
క్షుద్రపూజల కోసం చిన్నారి బలి
సైకోకు దేహశుద్ధి చేసి నిప్పంటించిన గ్రామస్థులు
సాక్షి, వలేటివారిపాలెం: క్షుద్ర పూజల కోసం చిన్నారిని ఓ సైకో కిరాతకంగా హత్య చేసిన ఘటన ప్రకా శం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో బు దవారం జరిగింది. గ్రామానికి చెందిన లింగాబత్తిన మహేంద్ర, ఆదిలక్ష్మమ్మల రెండో కుమారుడు మనుసాగర్(4) రోజూలాగే బుధవారం అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు.మధ్యాహ్నం రాకపోవడంతో తల్లి వెతుకుతుండగా పెయ్యల తిరుమలరావు అనే వ్యక్తి తీసుకెళ్లాడని స్థానికు డు తెలిపాడు. దీంతో ఆమె అతని ఇంటికి వెళ్లి గట్టిగా నిలదీసింది. తాను తీసుకువచ్చానని, కొడవలితో చిన్నారిని నరికి లోపల పెట్టానంటూ పారిపోయాడు.
ఆదిలక్ష్మమ్మ భర్త మహేంద్రకు ఈ విషయం తెలిపింది. అతను నిందితుడ్ని వెతికి పట్టుకొని అతని ఇంటికి తెచ్చి తలుపులు తీసి చూడడంతో రక్తపు మడుగులో తల లేకుండా ఉన్న కొడుకు మొండెం కనిపించింది. దీంతో సైకోను స్థానికులు స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. క్షుద్రపూజలు చేసినట్లు గ్రామస్థులు గుర్తించారు. ఆగ్రహంతో సైకో ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించారు.పోలీసులు సైకోను మంటల నుంచి కాపాడారు.