వైఎస్సార్ జిల్లా(చిన్నమండెం): చిన్నమండెం మండలంలోని ముండ్లవారికోట గ్రామం వద్ద కడప-బెంగుళూరు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న టాటా సుమో ఢీకొట్టింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో హోటల్ రమేశ్(40) అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. రమేశ్ చిన్నమండెం మండలంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ చిన్న హోటల్ నడుపుతున్నాడు.