![Cannot Be Guaranteed of Suresh Life : Osmania Doctors - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/6/suresh_5.jpg.webp?itok=d4oawPuj)
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్‌ఎమ్‌ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment