చర్చిలో ఉన్మాది బీభత్సం | Man attacks Woman with hammer | Sakshi
Sakshi News home page

చర్చిలో ఉన్మాది బీభత్సం

Published Sun, Jan 10 2016 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM

Man attacks Woman with hammer

కర్నూలు :  చర్చిలో ప్రార్థనలు జరుగుతన్న సమయంలో అక్కడకు వెళ్లిన ఓ సైకో తన చేతిలో ఉన్న సుత్తితో ఓ వైద్యురాలిపై దాడి చేశాడు. దీంతో తలకు బలమైన గాయమై ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన కర్నూలులోని సీఎస్‌ఐ చర్చిలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న హిమబిందు(45) సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ప్రదీప్ కుమార్ అనే ఉన్మాది సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఇది గుర్తించిన తోటివాళ్లు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement