
రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలి
కడప అర్బన్ : రిటైర్డ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలనీ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్టాండు నుంచి పీఎఫ్ కార్యాలయం వరకు రిటైర్డ్ ఉద్యోగులు ...
కడప అర్బన్ : రిటైర్డ్ ఉద్యోగులకు ఈపీఎఫ్ పెన్షన్ పెంచాలనీ డిమాండ్ చేస్తూ ఆర్టీసీ బస్టాండు నుంచి పీఎఫ్ కార్యాలయం వరకు రిటైర్డ్ ఉద్యోగులు, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంఎన్‌రెడ్డి, ఎల్.రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈపీఎఫ్ 1995 స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం వాగ్దానం ప్రకారం 2005 నుంచి రివ్యూ చేసి అప్పటి నుంచి ఈపీఎఫ్ పెన్షన్‌దారులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. ఈపీఎఫ్ స్కీమ్ 1995 సభ్యులెవరికీ ఎల్‌ఐసీని పునరుద్దరించాలని, అందుకు పెన్షన్‌లో రికవరీ చేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎఫ్ ఎల్‌ఐసీ అందరికీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా రద్దు చేసిన ఈపీఎఫ్‌లో 1/3 పెన్షన్ అమ్ముకునేందుకు అనుమతించాలన్నారు. ఈపీఎఫ్ పెన్షన్ నిధిని షేర్‌మార్కెట్‌లో ఉంచి జూదమాడే విధానాన్ని నిషేదించాలన్నారు.