవారం రాత్రి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత హిందూపురంలో టీడీపీ తరఫున తొలిసారి రంగనాయకులు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో రెండోసారి టీడీపీ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, ఆదర్శ పాలనకు ఆకర్షితులై ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ నాయకత్వాన్ని బలపరుస్తూ వైఎస్సార్సీపీలో చేరారు. రంగనాయకులు కుమారులు, అనుచరులు కూడా ఎమ్మెల్సీ సమక్షంలో పార్టీలో చేరారు. -
పరిశ్రమలకు రుణాలంటూ ప్రజాప్రతినిధులకు టోకరా
హిందూపురం: పరిశ్రమలకు సబ్సిడీ రుణాల పేరుతో ప్రజాప్రతినిధులను మోసగించిన ఓ సైబర్ నేరగాడిని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చాకచక్యంగా పట్టించారు. నిందితుడితోపాటు అతడికి సహకరించిన వ్యక్తిని అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా వల వేయబోయి.. అలా చిక్కాడు ► తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన బాలాజీ నాయుడు రెండు రోజుల క్రితం హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఫోన్ చేశాడు. తాను సెంట్రల్ ఇండస్ట్రీస్ డిప్యూటీ సెక్రటరీనని నమ్మబలికాడు. ► కేంద్ర ప్రభుత్వం పీఎంవీవై పథకం కింద రూ.50 లక్షలు స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ రుణాలు అందిస్తోందని, ఇందులో 50 శాతం సబ్సిడీ ఉంటుందని చెప్పాడు. ► లక్షకు రూ.25 వేల చొప్పున మార్జిన్ మనీ కట్టాలని, నియోజకవర్గం నుంచి దరఖాస్తులు పంపించాలని కోరాడు. ► ఈ విషయమై ఎమ్మెల్సీ ఇక్బాల్‌ను సంప్రదించాలని నిందితుడికి మాధవ్ సూచించారు. నిందితుడు ఎమ్మెల్సీకి ఫోన్ చేయగా.. ఆయన మంత్రి పర్యటనలో ఉన్నందున ఈ వ్యవహారాన్ని చూడాలని తన అనుచరుడైన గోపీకృష్ణకు అప్పగించారు. ► గోపీకృష్ణ నిందితుడితో ఫోన్లో మాట్లాడి ఏడుగురి పేర్లు అందచేసి మార్జిన్ మనీని అతడి ఖాతాలో జమ చేశారు. ► నిందితుడు ఆదివారం రాత్రి మరోసారి ఎమ్మెల్సీకి ఫోన్ చేసి ఇంకా ఎవరైనా ఉంటే మార్జిన్ మనీ జమ చేయించాలని అడగ్గా.. ఐజీగా పని చేసిన అనుభవం ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ నిందితుడి వ్యవహారంపై అనుమానం వచ్చి బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలన చేయించారు. ► ఆ ఖాతా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తిదని గుర్తించి.. వెంటనే అనంతపురం ఎస్పీ సత్య ఏసుబాబును అప్రమత్తం చేశారు. ► ఎస్పీ ఆదేశాల మేరకు హిందూపురం ఎస్ఐ శేఖర్ ఆదివారం అర్ధరాత్రి పెద్దాపురం వెళ్లి నిందితుడు బాలాజీ నాయుడు, అతడికి సహకరించిన వెంకట తాతారెడ్డిని అరెస్ట్ చేశారు. బాలాజీ ఉచ్చులో 60 మంది! ► బాలాజీనాయుడు ఉచ్చులో పడి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 60 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు మోసపోయినట్లు భావిస్తున్నారు. ► అతడు 2009లోనూ ఇదే తరహా మోసం కేసులో తెలంగాణ పోలీసులకు చిక్కి శిక్ష అనుభవిస్తూ రెండు రోజుల క్రితమే విడుదలయ్యాడు. -
‘ఎల్జీ పాలీమర్స్ విస్తరణకు బాబే అనుమతిచ్చారు’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు విశాఖలో ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ నేత, ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో పరిస్థితులు పరిష్కర దశలో ఉండంగా చంద్రబాబు సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. 2017లో ఎల్జీ పాలీమర్స్ విస్తరణకు అనుమతులు ఇచ్చిందే చంద్రబాబు అని మండిపడ్డారు. ఎల్జీ పాలిమర్స్‌పై చిన్న కేసులు పెట్టారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలు ఇవ్వగానే, వాటికి అనుబంధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారనే విషయం బాబుకు తెలియంది కాదన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఈ రోజు సీఎం జగన్మోహన్రెడ్డి రూ.కోటి పరిహారం ఇస్తూ ఆదర్శంగా నిలిచారని ఆయన తెలిపారు. విశాఖ సమస్య పరిష్కారానికి సీఎస్‌తో సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అక్కడే ఉండి సమీక్షిస్తున్నారని మహమ్మద్ ఇక్బాల్ తెలిపారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కమిటీ సమస్యలు సృష్టించి, ప్రజల్ని ఆందోళన వైపు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. -
ఐటీశాఖ వద్ద చంద్రబాబు అవినీతి చిట్టా..
సాక్షి, అనంతపురం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతిని నిరూపించే సాక్షాలు కేంద్ర ఐటీ శాఖ వద్ద ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో 2వేల కోట్ల అవినీతి అక్రమాలు జరిగినట్లు కేంద్ర ఐటీ శాఖ నివేదికలు విడుదల చేసిందని, ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రెండు రోజులుగా తీవ్ర రాజకీయ విమర్శలకు కారణమైన ఐటీ దాడులపై మహ్మద్ ఇక్బాల్ మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి సామ్రాజ్యానికి అధిపతి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు పెండింగ్‌లో ఉందని.. ఆ కేసులో చంద్రబాబు ఎప్పటికయినా జైలు కెళ్లాల్సిందేనని ఇక్బాల్ జోస్యం చెప్పారు. గతంలోలాగా కోర్టు నుంచి స్టేలు తెచ్చుకున్నా శిక్ష తప్పదన్నారు. అధికారం కోసం కాంగ్రెస్ నేతలతో కుమ్మకై వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఆయన సమర్థవంతగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన తప్పులను ఒప్పుకోవాలని హితవుపలికారు. ప్రస్తుతం ఐటీ దాడుల్లో బయటపడిన అవినీతి సొమ్ము కేవలం నామమాత్రమే అని.. మున్ముందు లక్షల కోట్ల అవినీతి అనకొండ బయటపడుతుందని అన్నారు. -
కులాలు మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కుట్ర
సాక్షి, అమరావతి : కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కుట్ర పన్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఆరోపించారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్.. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గృహహింస కేసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న దొంగ పవన్ కల్యాణ్ అని విమర్శించారు. చంద్రబాబు చేసిన అవినీతిలో పవన్‌కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ ప్రజారంజక పాలనను చూసి ఓర్వలేకనే చంద్రబాబు, పవన్ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు. -
సీఎం జగన్ మైనార్టీల పక్షపాతి: ఇక్బాల్
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మైనార్టీల పక్షపాతి అని మరోసారి రుజువయిందని వైఎస్సార్సీపీ నేత మహ్మద్ ఇక్బాల్ అన్నారు. బుధవారం ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటల మనిషి కాదని.. చేతల మనిషి అని ప్రస్తుతించారు. రంజాన్ పండగ రోజు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పారని.. బక్రీద్ పండుగ రోజు ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింనందుకు ముస్లింలతో పాటు, తెలుగు రాష్ట్ర్రాల పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఓడిపోయిన వారిని కూడా ఆదరించి పదవులు ఇస్తున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు ఓట్లు కోసం మాత్రమే ఎన్నికల ముందు మైనార్టీలకు పదవులు ఇచ్చారని విమర్శించారు. వైఎస్ జగన్.. తండ్రిని మించిన తనయుడు: చల్లా రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చల్లా రామకృష్ణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో పది సంవత్సరాలు ప్రతి పక్షం, పాలకపక్షంలోనూ కలిసి పనిచేశానని తెలిపారు. తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అని ప్రశంసించారు. ఎమ్మెల్సీగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. ప్రజావాణి, ప్రభుత్వ ప్రాధాన్యతలను శాసనమండలిలో వినిపిస్తానని.. బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని తెలిపారు. రాష్ట్ర్ర సమస్యలపై ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉంది: గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాష్ట్ర్ర సమస్యలపై మహ్మద్ ఇక్బాల్‌కు మంచి అవగాహన ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. విద్యావంతుడైన ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
సాక్షి, అమరావతి: శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ కేంద్ర కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీ శాసనసభ కోటా నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్న విషయం విదితమే. ఈ స్థానాలకు రాష్ట్ర మంత్రిగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పార్టీ మైనార్టీ నేత మహ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత చల్లా రామకృష్ణారెడ్డిని అభ్యర్థులుగా ప్రకటించారు. పార్టీ పరంగా అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు సామాజిక వర్గాలకు శాసన మండలిలో ప్రాతినిధ్యం కల్పించనున్నారు. అందులో భాగంగానే మోపిదేవి వెంకటరమణ (మత్స్యకార–బీసీ), మహ్మద్ ఇక్బాల్ (ముస్లిం–మైనార్టీ), చల్లా రామకృష్ణారెడ్డి (రెడ్డి)ని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ సామాజిక సమతౌల్యం పాటించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. శాసనసభ కోటా నుంచి ఎంపికైన ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన ఫలితంగా ఖాళీ అయిన ఈ స్థానాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈ నెల 14వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ప్రస్తుతం శాసనసభలో వైఎస్సార్ సీపీకి ఉన్న సంఖ్యాబలం రీత్యా ఈ మూడు ఖాళీలు ఆ పార్టీకే లభిస్తాయి. అభ్యర్థులుగా ఎంపికైన ముగ్గురు వైఎస్సార్సీపీ నేతలు ఈ నెల 14వ తేదీన నామినేషన్లు వేయనున్నట్టు సమాచారం. -
బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదు
-
‘వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి150 సీట్లు’
హిందూపురం: వచ్చే శాసన సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 150 సీట్లు ఖాయమని, టీడీపీ 20 సీట్లకే పరిమితం కాబోతుందని హిందూపురం వైఎస్సార్సీపీ అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్ జోస్యం చెప్పారు. హిందూపురంలో ఇక్బాల్ విలేకరులతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన రుణమాఫీ ఎందుకు నిలబెట్టుకోలేదో చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును విచారిస్తోన్న ఎన్ఐఏను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. డబ్బుతో టీడీపీ నేతలు గెలవాలని అనుకుంటున్నారని చెప్పారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభంజనం ఉందని జాతీయ సర్వేలు చాటి చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగాలేదని తెలిపారు. చంపుతానంటూ భయపెడుతున్న బాలకృష్ణపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందూపురం ప్రజల దాహార్తి తీర్చలేని అసమర్థుడు బాలకృష్ణ అని విమర్శించారు. బాలకృష్ణ పీఏల పెత్తనంతో హిందూపురం ప్రజలు విసిగిపోయారని అన్నారు. హిందూపురంలో వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని ధీమావ్యక్తం చేశారు. -
‘2019 తర్వాత ఆ 3 పార్టీలు కనపడవ్’
అనంతపురం జిల్లా: జనసేన, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల రహస్య పొత్తులు, బంధాలు ప్రజలు గమనిస్తున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. మంగళవారం హిందూపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఇక్బాల్ మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో ఉప్పెనలా వచ్చిన ప్రజాబలానికి భయపడి ఇలాంటి చీకటి ఒప్పందాలు చేసుకుని ఓట్లను చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు పెట్టుకున్న టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు 2019 తర్వాత ఫ్యాన్ గాలిలో కనపడకుండా పోతాయని జోస్యం చెప్పారు. టీడీపీ ప్రభుత్వం నరకాసుర ప్రభుత్వమని, కంటక ప్రభుత్వమని విమర్శించారు. అంకెల గారడీ తప్ప అభివృద్ధి చేసే ప్రభుత్వం ఇది కాదన్నారు. ఏపీకి 2019 ఎన్నికల తర్వాత దీపావళి త్వరగా రాబోతుందన్నారు. ఇసుక, మట్టి ఇలా ప్రతి దానిలో కూడా అవినీతి చేస్తోన్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమని, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు. అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్‌ని దుర్భిక్షాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. మళ్లీ అన్నపూర్ణగా మార్చబోయేది వైఎస్ జగనేనని చెప్పారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, భగత్ సింగ్ లాంటి దేశభక్తుల గురించి తెలుసుకోవాలని సూచించారు. అలా కాకుండా భగత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనడం అతని తెలివికి నిదర్శనమని విమర్శించారు. పవన్ కల్యాణ్ భారత జాతికి క్షమాపణ చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. -
‘సీమ’ ద్రోహి చంద్రబాబు
