సాక్షి, హైదరాబాద్ : నగరంలో సైకో వీరంగ సృష్టించాడు. సిక్రింద్రాబాద్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై బలమైన కర్రతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడే రోడ్డుపై పడిపోయాడు. రోడ్డుపై కిందపడ్డా ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. సైకో దాడిని గమనించిన అక్కడివారు అతడ్నిపట్టుకునే ప్రయత్నం చేసే లోపు పరారయ్యాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కొద్దిసేపటి క్రితం సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని నర్సిరెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నర్సిరెడ్డి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment