నిజామాబాద్ నాగారం: సమగ్ర సర్వే సందర్భంగా చాలా మంది స్వగ్రామాలకు బయలుదేరారు. దీంతో ఆర్‌టీసీ బస్టాండ్‌లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా బస్సులు కేటాయించకపోవడంతో ప్రయాణికులు అష్టాకష్టాలు పడుతూ గమ్యాలను చేరుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, ముం బాయి, కరీంనగర్ తదితర ప్రాంతాలలో ఉన్న జిల్లా వా సులు ఇంటి దారి పట్టారు. దీంతో శనివారం నుంచి వన్ వే నడుస్తోంది. అంటే, ప్రయాణికులు అక్కడి నుంచి ఇక్కడి వస్తున్నారు. తప్పితే ఇక్కడి నుంచి అటు వెళ్లేవారి సంఖ్య నామమాత్రంగా ఉంది. మాములు రోజులలో నడిచే వాహనాలలోనే జనం నిండుగా ఉండేవారు. ఇపుడు మరింత రద్దీ పెరిగిపోయింది.
హైదరాబాద్‌కు ‘పల్లెవెలుగు’
సర్వే పుణ్యమా అని పల్లె వెలుగు బస్సులు ఎక్స్‌ప్రెస్‌గా మారాయి. ప్రతి డిపో నుంచి పల్లె వెలుగు బస్సులను హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో వారిని సొంత గ్రామాలకు త్వరగా చేర్చడానికే పల్లెవెలుగు బస్సులు వేశామని ఆర్‌టీసీ అధికారులు తెలుపుతున్నారు. ఇంద్ర, గరుడ, సూ పర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌కు నడుస్తున్నాయి. అయినా సరిపోకపోవడంతో పల్లెవెలుగు బస్సులు వేశారు. ప్రయాణికులు కూడా ఏ బస్సు అని ఆలోచన చేయడం లేదు. మన జిల్లా బస్సు ఉంది చాలు అంటూ ఎక్కేస్తున్నారు.
తప్పని ఇక్కట్లు
ప్రయాణికులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు. నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రత్యేకంగా బస్సులు కేటాయిం చకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బస్సులు సరిపడా లేకపోవడంతో జనం ప్రైవేటు వాహనాలు, ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
కిక్కిరిసిన బస్టాండ్
Published Mon, Aug 18 2014 1:43 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement