Vijaya Reddy
-
దానం నాగేందర్‌తో సహా పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్ ఎన్నికను రద్దు చేయాలంటూ ఆయన ప్రత్యర్ధి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని పిటిషనర్ తరపున సుంకర నరేశ్ కోర్టుకు తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి వాయిదా వేసింది. దానంతోపాటు పలువురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం నాగేందర్, కోవా లక్ష్మి, మాగంటి గోపీనాథ్, కూనంనేని, మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు పంపింది. వీరంతా ఎన్నికల్లో తప్పుడు అఫడవిట్లు సమర్పించారని హైకోర్టులో వేర్వేరు పిటిషనలు దాఖలయ్యాయి. చదవండి: హస్తం గూటికి జీహెచ్ఎంసీ మేయర్? -
గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో మంత్రి పదవి వరించేదెవరిని...ఎవరికి ఆ అవకాశం లభించనుంది అంటే ఇప్పట్లో గ్రేటర్ నుంచి మంత్రి పదవి లేనట్లే అని తెలుస్తోంది. తెలంగాణ అంతటా విజయదుందుభి మోగించినా గ్రేటర్ ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారు. దీంతో ఇక్కడి నుంచి ఇప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రెండో విడుత కేటాయింపుల్లో భాగంగా ఎమ్మెల్సీ కోటాలో మాత్రమే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు మంత్రి పదవులను కేటాయించవచ్చు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే శివార్లలోని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఆ ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. కానీ తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సామాజిక వర్గాల వారిగా పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఇప్పటికే ఈ దిశగా కాంగ్రెస్ కసరత్తును చేపట్టింది. ఈ క్రమంలో ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ పదవులు కట్టబెట్టారనే చెడ్డపేరు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఆ రకంగా మల్‌రెడ్డికి ఈ దఫా అవకాశం లభించకపోవచ్చునని ఆ పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారిని ఎంపిక చేసేందుకు ప్రస్తుతం అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్సీలుగా ఎంపికై న తరువాత మాత్రమే నగరం నుంచి మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ వరించేదెవరిని... పదవీకాలం ముగిసిన వారితో పాటు, గవర్నర్ కోటా కింద త్వరలో ఎమ్మెల్సీల ఎంపిక జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారు, తాము గెలిచే స్థానాలను త్యాగం చేసి మరో చోట పోటీ చేయడంతో ఓడిన వాళ్లు, ఎంతోకాలంగా కాంగ్రెస్‌కు సేవ చేస్తున్న సీనియర్లకు ఎమ్మెల్సీ పదవులను కేటాయించవలసి ఉంటుంది. ఈ జాబితాలో అంజన్‌కుమార్ యాదవ్, మధుయాష్కీగౌడ్, కేఎల్ఆర్, విజయారెడ్డి, వెన్నెల తదితరులు ఉన్నారు. అంజన్‌కుమార్ యాదవ్ సీనియర్ నాయకుడు. అలాగే ఆ సామాజిక వర్గం దృష్టిలో చూసినా ఎంతో ప్రాధాన్యం ఉన్న నేత కావడంతో ఆయనకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. మరోవైపు పోటీచేసి ఓడిపోవడమే కాకుండా, పార్టీలో క్రియాశీల నాయకుడిగా గుర్తింపు కలిగిన మధుయాష్కీ కూడా కీలకమే. ఇక మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యతను ఇవ్వదలిస్తే ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయారెడ్డిని ఎంపిక చేయవలసి ఉంటుంది. మరి కొందరు సీనియర్లు కూడా ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడే అవకాశం ఉంది. ఇలా వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు హైదరాబాద్ నుంచి ఇప్పటికిప్పుడు మంత్రి పదవి ఎవ్వరికీ లభించకపోవచ్చుననే గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీల ఎంపికకు మరికొంత సమయం ఉన్న దృష్ట్యా ఆ ఛాన్స్ ఎవరిని వరించనుందో..వేచి చూడవలసిందే. -
ముగ్గురూ.. ముగ్గురే..!
రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర. బంజారాహిల్స్: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వీరికి తోడు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ►హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్‌కు ఇప్పుడామె సవాల్‌గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్‌ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మతోనే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్ఎస్ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. పీజేఆర్ బొమ్మతో... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్... పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే. అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా... అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే అ్రస్తాలుగా మలుచుకోనున్నారు. -
మిసెస్ ఏసియా వరల్డ్‌వైడ్‌గా విజయారెడ్డి
పులివెందుల రూరల్: మిసెస్ సింగపూర్–2023 పోటీల్లో ఏసియా వరల్డ్‌వైడ్ కేటగిరిలో వైఎస్సార్ జిల్లా మహిళ విజేతగా నిలిచారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డి పల్లె గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి, రమాదేవి కుమార్తె విజయారెడ్డి సింగపూర్‌లో ఎంబీఏ చదివే సమయంలో విజయవాడకు చెందిన సుంకర ప్రదీప్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు. ప్రస్తుతం విజయ, ప్రదీప్లిద్దరూ పదిహేనేళ్లుగా సింగ పూర్లోనే ఉంటూ, అక్కడ సిటీ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఈక్రమంలో అక్టోబర్21న సింగపూర్‌లో లూమియర్ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో విజయారెడ్డి పాల్గొని, విజయం సాధించారు. మొదటి ప్రయత్నంలోనే విజేత కావడం చాలా ఆనందంగా ఉందని విజయ అన్నారు. -
మరీ.. ఇంత దారుణమా.. రాత్రికి రాత్రే కూల్చేశారు..
సాక్షి, హైదరాబాద్: ‘అర్ధరాత్రి మిడతల దండులా మా ఇళ్ల మీద పడ్డారు. ఇంట్లోవాళ్లని బయటకు లాగి, సామాన్లను బయటపడేసి ఇండ్లు కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలాగే ఉన్నాయి. ఇంటిలోపల ద్విచక్రవాహనాలు కూడా ఉన్నాయి. ఇళ్లు మొత్తం నేలమట్టం చేసి రోడ్డునపడేశారు. మేము ఎక్కడకు వెళ్లాలి.. మా ఉసురు తగులుతుంది’.. అని ఎర్రమంజిల్ వాసులు అధికారులపై దుమ్మెత్తిపోశారు. ఎర్రమంజిల్ రవీంద్రనికేతన్ పాఠశాల సమీపంలో ఉన్న సుమారు 30 ఇళ్లను మంగళవారం అర్ధరాత్రి వందలకొద్ది రెవెన్యూ, జీహెచ్ఎంపీ, పోలీస్, ఆర్అండ్బీ అధికారులు వచ్చి కూల్చివేశారు. 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. ప్రభుత్వం జీవో నెంబర్ 58 కింద మాకు పట్టాలు కూడా ఇచ్చింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, మాకు ప్రత్యామ్యాయం ఏమీ చూపకుండా ఎలా కూల్చేవేస్తారని అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహంవ్యక్తం చేశారు. బుధవారం బాధితులంతా కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం నంండి సంబంధిత అధికారులందరికీ నోటీసులు పంపించారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో రెవెన్యూ అధికారులు వచ్చి అరగంటలో ఇండ్లు ఖాళీ చేయాలని కూల్చివేస్తామని వారికి చెప్పడంతో సమాచారం అందుకున్న టీపీసీసీ ప్రధానకార్యదర్శి, కార్పొరేటర్ పి.విజయారెడ్డి అక్కడకు వచ్చి వారికి మద్దతుగా అక్కడే బైఠాయించించారు. సాయంత్రం వరకు అక్కడే ఆమె ఉన్నారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒకేసారి వందల కొద్ది పోలీసులు నలుగురు తహశీల్దార్లు, ఆర్డీవో, పెద్దెత్తున రెవెన్యూ అధికారులు అక్కడకు వచ్చి ప్రతీ ఇంట్లోకి వెళ్లడం అక్కడ కరెంట్ తీసేయ్యడం, ఇంట్లో ఉన్నవారిని బయటకు లాగి, చేతికి దొరికిన సామాన్లు బయటపడేసి రెండు జేసీబీలతో ఇండ్లు మొత్తం కూల్చేశారు. ఫ్యాన్లు, ఏసీలు అలానే ఇంట్లోనే కూరుకుపోయాయి. చాలా ఇండ్లల్లో పెట్టుకున్న ద్విచక్రవాహనాలు కూడా మట్టిలోనే కూరుకుపోయాయి. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ విజయారెడ్డి అర్ధరాత్రి 2:30 ప్రాంతంలో అక్కడకు వచ్చి వారిని అడ్డుకునేందుకు యత్నించించారు. అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు, కొంతమంది బాధితులు, విజయారెడ్డి అనుచరులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరీ.. ఇంత దారుణమా అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మేము గాఢ నిద్రలో ఉన్నాము. తలుపులు తట్టగా బయటకు వచ్చేసరికి 40 మంది ఉన్నారు. బయటకు రావాలి.. ఇళ్లుకూల్చేస్తున్నామని ఒకరు మాట్లాడుతుంటేనే మరొకరు కరెంట్ కట్‌చేశారు. మరొకరు టార్చ్‌లైట్ తీసుకుని నన్ను బయటకు ఈడ్చేశారు. మా బాబు ఉన్నాడు అని చెబితే మరొకరు వెళ్లి ఐదునెలల తన బాబును తీసుకువచ్చి నా చేతిలో ఉంచి ఇల్లు కూల్చేశారు.మరీ ఇంత దారుణమా. – శిరీష కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు ఇంట్లో పెద్దవారి మందులు ఉన్నాయి. పిల్లల పుస్తకాలు ఉన్నాయి వాటిని తీసుకుంటామన్నా వినలేదు. మాకు కనీసం నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రత్యామ్యాయం చూపకుండా బయటకు గెంటేస్తే ఎలా జీవో 58 ప్రకారం మాకు పట్టా కూడా ఇచ్చారు. – మల్లీశ్వరి రాత్రంతా పోలీస్‌స్టేషన్‌లోనే మహిళా కార్పొరేటర్ ఎర్రమంజిల్ కాలనీ రామకృష్ణానగర్‌లో ఇళ్లు కూల్చడాన్ని అడ్డుకున్న ఖైరతాబాద్ కార్పొరేటర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ పి.విజయారెడ్డిని పోలీసులు మంగళవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అరెస్టుచేసి స్టేషన్‌కు ఎస్ఆర్ నగర్ స్టేషన్‌తీసుకెళ్లారు. ఆమెను బుధవారం ఉదయం 10 గంటల తరువాత వదిలి పెట్టారు. మహిళ అని చూడకుండా తనను రాత్రంతా స్టేషన్లో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డిని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు పరామర్శించారు. -
కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
కాంగ్రెస్‌లోకి విజయారెడ్డి.. రేవంత్‌రెడ్డిని కలిసి చర్చలు
సాక్షి, హైదరాబాద్/ బంజారాహిల్స్: టీఆర్ఎస్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్, సీఎల్పీ మాజీ నేత పి.జనార్దన్‌రెడ్డి (పీజేఆర్) కుమార్తె విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. శని వారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లిన ఆమె.. కాంగ్రెస్‌లో చేరే విషయమై చర్చించారు. తర్వా త రేవంత్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్లో ప్రజల తరఫున మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని, అందుకే ఆ పార్టీలో ఇమడలేకపోతున్నానని విజయారెడ్డి తెలిపా రు. తమ కుటుంబం ముందు నుంచీ కాంగ్రెస్ లోనే ఉందని, ఇప్పుడు ఆ పార్టీతో సాగితేనే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చానని చెప్పారు. ఈ నెల 23న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవి ఆశించి.. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 2009లో శేరిలిం గంపల్లి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్య ర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైఎస్సార్సీపీలో చేరి 2014లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ మరు సటి ఏడాదే టీఆర్ఎస్లో చేరారు. 2015లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఖైరతాబాద్ ఎమ్మెల్యే టికెట్ ఆశించినా.. అప్పుడే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు టికెట్ ఇవ్వడంతో నిరాశ లో మునిగారు. 2019లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండోసారి ఖైరతాబాద్ కార్పొరేటర్ గా గెలిచిన ఆమె.. టీఆర్ఎస్ మేయర్‌గా అవకాశమిస్తుందని ఆశించారు. కానీ అవకాశం రాకపోవడంతో టీఆర్ఎస్కు దూరమవుతూ వచ్చారు. ఆ అసంతృప్తితోనే తాజాగా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. -
టీఆర్ఎస్ కు బై బై.. కాంగ్రెస్ కు హయ్ హయ్..!!
-
ఇంత పెద్ద నిర్ణయం ఏక పక్షంగా ఎలా తీసుకుంటారు?: రేవంత్ రెడ్డి
-
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో విజయారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి శనివారం ఉదయం భేటీ అయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ కార్పొరేటర్‌గాఉన్న విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ఆమె రేవంత్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం విజయారెడ్డి మీడియాతో మాట్లాడారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. 'కాంగ్రెస్ కోసం పీజేఆర్ ఎంతో పనిచేశారు. కాంగ్రెస్‌లో మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నా. చాలా రోజుల నుంచి రేవంత్‌రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్. టీఆర్ఎస్లో పరిస్థితులు బాగాలేవు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. పీజేఆర్ కూతురిగా టీఆర్ఎస్లో ఉండలేకపోతున్నానని' విజయారెడ్డి అన్నారు. చదవండి: (సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాడి వెనక సంచలన విషయాలు) -
వీఆర్ఏలకు గార్డు విధులు!
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మహిళా తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో నిర్మల్ జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయోగం చేపట్టింది. గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ)కు కొత్త రూపు ఇచ్చింది. వారికి ‘రక్షణ’ విధులు అప్పగించింది. రెవెన్యూ ఉద్యోగుల భద్రత, సందర్శకుల రాకపోకలపై కన్నేసి ఉంచేందుకు సెక్యూరిటీ గార్డులుగా నియమించింది. తహసీల్దార్ ఆఫీసులకు వచ్చే ప్రజల్లో కొందరు తమ సమస్యలు పరిష్కారం కావట్లేదనే ఆక్రోశంతో అధికారులపై దాడులకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. గతేడాది నవంబర్ 4న తహసీల్దార్ విజయారెడ్డిని పట్టపగలు ఆమె కార్యాలయంలోనే ఓ రైతు పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన ఈ కోవలోనిదే. విజయారెడ్డి సజీవదహనంతో అవాక్కయిన రెవెన్యూ యంత్రాంగం... వారం పాటు విధులు బహిష్కరించింది. తమకు రక్షణ కల్పిస్తే తప్ప విధులు నిర్వహించలేమని స్పష్టం చేసింది. రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించడంతో రంగంలోకి దిగిన సర్కారు రెవెన్యూ ఉద్యోగుల విధుల నిర్వహణకు పోలీసు రక్షణ కల్పించింది. కానీ క్రమేణా కానిస్టేబుళ్లను వెనక్కి తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యానే నిర్మల్ జిల్లా అధికారులు వీఆర్ఏలకు సెక్యూరిటీ గార్డు విధులు అప్పగించాలని నిర్ణయించారు. డ్రెస్‌కోడ్‌తో కొత్త అవతారమెత్తిన వీఆర్ఏల వ్యవహారం ప్రస్తుతం రెవెన్యూశాఖలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటికే మండల కార్యాలయాలు, అధికారుల వద్ద ఆర్డర్లీ సేవలందిస్తున్న వీఆర్ఏలను తాజాగా సెక్యూరిటీ గార్డులుగా నియమించడంపై రాష్ట్ర స్థాయిలో ఉద్యోగ సంఘాలు మండి పడుతున్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురు... నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో రెవెన్యూ అధికారుల రక్షణ కోసం సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రతి మం డలం నుంచి ముగ్గురు వీఆర్ఏలను అధికారులు ఎంపిక చేశారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు పురుషులు, ఒక మహిళా వీఆర్ఏకు స్థానం కల్పించారు. 19 మండలాల నుంచి సెక్యూరిటీ గార్డులుగా విధుల కోసం 57 మందిని ఎంపిక చేసి వారికి పోలీసుశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. ఇందులో అధికారులను కలిసేందుకు వచ్చే ఫిర్యాదుదారులను చెక్ చేసిన తర్వాతే లోపలికి పంపించడం, వారు వెంట తీసుకువచ్చిన చేతిసంచులు, ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ పనిపై వచ్చారనే విషయాన్ని ఆరా తీయడం, అనుమానస్పదంగా ఉంటే వారిని అడ్డుకోవడం.. తదితర అంశాలపై పోలీసులు వారికి అవగాహన కల్పించారు. డ్రెస్‌కోడ్‌పై గరంగరం! వాస్తవానికి వీఆర్ఏల ప్రధాన విధి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో)కి సహాయకులుగా వ్యవహరించడం. కానీ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉండటంతో దాదాపు అన్ని మండల కార్యాలయాల్లో వీఆర్ఏల సేవలనే వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలోనే విడతలవారీగా ఆయా గ్రామాల వీఆర్ఏలను మండల ఆఫీసుల్లో విధులకు నియోగిస్తున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవదహనం, ఆ తర్వాత కొన్ని మండలాల్లోనూ పెట్రోల్ సీసాలు, భౌతికదాడులకు పాల్పడతామంటూ కొందరు ఫిర్యాదుదారులు హెచ్చరికలకు దిగడంతో నిర్మల్ జిల్లా యంత్రాంగం వీఆర్ఏలను సెక్యూరిటీ గార్డులుగా మార్చేసింది. అయితే విధుల నిర్వహణపై పెద్దగా అసంతృప్తి వ్యక్తం చేయకపోయినా డ్రెస్‌కోడ్‌పై మాత్రం ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉన్నతవిద్య అభ్యసించి వీఆర్ఏలుగా పనిచేస్తున్న తమకు డ్రెస్‌కోడ్‌ను వర్తింపజేయడం అవమానపరచడమేనని మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని, తక్షణమే డ్రెస్ కోడ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఏల సంఘం గౌరవ అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శనివారం భూపరిపాలన శాఖ డైరెక్టర్ రజత్‌కుమార్ సైనీకి వినతిపత్రం అందజేశారు. -
చంద్రయ్య విషాదాంతం
పెద్దఅంబర్‌పేట, శంషాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్ చంద్రయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. ఈ ఘటనలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. నవంబర్ 4న విజయారెడ్డిపై కార్యాలయంలోనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. విజయారెడ్డిని కాపాడబోయిన కారు డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. అయితే, గురునాథం 5న చికిత్స పొందుతూ మృతి చెందగా, హత్యకు కారణమైన కూర సురేశ్ 8న మృతిచెందాడు. ఇక చంద్రయ్య డీఆర్డీఎల్లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ సోమవారం ప్రాణాలొదిలాడు. మృతులందరికీ చిన్నపిల్లలే.. ఈ ఘటనలో మృతిచెందిన నలుగురికీ చిన్న పిల్లలే ఉన్నారు. విజయారెడ్డికి ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. నిందితుడు సురేశ్‌కు కూతురు, కుమారుడు, డ్రైవర్ గురునాథంకు ఏడాదిన్నర వయసు కుమారుడు, అటెండర్ చంద్రయ్యకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. రాళ్లగూడలో అంత్యక్రియలు చంద్రయ్య అంత్యక్రియలు సోమవారం శంషాబాద్ పట్టణంలోని రాళ్లగూడలో జరిగాయి. శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన చంద్రయ్య జిల్లాల విభజన సమయంలో అబ్దుల్లాపూర్‌మెట్ కార్యాలయంలో అటెండర్‌గా నియమితులయ్యా రు. ఆయన తన భార్య పద్మమ్మ, పిల్లలు అభినవ్, కీర్తనలతో కలసి ఉంటున్నారు. ఘటన జరిగాక ప్రభుత్వం వైద్యం చేయించినా ఇంతవరకు ఆర్థిక సాయం చేయలేదని కుటుంబ సభ్యులన్నారు. ట్రెసా చేయూత సాక్షి, హైదరాబాద్: చంద్రయ్య కుటుంబానికి తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) బాసటగా నిలిచింది. అత్యవసర ఖర్చులకుగాను చంద్రయ్య కుటుంబ సభ్యులకు ట్రెసా సంఘం నాయకులు రూ. లక్ష అందజేశారు. డ్యూటీకి వెళ్లిన రోజు నుంచి మళ్లీ ఇప్పుడే.. డ్యూటీకి వెళ్లిన రోజు మా నాన్నను చూశాం.. ఆ తర్వాత మేము ఆస్పత్రికి కూడా వెళ్లలేదు. ఈ రోజు చనిపోయాడని చెప్పారు. మా నాన్న బతికుండగా చూసి చనిపోయిన తర్వాత మళ్లీ ఈరోజే చూడాల్సి వచ్చింది. మా నాన్ననే ఇంటికి ఆధారం.. మేము ఇప్పుడు పదో తరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నాం. మమ్మల్ని ఎవరు చదివిస్తారు.. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చంద్రయ్య కుమారుడు అభినవ్, కుమార్తె కీర్తన -
విజయారెడ్డి కేసు: అటెండర్ మృతి
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన విజయారెడ్డి హత్య కేసులో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో గాయపడిన అటెంబర్ చంద్రయ్య సోమవారం కన్నుమూశారు. నవంబర్ 4న విజయారెడ్డికి అంటుకున్న మంటలను ఆర్పేస్తూ... చంద్రయ్య తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. చంద్రయ్య నెలరోజులుగా..డీఆర్డీఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. చంద్రయ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నరవుతున్నారు. సరైన వైద్యం అందించకే చంద్రయ్య చనిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. చనిపోయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారని.. కనీస సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారని ఆగ్రహిస్తున్నారు. చంద్రయ్య కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విజయారెడ్డిపై సురేష్ పెట్రోల్ పోసి నిప్పంటిచగా ఆమె ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. ఎమ్మార్వోను కాపాడేందుకు ప్రయత్నించిన ఆమె కారు డ్రైవర్ గురునాథానికి మంటలంటుకోవడంతో మరుసటిరోజే మృతి చెందాడు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నిందితుడు సురేష్ డిఆర్డిఓలో చికిత్స పొందుతూ నవంబర్ 7న మరణించాడు. ఈ ఘటనలో మొత్తంగా నలుగురు మరణించారు. చికిత్స పొందుతూ ఏఎస్ఐ నర్సింహులు మృతి.. బాలాపూర్: ఆత్మహత్యాయత్నం చేసిన ఏఎస్ఐ నర్సింహులు ఆసుపత్రిలో సోమవారం మృతి చెందాడు. కొన్నిరోజుల క్రితం బాలాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట పెట్రోలు పోసి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన నర్సింహులు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఇవాళ ఉదయం మరణించాడు. కాగా ఆయన మృతికి సీఐ సైదులు వేధింపులే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో చర్యలు చేపట్టిన పోలీసు కమిషనర్ సీఐపై బదిలీ వేటు వేశారు. చదవండి.. తహశీల్దార్ సజీవదహనం: డాడీ.. మమ్మీకి ఏమైంది? దారుణం: మహిళా తహశీల్దార్ సజీవదహనం -
207 మంది అవినీతిపరుల్లో 50 మంది వాళ్లే..!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసుతో రెవెన్యూ యంత్రాంగంపై అందరి దృష్టి పడింది. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని కోల్పోతానేమోనన్న భయంతోనే విజయారెడ్డిని హత్యచేసినట్టు సురేశ్ మరణ వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా పనులు చేయకుండా రెవెన్యూ అధికారులు నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. (చదవండి : అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం) లంచం లేనిదే రెవెన్యూశాఖలో ఫైలు కదలదన్న తీరుగా పరిస్థితులు దాపురించాయని వాపోతున్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం.. ఏసీబీ దాడుల్లో పట్టుబడిన అవినీతి అధికారుల పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. గత రెండేళ్లలో 207 ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కితే వారిలో 50 మంది రెవెన్యూ ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఇక ఎవరికీ దొరకని అవినీతి అధికారులు నేటికీ దొరలుగానే చలామణి అవుతున్నారు..! (చదవండి : విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్ మృతి) అవినీతి రెవెన్యూ అధికారుల్లో కొందరు.. రూ.4 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల తహసీల్దార్ లావణ్య , వీఆర్వో అనంతయ్య రూ. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడ్చల్ జిల్లా బాచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసీల్దార్ రవిరాజా కుమార్‌రావు,వీఆర్ఏ రామకృష్ణ రూ. లక్షా 4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ జిల్లా మద్దివంచ వీఆర్వో సీరం శివరావు రూ.లక్షా 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా కొత్తకోట ఆర్దీఓ చంద్రా రెడ్డి, తహసీల్దార్ మల్లికార్జునరావు రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన మంచిర్యాల ఆర్డీవో గూడెం మనోహర్‌రావు రూ.42 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన యాదాద్రి జిల్లా సుద్దాల వీఆర్వో శ్రీనివాస్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన నిజామాబాద్ ఆర్మూర్ ఆర్దీఓ శ్రీనివాస్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల సర్వేయర్ రాజు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన పంచాయతిజిల్లా సర్వేయర్ రవి కుమార్ అవినీతి అధికారుల చిట్టా కోసం క్లిక్ చేయడం : -
కేసీఆర్ మాటలే విజయారెడ్డి హత్యకు దారి తీశాయి
