లింగాల, న్యూస్‌లైన్: కామాంధుల దుశ్చర్యకు, మృగాళ్ల కబందహస్తాల్లో దురాగతానికి గురైన ఆ అబల ఓడిపోయింది. రాష్ట రాజధానిలో దుండగుల చేతిలో సామూహిక లైంగికదాడికి గురైన గిరిజన మహిళ 12 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో కనుమూసింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన వివరాలు పోలీసుల, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కొత్తచెర్వు తండాకు చెందిన గిరిజన మహిళ(35) భర్త ఏడేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోవడంతో ముగ్గురు పిల్లలను వెంట తీసుకుని ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. పిల్లలను అక్కడే చదివిస్తూ.. సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురంలో చిన్నగుడిసెను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటుంది. ఈ క్రమంలో గుడిసెలో నిద్రిస్తున్న ఆమెపై ఈనెల 3న గుర్తుతెలియని గుర్తుతెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. సామూహిక లైంగికదాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లింది.
స్థానిక పోలీసలకు ఫిర్యాదు చేయగా పట్టించుకోకపోవడంతో అక్కడే కూలీపనులు చేసుకుంటున్న తల్లిదండ్రులు ఆమెను స్వగ్రామానికి తీసుకొచ్చారు. లింగాల పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ పరిధి కాదని తిప్పిపంపించారు. బంధువులు ఆమెను చికిత్స కోసం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. జరిగిన సంఘటనపై బాధితురాలికి న్యాయం చేయడంలో పోలీసులు, అధికారుల తీరుపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. కలెక్టర్ ఎం.గిరిజాశంకర్, ఎస్పీ డి.నాగేంద్రకుమార్‌లు తీవ్రంగా స్పందించడంతో నాగర్‌కర్నూల్ డీఎస్పీ, అచ్చంపేట సీఐ లింగాలకు చేరుకుని బాధితురాలిని హుటాహుటినా ఈనెల 5న బాధిత మహిళను అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
ఇదిలాఉండగా లింగాల పోలీసులు సంఘటన జరిగినపై సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురం వెళ్లి విచారించారు. వైద్యచికిత్సలు అందించడంలో కాలయాపన జరగడంతో పరిస్థితి విషమించిన బాధితురాలిని ఈనెల 6న హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతున్న ఆమెకు తల్లిదండ్రులు, బంధువులు సపర్యలు చేశారు. 12 రోజుల పాటు మృత్యుతో పోరాడి చివరకు బుధవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంతో ప్రాణాలు విడిచింది. మృతురాలికి కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. విషయం తెలుసుకుని కొత్తచెరువు తండా వాసులు శోకసంద్రంలో మునిగారు.
అనాథలుగా మారిన పిల్లలు
తండ్రి ఏడేళ్ల క్రితం చనిపోవడంతో అన్ని తానై చూసుకుంటున్న తల్లి మృత్యువాతపడటంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలారు. మృతురాలికి కొతన తల్లిపై జరిగిన దారుణానికి ఇప్పటికీ తలుచుకుని కుమిలిపోతున్నారు. వారి ఆలనాలపాలన చూసేవారు ఎవరంటూ స్థానికులు కంటితడి గుండెల్ని పిండేస్తుంది. పిల్లలను ఏకాకులుగా చేసి వెళ్లిందన్న రోదనలు మిన్నంటాయి.
ఓడిన అబల
Published Thu, Aug 15 2013 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement
Advertisement