జమ్మూలో గ్రెనేడ్ దాడి జరిపింది 9వ తరగతి విద్యార్థేనని నిఘావర్గాలు పేర్కొన్నాయి. నిందితుడు గ్రెనేడ్‌ను లంచ్ బాక్స్‌లో తీసుకొచ్చి జమ్మూ ఆర్టీసీ బస్టాండ్ లక్ష్యంగా దాడి జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. 32 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాడి జరిపి తిరుగు ప్రయాణమైన దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్‌కు చెందిన నిందితుడిని పోలీసులు జమ్ముకు 20 కిలోమీటర్ల సమీపంలోని చెక్‌పాయింట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.