
ప్రయాణీకుల పాట్లు.. ఫీట్లు..!
వైవీయూ: ఆదివారం కడప నగరం ప్రయాణికులతో కిటకిటలాడింది. పోలీసు ఉద్యోగార్థులు ప్రిలిమినరీ పరీక్ష కోసం దాదాపు 20వేల మంది కడప నగరానికి చేరుకున్నారు. పరీక్ష తర్వాత ఇంటికెళ్లేందుకు బస్టాండుకు వెళితే.. బస్సుల కొరత కారణంగా వేచి ఉండక తప్పలేదు. ఒక్కసారిగా వందలాది మంది వేచి ఉండటంతో బస్సు వచ్చిన సమయంలో సీటు కోసం ఫీట్లు చేయాల్సి వచ్చింది.
పరీక్ష కోసం.. పరుగో.. పరుగో..
కడప నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల సందడి కనిపించింది. కేంద్రం వద్ద హాల్ టిక్కెట్లు, గుర్తింపు కార్డులు సరిచూశాక పరీక్షకు అనుమతి ఇచ్చారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసు రాత పరీక్ష నిర్వహించారు. చాలా మంది టైం అయిపోతోందని పరుగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకున్నారు.