మారేడుపల్లి: నగరంలోని జేబీఎస్ బస్టాండ్ ప్రాంగణంలో ఓ ఆర్టీసీ బస్సు అకస్మాత్తుగా హోటల్‌లోకి దూసుకెళ్లింది. దీంతో ఫుడ్ మాస్టర్‌తోపాటు ఇద్దరికి గాయాలయ్యాయి. మారేడుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మంగళవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో విధులు ముగిశాక పల్లె వెలుగు బస్సును బస్టాండ్ ప్రాంగణంలో ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేస్తుండగా...అకస్మాత్తుగా బస్సు హోటల్‌లోకి దూసుకెళ్లింది.
మొదట బస్సును రివర్స్ తీస్తుండగా...వెనుక ఉన్న టీ స్టాల్‌కు తగిలింది. దీంతో స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయబోయి..ఎక్సలేటర్ తొక్కడంతో బస్సు ఎదురుగా ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. హోటల్‌లో ఉన్న ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment