ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం | Psycho Hulchal In RTC Bus At Kothagudem District | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

Published Fri, Jun 21 2019 7:42 PM | Last Updated on Fri, Jun 21 2019 7:42 PM

Psycho Hulchal In RTC Bus At Kothagudem District - Sakshi

సైకోను అదుపులోకి తీసుకున్న ప్రయాణికులు

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. బస్సులోని మహిళ కండక్టర్‌పై దాడికి యత్నించడమే కాకుండా, ఒక ప్రయణికున్ని కూడా గాయపరిచాడు. జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా మధ్య ఈ ఘటన చోటుచేసకుంది.  వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట రింగ్‌రోడ్డు వద్ద బస్సు ఎక్కిన సైకో.. సత్తుపల్లికి టికెట్‌ ఇవ్వమని కండక్టర్‌ను అడిగాడు. అందుకు కండక్టర్‌ డబ్బులు అడగ్గా.. డబ్బులు లేవని చెప్పి దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్‌చల్‌ చేసిన సైకో.. కొద్దిసేపటికే బస్సు దిగి పారిపోయాడు. తర్వాత సైకోను వెంబడించిన ప్రయాణికులు అక్కడికి దగ్గర్లోని మామిడి తోటలో సైకోను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న రాజుకు స్వల్ప గాయలైనట్టు గా తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement