secendrabad
-
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణకు అస్వస్ధత
Kaikala Satyanarayana Hospitalized: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఆయన జారిపడ్డారు. దీంతో గతరాత్రి నొప్పులు ఎక్కువగా ఉండటంతో సికింద్రాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనను చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని, ఆందోళన పడాల్సి అవసరం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: పునీత్ మా ఇంటికి వచ్చేవారు..కలిసి భోజనం చేసేవాళ్లం: బన్నీ పునీత్ రాజ్‌కుమార్‌కు పవర్‌స్టార్ అనే బిరుదు ఎలా వచ్చిందంటే.. -
ఐదు నిమిషాల్లో 40 వేల లీటర్లు
సాక్షి, హైదరాబాద్: కేవలం ఐదే నిమిషాల్లో ఓ రైలు మొత్తానికి నీటిని నింపే ఆధునిక వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. రైలులోని ప్రతి బోగీలో 1,600 లీటర్ల సామర్థ్ధ్యముండే నీటి ట్యాంకు ఉంటుంది. రైలులోని మొత్తం బోగీల్లో కలిపి సుమారు 40 వేల లీటర్ల నీటిని నింపుతారు. ఇలా ట్యాంకులన్నీ నింపేందుకు గతంలో చాలా సమయం పట్టేది. పెద్దమొత్తంలో నీళ్లు వృథా అయ్యేవి కూడా. ఇప్పుడు సమయం ఆదా కావటంతోపాటు నీటి వృథాను అరికట్టేలా కొత్త వ్యవస్థను ఏర్పాటు చేశారు. తొలుత సికింద్రాబాద్ స్టేషన్లో ప్రారంభించారు. రిమోట్ ద్వారా నిర్వహించే ఈ వ్యవస్థ కంట్రోల్ ప్యానెల్ ప్లాట్‌ఫామ్ చివరన ఉంటుంది. లోడును బట్టి పంపుల ద్వారా విడుదలయ్యే నీటి ఒత్తిడిని నియంత్రించేలా ఆటోమేటిక్ కంట్రోల్ సిస్టం ఏర్పాటు చేశారు. 20 హెచ్‌పీ సామర్థ్యంతో నిమిషానికి వంద క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేసే పంపులను అమర్చారు. -
నగరంలో సైకో ఉన్మాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సైకో వీరంగ సృష్టించాడు. సిక్రింద్రాబాద్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై బలమైన కర్రతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడే రోడ్డుపై పడిపోయాడు. రోడ్డుపై కిందపడ్డా ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. సైకో దాడిని గమనించిన అక్కడివారు అతడ్నిపట్టుకునే ప్రయత్నం చేసే లోపు పరారయ్యాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కొద్దిసేపటి క్రితం సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని నర్సిరెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నర్సిరెడ్డి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
శిశువు తరలింపు యత్నం..
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో శిశువు కిడ్నాప్ వదంతులు కలకలం రేపాయి. శిశువు పుట్టిన వెంటనే తనను డిశ్చార్జ్ చేయమంటే వైద్యులు అంగీకరించక పోవడంతో ఆమె తన బంధువులతో కలసి పాపను దొంగతనంగా తరలించేందుకు యత్నించడం కొంతసేపు ఆస్పత్రిలో గందరగోళం సృష్టించింది. మౌలాలీకి చెందిన జ్యోతి(23) నాలుగు రోజుల క్రితం ప్రసవం కోసం గాంధీ ఆస్పత్రిలో చేరింది. ఈనెల 18న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆస్పత్రిలో సేవలు చేసేందుకు ఎవరూ లేరని, సాధారణ ప్రసవం కావడంతో తనను డిశ్చార్జ్ చేయమని జ్యోతి వైద్యులను కోరింది. శిశువు ఆరోగ్యపరిస్థితి దృష్ట్యా వైద్యులు నిరాకరించారు. దీంతో సిబ్బందికి తెలీకుండా వార్డు నుంచి శిశువును ఇంటికి తరలించేందుకు తోటికోడలు సరోజ, బంధువు అంజలిల సాయం కోరింది. వారు శనివారం ఉదయం 11 గంటల సమయంలో వార్డులోకి వచ్చి శిశువుతో బయట పడే ప్రయత్నం చేశారు. కొద్దిసమయం తర్వాత జ్యోతి ఆస్పత్రి బయటకు వెళ్లింది. అయితే శిశువును సెల్లార్ ద్వారం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు జ్యోతి బంధువులు చేసిన ప్రయత్నం గుర్తించిన సెక్యూరిటీసిబ్బంది అనుమానంతో ఆమెను అడ్డగించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ అవుట్‌పోస్టుకు తీసుకువచ్చారు. పోలీసులు, ఆస్పత్రి అధికారులు గట్టిగా నిలదీయడంతో జరిగిన విషయం వారు వివరించారు. ఆస్పత్రి బయట ఉన్న బాలింత జ్యోతిని వార్డులోకి రప్పించి ఆరా తీయడంతో తన ఇంటివద్ద పరిస్థితుల కారణంగా డిశ్చార్జ్ కోరానని వైద్యులు నిరాకరించడంతో శిశువును దొంగతనంగా ఇంటికి తరలించేందుకు యత్నించామని తెలిపింది. పూర్తి వివరాలు సేకరించిన పోలీసులు శిశువుతోపాటు జ్యోతిని వార్డు సిబ్బందికి అప్పగించారు. సరోజ, అంజలిలను గట్టిగా హెచ్చరించి పంపేశారు. అయితే ఇదంతా శిశువు కిడ్నాప్ ఉదంతంగా ప్రచారం అవ్వడంతో ఆస్పత్రిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. చివరికి వదంతులకు తెరపడింది. -
హోటల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మారేడుపల్లి: నగరంలోని జేబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఓ ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా హోటల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఫుడ్ మాస్టర్‌తోపాటు ఇద్దరికి గాయాలయ్యాయి. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో విధులు ముగిశాక పల్లె వెలుగు బస్సును బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేస్తుండగా...అకస్మాత్తుగా బస్సు హోటల్లోకి దూసుకెళ్లింది. మొదట బస్సును రివర్స్ తీస్తుండగా...వెనుక ఉన్న టీ స్టాల్‌కు తగిలింది. దీంతో స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయబోయి..ఎక్సలేటర్ తొక్కడంతో బస్సు ఎదురుగా ఉన్న హోటల్లోకి దూసుకెళ్లింది. హోటల్లో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక్క ఫోన్ కాల్... జీవితాన్ని నిలబెడుతుంది!
మనదేశం 2012లో 1,35, 445 ఆత్మహత్యలను చూసింది. డబ్ల్యుహెచ్ఓ నివేదిక ప్రకారం గడచిన 45 ఏళ్లలో ప్రపంచంలో ఆత్మహత్యలు 60 శాతం పెరిగాయి. అవి కూడా 15-44ఏళ్ల మధ్య వయస్కుల్లోనే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రపంచంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 20 శాతం భారతీయులే. ఆత్మహత్యల్లో మనదేశం మొదటిస్థానంలో ఉందని గణాంకాలు చెబుతుంటే భావిభారతాన్ని ఎలా ఊహించుకోవాలి? ఇది ఇలా ఉంటే... ఒకరోజు రాత్రి ఎనిమిది గంటల సమయం. సికింద్రాబాద్‌లోని సింధ్ కాలనీ, రోష్నీ హెల్ప్‌లైన్ ఆఫీసుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి... తనకు జీవితం మీద విరక్తి కలుగుతోందంటూ తన బాధలను చెప్పుకుంటున్నాడు. ప్రేమలో విఫలం కావడం, ఆఫీసులో పని మీద మనసు పెట్టలేకపోవడం, తరచూ తప్పులు చేయడం, గతంలో చేసిన పనే అయినా ఇప్పుడు చేయలేనంత ఒత్తిడిగా అనిపించడం వంటి సమస్యలను ఏకరువు పెట్టాడు. ‘నా సమస్య అందరికీ నవ్వులాటగా ఉంటోంది. కనీసం విని ఓదార్చేవారు లేరు. నేను మా కొలీగ్‌నే ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు, సరికదా మరో కొలీగ్‌తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాను. ఆఫీసులో పనిచేతగాని వాడిలాగ ముద్ర పడింది. నేను ఎవరికీ అక్కరలేదు, అలాంటప్పుడు బతికి సాధించేదేమీ ఉండదు. చనిపోవాలని ఉంది’ అని భోరుమన్నాడు. ఈ సమస్య ఈ కుర్రాడిదే కాదు. ఇటీవల ఇలాంటివి ఎక్కువయ్యాయి. ‘సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న యువతి’ వంటి వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. పని ఒత్తిడి ఎక్కువైతే, ఆఫీసులో డెడ్‌లైన్ అందుకోలేకపోతే దానికి ఆత్మహత్య పరిష్కారమా? ఆత్మహత్యతో ప్రేమ సఫలమవుతుందా? జీవితం అంటే... నల్లేరు మీద బండి నడకలా హాయిగా సాగిపోయే అందమైన సినిమా అని రంగుల కల కనడమే ఇందుకు కారణమా? ఒక చిన్న కష్టం ఎదురవగానే కుంగిపోతే ఇక సాధించేదేంటి? ప్రయాణంలో మలుపు! ‘రోడ్డు మీద వెళ్తుంటే మలుపు వస్తుంది, దూరం నుంచి చూస్తే రోడ్డు అక్కడితో ఆగిపోయినట్లు, ముందుకు వెళ్లడానికి దారి లేనట్లు అనిపిస్తుంది. కానీ దగ్గరకు వెళ్లి చూస్తే అది ముగింపు కాదు మలుపు మాత్రమే అని తెలుస్తుంది. అక్కడ మలుపు తీసుకుంటే ప్రయాణం సాఫీగా ముందుకు సాగిపోతుంది. ఒకవేళ అది మలుపు కాక ముగింపు అయితే ‘యు టర్న్’ తీసుకుని మరోదారి కోసం అన్వేషిస్తాం తప్ప గమ్యాన్ని చేరకుండా ప్రయాణాన్ని అర్ధంతరంగా ఆపివేయరు ఎవరూ. జీవితమూ అంతే. ఒక కష్టం వచ్చిందని జీవితాన్ని అంతం చేసుకోరాదు. అలా అంతం చేసుకుంటూ పోతే ఇప్పటికి ప్రపంచంలో ఎవ్వరూ మిగిలి ఉండరు. ప్రతి మనిషికీ జీవితంలో ఏదో ఒక సమయంలో ‘ఈ జీవితం వద్దు, చనిపోతే బావుణ్ణు’ అనిపిస్తుందంటారు మనస్తత్వ విశ్లేషకులు. అలా అనిపించిన ప్రతి ఒక్కరూ అనిపించిన వెంటనే ప్రాణాలు తీసుకుంటూ పోతే భూమ్మీద మనుషులే ఉండరు. అది ఓ ఆర్తనాదం! ‘ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడ్డారంటే అర్థం మరణించడానికి సిద్ధపడినట్లు కాదు, అది సహాయం కోసం చేసే ఆర్తనాదం’ అంటారు రోష్నీ హెల్ప్‌లైన్ నిర్వాహకురాలు సుచరిత. యుక్త వయసు వచ్చిన తర్వాత కలిగే ఆకర్షణలతో ప్రేమ కలగడం సహజమే. అయితే మనకు కలిగిన భావమే ఎదుటి వారికీ కలగాలని లేదు. ఈ చిన్న తర్కాన్ని మరిచిపోవడం చాలా ఆత్మహత్యలకు కారణమవుతోంది. అలాగే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది. ఒక ఉద్యోగంలో రాణించలేకపోతే తాను రాణించగలిగిన మరో ఉద్యోగం ఏదో ఉండే ఉంటుంది. దానిని వెతుక్కోవాలి తప్ప, జీవితాన్ని వదులుకోకూడదు. జీవితాన్ని అంతం చేసుకోవాలనే కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే. తాను ప్రేమించిన వ్యక్తి వారికి ఇష్టమైన మరో వ్యక్తితో జీవితాన్ని హాయిగా కొనసాగిస్తారు. అలాగే ఉద్యోగం ఇచ్చిన యాజమాన్యం ఆ స్థానంలో మరొకరిని నియమించుకుంటుంది. సదరు ఆత్మహత్య చేసుకున్న వారు చనిపోతే ఆ స్థానం మరొకరితో చాలా సులభంగా భర్తీ అవుతుంది. మరి కన్న తల్లిదండ్రులకు? వారికి ఆ స్థానం ఎప్పటికీ భర్తీ కాదు. అలాగే పెళ్లయిన వారు ఆత్మహత్యకు పాల్పడితే జీవితభాగస్వామికి జరిగే లోటును పూడ్చేదెవరు? ఆ పిల్లలకు అమ్మానాన్నల ప్రేమ అందేదెలా? ఆత్మహత్య చేసుకోవడం ద్వారా జరిగే నష్టాలను, కోల్పోయే అనుబంధాలను గుర్తు చేసుకుంటే ప్రస్తుతం ఎదురైన కష్టం చాలా చిన్నదని క్షణంలో తెలిసిపోతుంది. ఆత్మహత్య నిర్ణయాన్ని ఒక్కసారి వాయిదా వేసి వెనక్కు చూసుకుంటే... ఇక్కడి వరకు సాగిన జీవన ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మీద భరోసా కలుగుతుంది. జీవించి తీరాలనే తపన పెరుగుతుంది. - వాకా మంజులారెడ్డి -
వేధిస్తున్నారని భార్య, అత్త హత్య
సికింద్రాబాద్‌లో ఘటన సాక్షి, హైదరాబాద్: తనను, తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తూ మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనే కారణంతో ఓ వ్యక్తి తన భార్యను, అత్తను హతమార్చిన ఘటన సికింద్రాబాద్‌లో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సికింద్రాబాద్ సెకండ్బజార్కు చెందిన శరవణన్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతను 2010లో బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తుండగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పద్మప్రియతో ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. అయితే కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తి గొడవలు రేగాయి. దీంతో ఆమె భర్తతోపాటు అతని కుటుంబ సభ్యులు 15 మందిపై బెంగళూరులో 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టింది. అతన్ని ఉద్యోగం నుంచి కూడా తీసేయించింది. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన శరవణన్ సికింద్రాబాద్‌లోని సెకండ్‌బజార్‌లో ఉంటున్నాడు. పద్మప్రియకు అంతకుముందే మరోవ్యక్తితో పెళ్లి జరిగిన విషయం తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. పద్మప్రియ బెంగళూరులో కోర్టుకెళ్లి భర్త తనతో సంసారం చేసేలా ఉత్తర్వులివ్వాలని పిటిషన్ వేసింది. తనకు అనుకూలంగా తీర్పు రావడం తో హైదరాబాద్‌కు వచ్చిన పద్మప్రియ.. భర్తతో కలిసి సెకండ్‌బజార్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగింది. పోలీసుల జోక్యం తో కొద్దిరోజులు కాపురం సజావుగా సాగింది. అయితే శరవణన్‌తోపాటు అతని కుటుంబసభ్యులతో నిత్యం గొడవ పడేది. దీంతో శరవణన్ తన తల్లితో కలిసి శివాజీనగర్‌లో విడిగా ఉంటున్నాడు. మరోవైపు పద్మప్రియ తన తల్లి పరమేశ్వరి(60)తో కలిసి ఉంటోంది. భార్య నుంచి నిత్యం వేధింపులు ఎదురవుతుండటం, కుటుంబ సభ్యులందరికీ మనశ్శాంతి కరువవడంతో ఆమెను హత్య చేయాలన్న నిర్ణయానికి వచ్చిన శరవణన్ తన సోదరుడు అయ్యప్ప, మేనమామ అంగముత్తులతో కలిసి పథకరచన చేశాడు. ఈలోగా బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో అంగముత్తు ఇంట్లో ఉన్న అతని కోసం పద్మప్రియ తన తల్లితో కలిసి వచ్చి గొడవకు దిగింది. అత్త అదే పనిగా తిట్టడంతో ఆగ్రహించిన శరవణన్ భార్య,అత్తను ఇనుపరాడ్‌తో తలపై కొట్టాడు. అనంతరం చున్నీని మెడకు బిగించి చంపాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఓడిన అబల
లింగాల, న్యూస్‌లైన్: కామాంధుల దుశ్చర్యకు, మృగాళ్ల కబందహస్తాల్లో దురాగతానికి గురైన ఆ అబల ఓడిపోయింది. రాష్ట రాజధానిలో దుండగుల చేతిలో సామూహిక లైంగికదాడికి గురైన గిరిజన మహిళ 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో కనుమూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన వివరాలు పోలీసుల, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొత్తచెర్వు తండాకు చెందిన గిరిజన మహిళ(35) భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. పిల్లలను అక్కడే చదివిస్తూ.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురంలో చిన్నగుడిసెను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో గుడిసెలో నిద్రిస్తున్న ఆమెపై ఈనెల 3న గుర్తుతెలియని గుర్తుతెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక లైంగికదాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది. స్థానిక పోలీసలకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో అక్కడే కూలీపనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు. లింగాల పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధి కాదని తిప్పిపంపించారు. బంధువులు ఆమెను చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. జరిగిన సంఘటనపై బాధితురాలికి న్యాయం చేయడంలో పోలీసులు, అధికారుల తీరుపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌లు తీవ్రంగా స్పందించడంతో నాగర్‌కర్నూల్ డీఎస్పీ, అచ్చంపేట సీఐ లింగాలకు చేరుకుని బాధితురాలిని హుటాహుటినా ఈనెల 5న బాధిత మహిళను అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఇదిలాఉండగా లింగాల పోలీసులు సంఘటన జరిగినపై సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం వెళ్లి విచారించారు. వైద్యచికిత్సలు అందించడంలో కాలయాపన జరగడంతో పరిస్థితి విషమించిన బాధితురాలిని ఈనెల 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆమెకు తల్లిదండ్రులు, బంధువులు సపర్యలు చేశారు. 12 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంతో ప్రాణాలు విడిచింది. మృతురాలికి కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. విషయం తెలుసుకుని కొత్తచెరువు తండా వాసులు శోకసంద్రంలో మునిగారు. అనాథలుగా మారిన పిల్లలు తండ్రి ఏడేళ్ల క్రితం చనిపోవడంతో అన్ని తానై చూసుకుంటున్న తల్లి మృత్యువాతపడటంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. మృతురాలికి కొతన తల్లిపై జరిగిన దారుణానికి ఇప్పటికీ తలుచుకుని కుమిలిపోతున్నారు. వారి ఆలనాలపాలన చూసేవారు ఎవరంటూ స్థానికులు కంటితడి గుండెల్ని పిండేస్తుంది. పిల్లలను ఏకాకులుగా చేసి వెళ్లిందన్న రోదనలు మిన్నంటాయి.