సాక్షి, శ్రీకాకుళం : పట్టణంలోని డీసీసీబీ కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. విజయ విహారి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న కె. సత్యనారాయణ అనే వ్యక్తి ఇరుగుపొరుగు వారిని కత్తులతో బెదిరిస్తూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. దీంతో కొంతమంది స్థానిక యువకులు అతడిని పట్టుకుని చేతులు కట్టేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సత్యనారాయణ నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా భార్యా, తల్లిదండ్రులు తనను విడిచి పెట్టారన్న మనస్తాపంతో మద్యం మత్తులో అలా ప్రవర్తించానని సత్యనారాయణ పోలీసులకు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment