
చోరీకి యత్నించిన మహిళకు దేహశుద్ధి
వనపర్తి : స్థానిక ఆర్టీసీ బస్డాండులో చోరీ చేయటానికి విఫల ప్రయత్నం చేసిన ఓ మహిళకు ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. హైదరాబాద్ బస్సు ఎక్కుతున్న ప్రయాణికుల వద్ద ఉన్న చిన్నపిల్లాడి కాళ్లకు ఉన్న వెండికడియాలను చోరీ చేయటానికి ప్రయత్నిస్తుండగా గుర్తించి పట్టుకున్నానని పిల్లవాడి తల్లి ఆరోపించారు. విషయం గమనించి చుట్టుపక్కల వారు చోరీకి ప్రయత్నం చేసిన మహిళకు దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు ఆమెకు అవగాహన కల్పించి వదిలేశారు.