బనగానపల్లె: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని వైఎస్సార్సీపీ విజయవాడ పార్లమెంటరీ సమన్వయకర్త, రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఆయన సీమ వాసి అయినప్పటికీ ఈ ప్రాంతానికి చేసిన మేలు ఏమీ లేదని, కపట ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. ఆయన సీమ వాసులకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ ప్రాంతానికి రావాలన్నారు. బనగానపల్లె పట్టణంలో బుధవారం 93, 94 బూత్ కన్వీనర్లు అనిల్, అల్లిహుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో పాటు మహమ్మద్ ఇక్బాల్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ఎస్ఏ రెహమాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆస్థా«నం కూడలిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు జరిగినా ఆ నెపాన్ని కర్నూలు, కడప ప్రజలపైకి నెట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందని విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన 650 హామీల్లో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజలకు కనీస అవసరాలైన విద్య, వైద్యాన్ని సైతం ప్రభుత్వంవిస్మరించిందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు. నాడు సోనియాను గాడ్సే, దెయ్యమని విమర్శించిన చంద్రబాబు.. నేడు దేవతలా పేర్కొంటూ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం శోచనీయమన్నారు. బీజేపీతో వైఎస్సార్సీపీకి ఎప్పటికీ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. టీడీపీ అసత్య ప్రచారాన్ని ముస్లిం మైనార్టీలు నమ్మొద్దన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి దమ్మున్న నాయకుడని, ఆయన్ను సీఎం చూడాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యే బీసీని మట్టి కరిపించాలి: బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కకుండా చేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. అణుకువ, సేవాభావం కల్గిన వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డిని ఆదరించాలని ప్రజలకు సూచించారు. నిరంతరం ప్రజల మధ్యన ఉంటూ, వారి శ్రేయస్సు కోసం తపన పడే కాటసాని రామిరెడ్డి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం తథ్యమన్నారు. హిందూ, ముస్లింలు రెండు కళ్లు : రెహమాన్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాష్ట్రంలోని హిందూ, ముస్లింలు రెండు కళ్లు అని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహమాన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎంగానూ, కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగానూ కావడం తథ్యమన్నారు. రాష్ట్ర ప్రజలు వరుస తుపానులతో తల్లడిల్లుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో దోస్తి కట్టి రూ.1,500 కోట్లు ఖర్చు పెట్టి కేవలం రెండు సీట్లు సంపాదించుకున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీతోనే సరిపుచ్చుకోవడం దారుణమన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్సార్‌దేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు గుండం శేషిరెడ్డి, మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జిల్లా నాయకులు అబ్దుల్‌ఖైర్, అబ్దుల్‌ఫైజ్, ఎంఐఎం నియోజకవర్గ ఇన్చార్జ్ అమ్మబా, డాక్టర్ మహమ్మద్ హుస్సేన్ పాల్గొని ప్రసంగించారు. -
‘పోలీసు యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయింది’
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన హిట్లర్ పాలనను తలపిస్తోందని వైఎస్సార్సీపీ నేతలు మహ్మద్ ఇక్బాల్, పొన్నవోలు సుధాకర్ రెడ్డిలు విమర్శించారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం టీడీపీకి తొత్తుగా మారిపోయిందని మండిపడ్డారు. చట్ట బద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు.. టీడీపీ ఆదేశాల మేరకు పనిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు. అసలు సంబంధం లేని పనులతో అమాయకులను వేధిస్తున్నారని, రాజ్యాంగం ఇచ్చిన భావ స్వేచ్ఛను పోలీసులు ఆటంకం కల్గించవద్దని వారు విన్నవించారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో టీడీపీ నేతల చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే థర్డ్ పార్టీకి విచారణను అప్పగించాలని డిమాండ్ చేశారు.