ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగం
ఒంగోలు నగరంలో సిటీ బస్సు సర్వీసులను మంత్రి శిద్దా రాఘవరావు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. సిటీ బస్సులు నిలిపే బస్‌షెల్టర్లు కూడా ఆయన ప్రారంభించారు. త్వరలోనే మరిన్ని సిటీ సర్వీసులు నడుపుతామని చెప్పారు.
ఒంగోలు: ఆర్టీసీని ఆదరిస్తేనే అందరికీ ఉపయోగంగా ఉంటుందని రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండులో నూతనంగా ఏర్పాటు చేసిన 5 సిటీ సర్వీసులను శుక్రవారం సాయంత్రం ఆయన ప్రారంభించారు. అనంతరం రిమ్స్ ఆస్పత్రి వద్ద, దక్షిణ బైపాస్‌లో ఏర్పాటు చేసిన బస్‌షెల్టర్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ సేవలు పేద వర్గాలకు సైతం అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను ఏర్పాటు చేస్తామని, త్వరలోనే జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం ద్వారా మరిన్ని సిటీ సర్వీసులు నగరానికి తీసుకువస్తామన్నారు. అదనంగా సిటీ బస్సులు వస్తే అప్పుడు మరిన్ని రూట్లలో ప్రవేశపెడతామన్నారు.
ఆర్టీసీ ఆర్‌ఎం వీ.నాగశివుడు మాట్లాడుతూ సిటీ సర్వీసుల కోసం ఎన్నాళ్ల నుంచో ప్రజాసంఘాలు తీవ్ర పోరాటం చేశాయన్నారు. రాష్ట్ర రవాణ శాఖామంత్రి శిద్దా రాఘవరావు కృషి వల్లే ఇది సాధ్యమైందన్నారు. నూతన బస్సులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో రూట్ల ఎంపిక చేపడతామన్నారు. సిటీ బస్సుల కోసం ప్రత్యేక స్టూడెంట్ పాసులు ఉంటాయని, అదే విధంగా ఉద్యోగులకు కూడా ప్రత్యేక బస్సు పాసులు అమలు చేయాల్సి ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, సీఎంఈ రవికాంత్,ఒంగోలు డిపో మేనేజర్ మురళీ బాబు, అసిస్టెంట్ మేనేజర్ శ్యామల, ఎన్‌ఎంయూ, ఎంప్లాయీస్ యూని యన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
బస్సుల సమయాలు ఇలా:
మొత్తం 5 మార్గాల్లో ఏర్పాటు చేసిన ఈ సర్వీసులు పలు ముఖ్యమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉండే సమయాలు విధంగా ఉన్నాయి.
సూరారెడ్డిపాలెం: 5.45, 6.15, 6.45, 8.15, 8.35, 9.15, 10.45, 10.55, 11.45, 13.15, 13.15, 14.15, 15.00, 16.00, 17.15, 17.30, 18.20, 19.45, 20.00, 22.15
మద్దిపాడు: 6.30, 7.00, 8.30, 9.30, 10.30, 12.00, 12.30, 14.15, 15.00, 16.15, 17.00, 18.45, 19.00, 21.00 ,21.15,
సంతనూతలపాడు: 5.30, 7.30, 8.00, 9.30, 10.30, 11.30,13.00, 13.30, 16.00, 16.00, 18.00, 18.30, 20.00, 21.00, 21.55
కరువది: 7.20, 9.40, 12.00, 14.15, 17.05,19.25, 21.45.
యరజర్ల: 6.45, 9.15, 11.45, 14.15, 17.00, 19.30, 21.55.
మంగమూరు: 5.30,8.00, 10.30, 13.00, 15.45, 18.15, 20.45.