సాక్షి, హయత్‌నగర్: అధికారులపై ప్రజలు రెచ్చిపోయే విధంగా సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలే విజయారెడ్డి హత్యకు దారితీశాయని, రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, లేదంటే విజయారెడ్డి వంటి ఘటనలు పెరిగిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్‌నేత వి. హనుమంతరావు అన్నారు. విజయారెడ్డి హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలామంది రైతులు ఏళ్ల తరబడి పట్టాదారు పాస్బుక్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రెవెన్యూ చట్టాల్లో చాలా లొసుగులు ఉన్నాయని విమర్శించారు. వాటిని ఆసరాగా చేసుకుని అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని, మార్పులు రాకుంటే ఇలాంటి హత్యలు పెరుగుతాయని తెలిపారు. మ్యుటేషన్ పేరుతో రెవెన్యూ సిబ్బంది రైతులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటక తరహాలో భూములను కొన్న మరునాడే రెవెన్యూ రికార్డులు మారేవిధంగా వ్యవస్థ ఉండాలని, రెవెన్యూ చట్టాల్లో మార్పుల కోసం కర్ణాటకలోని విధానాలపై అధ్యయనం చేయాలని ఆయన సూచించారు. పటేల్, పట్వారీల కాలంలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండేదని, వీఆర్ఓల వ్యవస్థ కారణంగా వారికి అవగాహన లేక సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో లోపాల కారణంగా డబుల్, త్రిబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని ఆరోపించారు. సీబీసీఐడీ విచారణపై తనకు నమ్మకం లేదని, గతంలో వారు విచారణ జరిపిన నయీం హత్య కేసు ఎంతవరకు వచ్చిందని, అతడి డబ్బులు ఏమయ్యాని ఆయన ప్రశ్నించారు. తహసీల్దార్ విజయారెడ్డి భర్త కోరిన విధంగా సీబీఐ విచారణ చేట్టాలని, హంతకుడి వెనుక ఉన్న వారిని బయటకు తీసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బందితో మాట్లాడి ఘటనపై వివరాలు సేకరించారు. పీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం రెవెన్యూ సిబ్బందికి భరోసా కల్పించి తహసీల్దార్ కార్యాలయాల్లో భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్రరేఖ మహేందర్‌గౌడ్, నాయకులు గుండ్ల వెంకట్‌రెడ్డి, యాదగిరిచారి తదితరులు ఉన్నారు. -
అదే అతడికి అవకాశం.. ఆమెకు శాపం
పెద్దఅంబర్‌పేట: ఓ రైతు చేతిలో అత్యంత పాశవికంగా హత్యకు గురైన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అప్రమత్తంగా ఉంటే కనీసం ప్రాణాలైనా దక్కేవి. కార్యాలయానికి వచ్చే ప్రతిఒక్కరితో ఆమె అర నిమిషం లేదా నిమిషం పాటు మాట్లాడిన అనంతరం తలదించుకొని తనపని తాను చేసుకుంటూ ఉండేది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. తన చాంబర్ లోపలికి వచ్చే వ్యక్తులను పూర్తిగా గమనించకుండా తన విధుల్లో మునిగిపోయే మనస్తత్వమే ఆమె ప్రాణాలను బలిగొంది. ఆఫీసులోకి వచ్చే వ్యక్తులతో మాట్లాడి వారు వెళ్లిన తర్వాతే వేరే పనులు చేసుకునే అలవాటు ఉంటే సురేష్ పెట్రోల్‌తో దాడియత్నాన్ని కొంతమేర అయినా అడ్డుకునే అవకాశం ఉండేది. తహసీల్దార్ విజయారెడ్డి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే పక్కా ప్రణాళికతోనే ఆమెను అంతమొందించడానికి సురేష్ పూనుకున్నట్లు జరిగిన సంఘటన ఆధారంగా తెలుస్తోంది. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కార్యాలయం వద్ద తహసీల్దార్ కారు ఆఫీసు ఎదుటే తహసీల్దార్ కారు... నిత్యం కార్యాలయానికి కారులో వచ్చి వెళ్లే తహసీల్దార్ విజయారెడ్డి సోమవారం కూడా అదే కారులో వచ్చారు. అయితే, అనూహ్యంగా సురేష్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో లిప్తపాటుకాలంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమెను రక్షించే క్రమంలో కారు డ్రైవర్ గురునాథం కూడా తీవ్రంగా గాయపడి మంగళవారం కన్నుమూసిన విషయం విధితమే. కారు డ్రైవర్ గురునాథం...అందులో రోజూ ప్రయాణించే తహసీల్దార్ విజయారెడ్డి ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం ఆ కారు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెట్టు కిందనే ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారందరూ తహసీల్దార్ కారును చూస్తూ ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా పోలీసుల పహారాలో ఉంది. -
సురేష్ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్ : సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్‌మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడయిన సురేష్ ప్రాణాలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేమని డాక్టర్లు తేల్చి చెప్పారు. ఎమ్మార్వోపై దాడి ఘటనలో సురేష్‌కు కూడా మంటలు అంటుకున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పిరిస్థితి గురించి బుధవారం ఉస్మానియా ఆసుపత్రి ఆర్ఎమ్ఓ డాక్టర్ రఫీ మాట్లాడుతూ.. యాభై శాతం కంటే తక్కువ గాయాలయిన కేసులలో మాత్రమే గ్యారంటీ ఇస్తామని, సురేష్‌కు 65 శాతం గాయాలయ్యాయని తెలిపారు. ఛాతీ, తల భాగాల్లో మంటలంటుకుపోవడంతో మెదడు, గుండె కూడా కాలిపోయాయని వెల్లడించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ప్రాణాలతో ఉన్నాడు కానీ, పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు వివరించారు. -
వెలిదండకు చేరిన గురునాథం మృతదేహం
సాక్షి, గరిడేపల్లి (హుజూర్నగర్): అబ్దుల్లాపూర్‌మెట్‌లో తహసీల్దార్ సజీవ దహనం విషయంలో మృతి చెందిన కామళ్ల గురునాథం మృతదేహం మంగళవారం రాత్రి 7గంటలకు స్వగ్రామమైన వెలిదండకు చేరింది. గ్రామానికి మృతదేహం చేరగానే పెద్ద ఎత్తున గ్రామస్తులు తరలివచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. భార్య సౌందర్య, తల్లి రమణమ్మ, తండ్రి బ్రహ్మయ్య కన్నీరు మున్నీరుగా విలపించారు. కోదాడ రూరల్ ఎస్ఐ సైదులు, గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న, ఏఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. గురునాథంకు బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ వద్ద తహసీల్దార్ విజయారెడ్డిపై సురేష్ అనే వ్యక్తి పెట్రోలు పోసి నిప్పు అంటించిన ఘటనలో ఆమెను కాపాడబోయి మంటల్లో కాలి గాయాలైన కారు డ్రైవర్ కామళ్ల గురునాథం అలియాస్ గురుపాదం (29) చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందాడు. మండలంలోని వెలిదండ గ్రామానికి చెందిన కామళ్ల బ్రహ్మయ్య, రమణమ్మ పెద్ద కుమారుడు గురునాథం బతుకు దెరువు కోసం ఏడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. సుతారి పనిచేస్తూ డ్రైవింగ్ నేర్చుకుని విజయారెడ్డి వద్ద ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాడు. విజయారెడ్డి కుటుంబానికి నమ్మకస్తుడిగా ఉంటూ అక్కా అని విజయారెడ్డిని పిలిచేవాడు. ఆమెతో చాలా ఆప్యాయంగా ఉండేవాడు. మంటల్లో ఆమె చిక్కుకున్న సమయంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రక్షించే ప్రయత్నం చేశాడు. దాంతో ఆయన కూడా 75 శాతం కాలిపోయాడు. గాయపడిన గురునాథాన్ని చికిత్స కోసం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురునాథం మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా గురునాథంకు భార్య సౌందర్యతో పాటు ఏడాదిన్నర పాప ఉంది. భార్య ప్రస్తుతం గర్భవతి. గ్రామంలో మిన్నంటిన రోదనలు గురునాథం మరణవార్త విని గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గురువారం ఇంటి వద్ద తల్లి రమణ రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. గురునాథం ఇంటి వద్దకు బంధువులు, స్నేహితులు, ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన ఎంతో నమ్మకస్తుడని కొనియాడారు. మండల ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీటీసీ పోరెడ్డి శైలజరవీందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, సర్పంచ్ ఆదూరి పద్మ, ఎంపీటీసీ ములకలపల్లి విజయతో పాటు పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గురునాథం ఇంటి వద్ద గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పరామర్శించిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి... గురునాథం మృతదేహాన్ని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించి మాట్లాడారు. సోమవారం జరిగిన ఘటనలో తహసీల్దార్ విజయారెడ్డి, గురునాథం మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. బాధితుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతికి సంతాపం... గ్రామానికి చెందిన యువకులు పాఠశాలకు చేరుకుని గురునాతం మృతికి సంతాపంగా నల్లబ్యాడ్జీలు ధరించి, మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సీవీ రాము, బాలస్వామి, ఉపాధ్యాయులు బుచ్చారావు, కేవీ సత్యనారాయణ, కళావతి, ప్రశాంతి, సువర్ణ, రంగయ్య, లక్ష్మయ్య, రవీందర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రకళ, నవ్య, గ్రామ యువకులు నాగరాజు, గోపి, శేఖర్ పాల్గొన్నారు. -
బెదిరించాలనా? చంపాలనా..?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యోదంతం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. కేవలం తమ భూ వివాదం నేపథ్యంలోనే నిందితుడు కూర సురేష్ తహసీల్దార్‌ను సజీవదహనంచేశాడా? లేక ఇతరులు ఎవరైనా ఉసిగొల్పారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయారెడ్డిపై దాడి ఘటనకు ముందు నిందితుడు సురేష్ తన పెద్దనాన్న దుర్గయ్యతో పలుమార్లు సెల్ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను విశ్లేషించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దుర్గయ్య, అతని కుమారుడు ఆనంద్, నిందితుని తండ్రి కృష్ణ, మరొకరు భిక్షమయ్య.. ఈ నలుగురు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వీరి అన్ని నుంచి అన్ని వివరాలు రాబడుతున్నారు. వీరి ఫోన్లతో పాటు సురేష్ సెల్‌ఫోన్ కాల్‌డేటా విశ్లేషిస్తున్నారు. అంతేకాకుండా ఘటనకు ముందు సురేష్ ఎక్కడెక్కడ తిరిగాడ సెల్‌ఫోన్ సిగ్నల్ లొకేషన్ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు. భూ విషయంలో న్యాయం చేయకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని తహసీల్దార్‌ను బెదిరించాడా? లేక ఆమెను హత్య చేయడానికే పథకం వేశాడా? లేదంటే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి క్షణికావేశంలో నిప్పంటించాడా? అనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇదికాక ముందస్తు ప్రకారమే హత్య అయితే.. ఈ విషయాన్ని సురేష్ తన పెద్దనాన్న దుర్గయ్యకు చెప్పాడా? అనే కోణంలోనూ విచారిస్తున్నారు. నిందితుడు తీవ్ర కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకుంటేనే మరిన్ని వివరాలు తెలిసే వీలుంది. ఇదీ నేపథ్యం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాచారం గ్రామంలోని 92 నుంచి 101 సర్వే నంబర్ల పరిధిలో దాదాపు 70 ఎకరాల్లో భూమి వివాదాస్పదంగా మారింది. ఈ పట్టా భూమిపై 15 మంది చొప్పున కౌలుదారులు, భూ యజమానులకు మధ్య వివాదం ఉన్నట్లు రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. ఇందులో సురేష్ నాన్నతోడ పుట్టిన వారికి, ఇతర రక్త సంబంధీకులకు ఏడెకరాల వాటా ఉందని సమాచారం. 2010 నుంచి ఈ భూమిపై వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, భూ యజమానుల నుంచి సాదాబైనామాలతో ఏళ్ల కిందటే తాము కొనుగోలు చేశామని, ఆ భూమి తమకే చెందుతుందని సురేష్ కుటుంబ సభ్యులు అంటున్నారు. భూ యజమానులు, కౌలుదారులకు అనుకూలంగా ఆర్డీఓ ఉత్తర్వులు ఇచ్చినా, జాయింట్ కలెక్టర్ తీర్పు వెలువరించినా ఆ భూమి తమదేనన్నది నిందితుని వాదన. జేసీ తీర్పును సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ జరిపి వివాదాన్ని పరిష్కరించాలని జేసీకి కోర్టు సూచించింది. ఈ క్రమంలో పట్టాదారులకు గతంలో మాదిరిగానే అనుకూలంగా ఇటీవల జేసీ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కేసులో తహసీల్దార్ విజయారెడ్డి తమకు వ్యతిరేకంగా వ్యవహరించారని సురేష్ ఆమెపై కక్ష పెంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతోనే ఆమెకు నిప్పంటించినట్లు ప్రచారం జరుగుతోంది. డ్రైవర్ మృతి పట్ల దిగ్భ్రాంతి తహసీల్దార్ విజయారెడ్డిని కాపాడబోయి తీవ్రంగా గాయపడిన డ్రైవర్ గురునాథం నగరంలోని డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని అతని స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం వెల్దండకు తరలించారు. గురునాథం మృతిపట్ల జిల్లా ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. ఉద్యోగ సంఘాల నాయకులు అతని మృతికి సంతాపం తెలిపారు. వారికి భూమే లేదు.. ఇదిలా ఉండగా.. సురేష్, ఆయన కుటుంబ సభ్యులపై సదరు సర్వేనంబర్లలో భూమే లేదని, అయినా తహసీల్దార్‌పై దాడి ఎందుకు చేశాడోనని రెవెన్యూ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరి ప్రోద్బలంతోనైనా అమానుషానికి ఒడిగట్టి ఉంటాడేమోనని సందేహాలు వెలిబుచ్చుతున్నారు. రికార్డుల పరంగా ఆయనకు భూమి ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలూ లేకపోవడంతో హత్యకు కారణాలు ఏమిటనేది పోలీసుల విచారణలో తేలనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
ఇదో రకం...‘భూకంపం’
సాక్షి, హైదరాబాద్: స్వాదీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరుంటేనే భూ హక్కుకి భద్రత. రాష్ట్రంలో అలా ఉన్న భూ యజమానులు పది శాతంలోపే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అదే భూ రికార్డుల ప్రక్షాళన. సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆచరణలో హడావుడి ప్రదర్శించింది. అయితే రెండేళ్లయినా.. భూ రికార్డుల నవీకరణ కొలిక్కిరాలేదు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోగా.. అపరిష్కృత సమస్యలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతిమంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షిత కౌలుదారు, ఇనాం, సీలింగ్ చట్టాలపై స్పష్టత లేకపోవడంతో రైతులను తహసీల్దార్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది. సాంకేతిక సమస్యలు సరేసరి. ఇటు రైతులు.. అటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వ్యవహారం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. చిక్కుముడిగా ‘పార్ట్–బీ’ వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం వాటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. ఈ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు కూడా నిలిపేసింది. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,43,983 ఖాతాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల మేర భూములను పరిగణనలోకి తీసుకోలేదు. పార్ట్–బీ కేటగిరీలో కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు–పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవి ఇందులో నమోదు చేసింది. భూ రికార్డుల నవీకరణకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఒత్తిడి మూలంగా క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించలేదు సరికదా ఎవరైనా అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ ఇస్తే చాలు పార్ట్–బీలో చేర్చింది. ఇదే ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడిట్‌కు అనుమతి ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ప్రతి చిన్నదానికి జేసీకి అప్పీల్‌కు చేసుకోవాల్సిరావడంతో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. రెండేళ్ల తర్వాత మేలుకున్న ప్రభుత్వం ఇటీవలనే ఆర్డీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇచి్చంది. పారాచూట్‌లా.. వాలారు! భూ రికార్డుల గందరగోళంలో ప్రధాన పాత్ర వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డు, అటవీ శాఖలదే. ఇన్నాళ్లు కనీసం గ్రామ, మండలం, జిల్లా స్థాయిల్లో రికార్డులను అప్డేట్ చేయని ఈ విభాగాలు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుకాగానే.. బూజుపట్టిన గెజిట్ నోటిఫికేషన్లతో వాలాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగాన్ని కాదని.. ఈ భూమి తమదేనని పేచీ పెట్టాయి. చట్ట ప్రకారం ఈ భూమి ఆయా విభాగాలకే చెందుతుందని 22 (ఏ) కేటగిరీలో (ప్రభుత్వ భూములుగా) నమోదు చేసింది. ఇన్నాళ్లు తమ అ«దీనంలో ఉన్న భూమిని తన్నుకుపోవడంతో దిక్కుతోచని రైతాంగం తహశీల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక సాంకేతిక లోపాలు కూడా రికార్డుల ప్రక్షాళనకు చెడ్డపేరు తెచి్చపెట్టాయి. తప్పుల తడకగా నమోదు చేసిన పేర్లను సవరించే వెసులుబాటు లేకపోవడం.. మ్యుటేషన్ జరిగినా... మూడు నెలల వరకు పాస్‌బుక్ చేతికి రాకపోవడం కూడా చికాకు కలిగించింది. నాలుగేళ్లుగా పహణీలోకి ఎక్కించడం లేదు.. ‘1981లో శివలింగం రామయ్య వద్ద నుంచి సర్వే నం.689, 690/2లలో 2.19 ఎకరాలను కొన్నాం. అప్పటినుంచి సాగు చేస్తున్నాం. 2009లో నాన్న చౌకి బాలయ్య నుంచి నా పేరిట మారి్పడి చేసుకున్నాను. పాస్ పుస్తకం వచి్చంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి వస్తున్నాను. భూమి ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో భూమి వద్దకు వెళ్లి చూడలేదు. 2010లో 689 సర్వేనంబర్‌లో 1.04 ఎకరాల భూమిని సదాశివనగర్‌కు చెందిన సుతారి రాజమణి పేరు మీద సాదాబైనామా చేసినట్లు ఉంది. అదే 690/2 సర్వే నంబర్లో 1.15 ఎకరాలను సుతారి సుధాకర్ పేరు మీద పట్టా చేశారు. ఈ భూమిని నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్నాను. పాస్ పుస్తకమున్న పహణీలోకి ఎక్కించడం లేదు. సమస్యను జేసీకి వివరించినా రికార్డుల్లో సరిచేయడం లేదు.’ – చౌకి భాస్కర్, సదాశివనగర్, కామారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన కనువిప్పు కావాలి సమస్యలకు పరిష్కారం.. చంపడమో, చావడమో కాకూడదు. భూ సమస్యల పరిష్కారానికి, మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఇక్కట్లు తొలగవు. ఏ భూరికార్డు భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. భూ సమస్యలపై ఎవరిని కలవాలి.. ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అపరిష్కృత భూ సమస్యలకు ఎన్నో కారణాలు.. అన్ని కోణాలు చూడాలి.. సమస్యకు సమగ్ర పరిష్కారం వెతకాలి. భూమి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద ఘటనలు, హత్యలకు కూడా దారితీస్తున్న దుర్ఘటనలు.. మరోపక్క తీవ్ర ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం. ఇకనైనా పరిష్కారాలపై చర్చ జరగాలి. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఒక కనువిప్పు కావాలి. – ఎం.సునీల్ కుమార్, భూచట్టాల నిపుణుడు, న్యాయవాది క్రమబద్ధీకరణతో వివాదాలకు ఫుల్స్టాప్ భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించింది. రికార్డుల నవీకరణ కంటే ముందు సమగ్ర భూసర్వే చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, భూదాన్ బోర్డులు ఇన్నాళ్లు తమ భూములెక్కడ ఉన్నాయో పట్టించుకోకుండా.. ఒకేసారి ఈ భూములన్నీ మావేనని వాదించడం అత్యధిక వివాదాలకు కారణం. దశాబ్దాలుగా ఆ భూమిని అనుభవిస్తూ... పాస్బుక్కు కలిగి ఉన్నవారిని కాదని.. 22(ఏ)లో ఆ భూమిని చేర్చడం ఎంతవరకు న్యాయం. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారి పేరిట క్రమబద్ధీకరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. రైతాంగానికి లాభం కలుగుతుంది. – సురేశ్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) రికార్డుల ప్రక్షాళనలో ఒత్తిడి ఎక్కువైంది.. రికార్డుల ప్రక్షాళన మొదలైన నుంచి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రక్షాళనకు డెడ్లైన్లు విధించడంతో సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి సరిపడా సమయం దొరకలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వినాల్సి వచి్చంది. రికార్డులో సాదాబైనామాలకు సంబంధించి తప్పుడు కాగితాలతో చాలా మంది భూములను తమపేరిట నమోదు చేయించుకునే ప్రయత్నాలు చేశారు. దానికి తోడు రాజకీయ జోక్యం కూడా ఉండటం ఒత్తిడిని పెంచింది. – సత్తయ్య, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) సమస్యకు పరిష్కారాలు.. సమగ్ర భూ సర్వే జరగాలి. భూచట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి. భూ సమస్యలున్న పేదవారికి సహాయం చేసే పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను కొనసాగించాలి. -
విజయారెడ్డి హత్యకు నిరసనగా విధుల బహిష్కరణ
సాక్షి, విజయవాడ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా విజయవాడ గొల్లపూడిలో రెవెన్యూ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. మహిళా తహశీల్దార్ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సభ్యులు.. గొల్లపూడి సెంటర్ నుంచి వై జంక్షన్ వరుకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసేవ చేసే ఉద్యోగులపై పాశవిక దాడి అత్యంత దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు.. ప్రజలకు రక్షణ కల్పించే ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
రెవెన్యూ ఉద్యోగుల విధుల బహిష్కరణ
సాక్షి, ఖమ్మం టౌన్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా ఖమ్మం కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తహశీల్దార్ హత్యను గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ సేవకులు తీవ్రంగా ఖండించారు. నిరసనగా నగరంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ వద్ద మానవహారం చేశారు. నిందితుడు సురేష్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. -
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
-
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. (చదవండి : పెట్రోల్ పోసి.. నిప్పంటించి..) నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. (చదవండి : మూడు రోజులు విధుల బహిష్కరణ ) -
‘అధికారులకు అలా జరగాల్సిందే..’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్‌పూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని సురేశ్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం.. గౌరెల్లి గ్రామంలోని 412 ఎకరాల భూ వివాదం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం సంచలనం రేపుతున్న ఈ హత్య గురించి ఓ రాజకీయ నేత గౌరెల్లి గ్రామానికి చెందిన రైతుతో మాట్లాడారు. వారిద్దరి సంభాషణకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ భూములు తాతల కాలం నాటివని.. అందులో 7 ఎకరాలు విజయారెడ్డిపై దాడికి పాల్పడ్డ సురేశ్ కుటుంబానికి చెందినవని గౌరెల్లి రైతు సదరు రాజకీయ నేతతో అన్నారు. ఇది రజకార్లు ఉన్నప్పుడు కొన్న భూమి అని.. దీని కోసం దాదాపు 1950 నుంచి కొట్లాడుతున్నామని తెలిపారు. ఎన్నో ఎళ్లుగా వాటిని కాజేయాలని చాలా మంది యత్నించారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారిన సమస్య మాత్రం తీరలేదన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్లు నకిలీ పత్రాలు సృష్టించి భూములు కాజేసేందుకు యత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ భూముల కోసం రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. ఈ భూములు రైతులకు ఇప్పిస్తానని చెప్పి.. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వారి వద్ద నుంచి రూ. 30 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. అందులో సురేశ్ కుటుంబానివి కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు ఉంటాయని చెప్పారు. రాజకీయ నేతతో రైతు జరిపిన సంభాషణ.. అలాగే పై అధికారులకు కూడా అలా జరగాల్సిందేనని సదరు రైతు అన్నారు. అయితే గౌరెల్లికి చెందిన రైతుతో మాట్లాడుతున్న సమయంలో సదరు రాజకీయ నేత కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెద్ద అంబర్‌పేటలో కూడా ఇలాగే 402 ఎకరాల భూమి ఉందని అన్నారు. 1955లో అక్కడి రైతులు ఈ భూములను కొనుగోలు చేశారని.. 1976 వరకు వారి పేర్లపైనే పట్టాలు ఉన్నాయని.. ఆ తర్వాత పేరు మార్చారని.. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉందని తెలిపారు. ఈ వివాదాన్న వెనకనుంచి ఓ ప్రముఖ నాయకుడి కుమారుడి నడిపిస్తున్నాడని ఆరోపించారు. అయితే చివర్లో ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించేలా పోరాటం రెండు గ్రామాల రైతులు చేసేలా చూడాలని వారి ఇరువురు అనుకున్నారు. -
ఆ కెమెరాలు పనిచేస్తున్నాయా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: తహసీల్దార్ విజయారెడ్డి చాంబర్లో సీసీ కెమెరా ఉన్నప్పటికీ అది పనిచేస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తేగాని ఘటన తీరు స్పష్టంగా తెలియదు. జెడ్పీ రోడ్డుకు ఆనుకుని ఉన్న తహసీల్దార్ కార్యాలయంలోకి ప్రవేశించే చోట, ఆమె చాంబర్లోకి వెళ్లే వద్ద కూడా ఒకటి చొప్పున సీసీ కెమెరాలు బిగించారు. తహసీల్దార్ చాంబర్లోకి వెళ్లడం.. తిరిగి బయటికి రావడానికి ఒకే ద్వారం ఉంది. నిందితుడు సురేష్ లోపలికి వెళ్లడం కచ్చితంగా ఈ కెమెరాలకు చిక్కే ఉంటుంది. చాంబర్లో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందా? ఎంతసేపు చాంబర్లో ఉన్నాడు? తదితర వివరాలను ఫుటేజీ పరిశీలన ద్వారా తెలిసే వీలుంది. ఒకవేళ కెమెరాలు పనిచేసి ఉంటే.. నిందితుడు కార్యాలయంలోకి ప్రవేశించడం మొదలు.. ఆమె చనిపోయే వరకు ప్రతిక్షణం రికార్డు అయి ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట గుమిగూడిన ప్రజలు ఒక ఘటన..నాలుగు కుటుంబాల్లో విషాదం.. అబ్దుల్లాపూర్ మెట్లో తహసీల్దార్‌ను పట్టపగటు పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేయడం నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. తహసీల్దార్ విజయారెడ్డికి ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. వీరు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమెను కాపాడేందుకు యత్నించిన డ్రైవర్ గురునాథం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అక్కడే ఉన్న అటెండర్ చంద్రయ్యకు కూడా గాయాలయ్యాయి. వీరిద్దరి కుటుంబం కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉంది. ఇక హత్యకు పాల్పడ్డ నిందితుడు కూర సురేశ్‌కు కూడా గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగానే ఉంది. సురేశ్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మొత్తానికి ఒక వ్యక్తి పెంచుకున్న కక్ష.. నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది. విజయారెడ్డి పిల్లలు తల్లిలేని వారయ్యారు. తమ తండ్రి బతుకుతాడో లేదోనన్న బెంగతో సురేష్ పిల్లలు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ప్రస్తుతం ఉస్మానియాలో సురేశ్, డీఆర్డీఎల్ అపొలోలో డ్రైవర్ గురునాథ్, అటెండర్ చంద్రయ్య చికిత్స పొందుతున్నారు. ఇక తహసీల్దార్ విజయారెడ్డి మృతదేహం ఉస్మానియా మార్చురీలో ఉంది. -
పిల్లలు అన్యాయం అయిపోయారు
-
‘నా భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు’
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి తన కార్యాలయంలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆమె భర్త సుభాష్‌రెడ్డి కన్నీరు మున్నీరవుతున్నారు. తన భార్యను అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని ఆయన రోదిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. హత్య చేసిన వాళ్ల వెనకాల భూ కబ్జాదారులు ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వం విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య ఆఫీస్‌లో ఒత్తిడిని ఇంట్లో కనిపించనిచ్చేది కాదని గుర్తుచేసుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ నుంచి బదిలీ కోసం చాలా ప్రయత్నించిందని.. అలా జరిగి ఉంటే ఆమె బతికి ఉండేదని అన్నారు. కాగా, విజయారెడ్డి ఆమె కార్యాలయం లోనే సోమవారం హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్త కాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్ అనే రైతు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. విజయారెడ్డి దంపతులకు కుమార్తె చైత్ర (10), కుమారుడు భువనసాయి (5) ఉన్నారు. విజయరెడ్డి మృతితో రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆందోళనలకు పిలుపునిచ్చారు. విజయారెడ్డి హత్యపై పోలీసులు దార్యప్తు ముమ్మరం చేశారు. నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు తహసీల్దార్ విజయారెడ్డి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె మరణంతో భర్త సుభాష్‌రెడ్డి, అత్త, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లి ఎక్కడ అని అడుగుతున్న చిన్నారులకు.. అర్దరాత్రి దాటిన తరువాత కుటుంబ సభ్యులు విజయారెడ్డి మరణవార్తను చెప్పారు. పిల్లలు ఎక్కడ భయభ్రాంతులకు గురవుతారనో భయంతో.. కుటుంబ సభ్యులు వారిని తల్లి మృతదేహానికి దూరంగా ఉంచారు. ఆర్టీసీ జేఏసీ నివాళి.. విజయారెడ్డి మృతదేహానికి ఆర్టీసీ జేఏసీ నాయకులు నివాళులర్పించారు. అనంతరం అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌గా విజయారెడ్డికి మంచి పేరు ఉందన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇలాంటి దాడులు జరగడం బాధకరమని తెలిపారు. నేడు అంత్యక్రియలు.. ఎమ్మార్వో విజయారెడ్డి అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు నాగోల్ శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నారు. చదవండి : మహిళా తహసీల్దార్ సజీవ దహనం డాడీ.. మమ్మీకి ఏమైంది? -
సీఎం బాధ్యత వహించాలి: కోమటిరెడ్డి
ఇబ్రహీంపట్నం/హయత్‌నగర్/తుక్కుగూడ/పెద్దఅంబర్‌పేట : తహశీల్దార్ హత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రెవెన్యూ ఉద్యోగులతో కలిసి జాతీయ రహదారిపై ఎంపీ బైఠాయించారు. భూప్రక్షాళన పేరుతో గత 60, 70 సంవత్సరాల భూసమస్యలను కొంతమేరకే పరిష్కరించారని, మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీంతో రెవెన్యూ ఉద్యోగులు ఆయా భూసమస్యలను పరిష్కరించలేకపోవడంతో ప్రజలు వీరిపై కక్ష పెంచుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యమే విజయారెడ్డి హత్యకు కారణమని, విజయారెడ్డికి గత ఆరు నెలలుగా వచ్చిన ఫోన్ కాల్స్‌పై విచారణ జరిపితే అసలు దోషులు బయటపడతారని అన్నారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హతురాలి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో తహశీల్దార్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్, వీఆర్ఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, టీఎన్జీఓ జిల్లా నాయకుడు యశ్వంత్, తహశీల్దార్లు సుశీల, శైలజ, సుచరిత, సీహెచ్ సుజాత, ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తహశీల్ధార్ హత్య.. అత్యంత పాశవికం
సాక్షి, అమరావతి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మహిళా తహశీల్ధారుపై ఇటువంటి చర్య అత్యంత దారుణమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఈ ఘటనను దేశ రెవెన్యూ చరిత్రలోనే అత్యంత దుర్మార్గమైనదిగా పేర్కొన్నారు. ప్రభుత్వాలు రెవెన్యూ శాఖకు సంబంధం లేని పనులు అంటగట్టడం వల్ల శాఖా సంబంధమైన పనులు చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. రెవెన్యూ ఉద్యోగులు రాత్రి, పగలు కష్టపడి పనిచేస్తున్నా.. ప్రజల దృష్టిలో మన్ననలు పొందలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరిద్దరు చేసే తప్పులను అందరికి ఆపాదించడం వలన రెవెన్యూ ఉద్యోగులందరూ దోషులుగా నిలబడాల్సి వస్తోందన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కే రక్షణ కరువైతే సాధారణ పౌరుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. విజయారెడ్డి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుతాన్ని వెంకటేశ్వర్లు కోరారు. -
మాటలకందని ఘోరం.. షాక్ తిన్నాను!
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని పట్టపగలే సజీవ దహనం చేసిన ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు స్పందించారు. విజయారెడ్డి దుర్మార్గమైన హత్య.. మాటలకందనిరీతిలో తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కేటీఆర్ ట్వీట్ చేశారు. సమస్య ఏదైనా ఉండొచ్చు కానీ.. ఇలా అమానుషంగా దాడి చేయడం మాత్రం అత్యంత హేయమని, ఇలాంటి ఘటనలకు ప్రజాస్వామ్యంలో తావులేదని ఆయన స్పష్టం చేశారు. తాహశీల్దార్ విజయారెడ్డి కుటుంబసభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయరెడ్డిపై సోమవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తహశీల్దార్ విజయరెడ్డి తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతి చెందారు. ఆమెను కాపాడాటానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తహశీల్దార్ కార్యాలయంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఈ దారుణమైన ఘటన చోటుచేసుకోవడం సంచలనం రేపింది. తహశీల్దార్ విజయారెడ్డిని సజీవ దహనం చేసిన వ్యక్తిని కూర సురేశ్ ముదిరాజ్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు హయత్‌నగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. I am shocked beyond words about the Abdullapurmet MRO Smt. Vijaya’s brutal murder. No matter what the unresolved issue was, this sort of inhuman attack is reprehensible and has no place in a democracy. My heartfelt condolences to the family of Smt. Vijaya Reddy Garu🙏 — KTR (@KTRTRS) November 4, 2019 -
ఫ్లాట్ కొనుగోలుకొచ్చి కడతేర్చాడు
సీతమ్మధార(విశాఖ ఉత్తర): విశాఖ నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డి(54) హత్య కేసులో ఇద్దరు నిందితులను నగర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌చంద్ర లడ్డా వివరాలు వెల్లడించారు. అక్కయ్యపాలెం, ఎస్జీవోఎస్ కాలనీలోని పద్మభారతి అపార్టుమెంట్ ఐదో అంతస్తులోని 502వ నంబర్ ఫ్లాట్‌లో భర్త భోగసముద్రం విష్ణునారాయణరెడ్డితో అతని భార్య, మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి నివాసం ఉంటున్నారు. తమ ఫ్లాట్‌ను రూ.కోటి 35 లక్షలకు విజయారెడ్డి ఫిబ్రవరి 15న అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న మద్దిలపాలెంలోని అలకనంద రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తున్న భీమిలికి చెందిన కోలా వెంకటహేమంత్‌కుమార్, ముడసర్లోవకు చెందిన రాధికలు గత నెల 23న శనివారం విజయారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. రూ.1.35కోట్లకు బేరం కుదుర్చుకుని మరుసటి రోజు ఆదివారం అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు. అయితే అప్పటికే ఆమెను హతమార్చాలని ప్రణాళిక రచించుకున్న హేమంత్ ఆదివారం అయితే విజయారెడ్డి భర్త ఉంటారని... సోమవారం వస్తానని ఫోన్‌చేసి చెప్పారు. చెప్పినట్లుగానే 25న సోమవారం రాధిక కుమారుడు(మైనర్) విజయారెడ్డి ఇంటికి హేమంత్‌ను బైక్‌పై తీసుకొచ్చాడు. అనంతరం ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తర్వాత లిఫ్ట్‌లో ఫ్లాట్‌లోకి చేరుకున్న హేమంత్ ఆస్తికి సంబంధించిన జిరాక్స్ పత్రాలు ఇవ్వాలని విజయారెడ్డిని కోరాడు. ఆమె పత్రాల కోసం బెడ్రూమ్లోకి వెళ్లగా... వెనుక నుంచి ఆమెను అనుసరించిన హేమంత్ లైంగికదాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే తనతో తెచ్చుకున్న కత్తి, సుత్తితో తల, ముఖంతో పాటు చేతులపై విచక్షణారహితంగా నరికి తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడు. ఆనంతరం మృతదేహాన్ని బాత్రూం వరకు ఈడ్చుకెళ్లి వదిలేశాడు. తన దుస్తులపై రక్తపు మరకలు ఉండడంతో వాటిని అక్కడే వదిలేసి, స్నానం చేసి విజయారెడ్డి భర్త విష్ణురెడ్డి దుస్తులు వేసుకుని ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం, ఒక కారు, నగదు పట్టుకొని ఫ్లాట్ తాళం వేసేసి అక్కడి నుంచి హేమంత్ పరారయ్యాడు. అక్కడి నుంచి పారిపోయి ఆరిలోవ సమీప ముడసర్లోవ వద్ద ఉన్న నెల్లి రాధికకు బంగారం ఇచ్చాడు. అక్కడి నుంచి వారిద్దరూ కలిసి కంచరపాలెంలో గల ఆదిలక్ష్మి జ్యూయలర్స్‌లో రూ. 2.95లక్షలకు అమ్మేశారు. మధ్యలో 3 గంటలకు మరలా విజయారెడ్డి ఫ్లాట్‌కు వచ్చి వేరే తాళం వేసి బయటకు వెళ్లిపోయాడు. అనంతరం ఆమె భర్త విష్ణు రెడ్డి ఇంటికి చేరినప్పటికి తాళం వేసి ఉండడం... ఆయన పోలీసులను ఆశ్రయించడంతో వారు బలవంతంగా తలుపు తెరవడంతో హత్యోదంతం వెలుగు చూసింది. కేసు నమోదు చేసి భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు హేమంత్‌కుమార్, రాధిక ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని నిర్ధారించారు. వారు రుషికొండ వైపు మంగళవారం కారులో వస్తుండగా అరెస్ట్ చేశారు. అయితే హేమంత్, రాధిక మధ్య వివాహేతర సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి కారు, రూ.2.75లక్షల నగదు, కత్తి, సుత్తి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో డీసీపీ రవీంద్రబాబు, ఏడీసీపీ సురేష్‌బాబు, ఏసీపీ టేకు మోహన్‌రావు, పూర్ణచంద్రరావు, సీఐలు ఎస్.శంకరావు, ఎం.అవతారం, ఆర్.వి.ఆరకె.చౌదరి, వై.రవితో పాటు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. తప్పించుకునేందుకు మెసేజ్‌లు మాజీ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డిని హేమంత్ పక్కాగా హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్‌తోనే భర్త భోగసముద్రం విష్ణునారాయణరెడ్డికి పలుమార్లు మెసేజ్ చేశాడు. బయటకు వెళ్తున్నామని, వచ్చేస్తామని గంట గంటకు విజయారెడ్డి పెట్టినట్లుగానే మెసేజ్‌లు చేశాడు. ఈ హత్య కోసం రాధిక సాయం తీసుకున్నాడు. సిబ్బందికి రివార్డులు మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్య కేసులో నిందితులను పట్టుకున్న నగర పోలీసులకు సీపీ రివార్డులు అందజేశారు. వారి పనితీరు పట్ల సీపీ హర్షం వ్యక్తం చేశారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌లు, ఏఎస్ఐ, కానిస్టేబుల్‌కు రివార్డులు అందించారు. హేమంత్‌కుమార్‌పై పలు కేసులు కోలా వెంకట హేమంత్‌కుమార్‌పై భీమిలి పోలీస్ స్టేషన్లో 2015లో ఓ కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఒక మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి పుస్తెలతాడు దొంగలించాడని నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ♦ ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో ఓ కేసు నమోదు చేశారు. అనంతరం అదే స్టేషన్లో 2016లో మరో కేసు నమోదు చేశారు. ♦ ఫోర్తుటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హేమంత్‌కుమార్‌పై 2016లో ఓ కేసు నమోదు చేశారు. -
విజయారెడ్డి దారుణ హత్య.. ఆ కిరాతకుడే చంపాడు!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పక్క వ్యూహంతోనే ఆమెను దుండగులు హత్య చేశారని, ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. విజయారెడ్డిని కోలా వెంకట హేమంత్‌కుమార్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చగా.. నిందితుడికి రాధిక అనే మహిళ సహకరించిందని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం అసలు ఏం జరిగిందంటే.. అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌ను రూ. కోటి 50 లక్షలకు విజయారెడ్డి అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న హేమంత్, రాధిక గత శనివారం ఉదయం ఆమె దగ్గరికి వచ్చి.. 3 గంటలపాటు మంతనాలు జరిపారు. రెండోసారి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి గత సోమవారం (ఫిబ్రవరి 25న) హేమంత్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విజయారెడ్డి భర్త విష్ణునారాయణరెడ్డి ఇంట్లో లేకపోవడంతో దుండగుడి వ్యూహం ఫలించింది. దీంతో విజయారెడ్డిపై బలత్కారం చేసిన హేమంత్ అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అదే ఇంట్లో స్నానం చేసి ఆమె భర్త దుస్తులను ధరించి బయటకు వెళ్లిపోయాడు. హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లిన నిందితుడు.. వాటిని జువెల్లరీ షాప్‌లో విక్రయించాడు. విజయారెడ్డి కారును, ఫోన్‌ను కూడా దుండగుడు ఎత్తుకెళ్లాడు. అతను తీసుకెళ్లిన ఫోన్‌నే నిందితుడిని పట్టించిందని, ఈ కేసులో హేమంత్ ఏ-1 నిందితుడు కాగా.. రాధికను ఎ-2గా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. అలకనందా రియల్ ఎస్టేట్ కంపెనీలో నిందితులిద్దరు సహోద్యోగులని, వారి మధ్య అక్రమసంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి.. డబ్బుకోసం వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. చదవండి: కిరాతకులెవరో..? -
మాజీ కౌన్సిలర్ హత్య.. నిందితుడి కోసం గాలింపు
సాక్షి, విశాఖపట్నం : కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యలో ఇద్దరు దుండగుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రక్తపు మడుగులో ఓ బూటు.. మరో చెప్పు ముద్రలున్నట్లు పోలీసులు తెలిపారు. అవి పాత నేరస్థుడు హేమంత్‌కు సంబంధించినవి అయి ఉంటాయన్న అనుమానంతో అతని కోసం గాలింపు చేపట్టారు. నిన్నటి వరకు భీమిలి పరిసరాల్లో ఉన్నట్లు మొబైల్ సిగ్నల్స్ ద్వారా గుర్తించామన్నారు. హత్య విషయాన్ని దృష్టి మరల్చేందుకే ఇంటికి తాళం వేసి కారును తీసుకెళ్లి ఉంటాడని తెలిపారు. హత్యానంతరం నిందితుడు బయటకు వెళ్లి మళ్లీ విజయారెడ్డి ఇంటికి వచ్చినట్టు ఆనవాళ్లను గుర్తించామన్నారు. కేసు దర్యాప్తు కోసం ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు సీపీ లడ్డా పేర్కొన్నారు. -
ఎప్పుడూ వేసిన తాళం కాకుండా వేరే తాళం ఉంది..
సీతమ్మధార (విశాఖ ఉత్తర): బాత్ రూంలో రక్తపు మడుగులో మృతదేహం... చూస్తే ముఖం, తలపై తీవ్ర గాయాలు... ఎవరు చంపారో.. ఎందుకు చంపారో తెలియని వైనం... ఇదీ నగరంలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి హత్యకు గురైన ఫ్లాట్‌లో కనిపించిన భయానక దృశ్యం. హత్యకు గురైన తీరు చూస్తుంటే ఎవరో కిరాతకంగా హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఆమె మెడలోని 20 తులాల బంగారు ఆభరణాలు కనిపించకుండాపోవడం... ఫ్లాట్‌కు తాళాలు వేసి ఉండడం... కొద్దిరోజుల కిందట నుంచి ఫ్లాట్ కొనుగోలు కోసం వస్తున్న వారిపైనా అనుమానాలు వ్యక్తమవుతుండడడంతో నగర పోలీసుల భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... కాంగ్రెస్ నగర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్ భోగసముద్రం విజయారెడ్డి(53) దారుణ హత్యకు గురయ్యారు. చేతులు వెనక్కు కట్టేసి తలపై సగభాగం కత్తితో నరకడం, శరీరమంతా కత్తిపోట్లు ఉండడంతో విచక్షణారహితంగా హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. అక్కయ్యపాలెం ఎన్జీవోఎస్ కాలనీ పద్మాభారతి అపార్టుమెంట్ ఐదో అంతస్తులోని 502వ నంబరు ఫ్లాట్‌లో భర్త విష్ణునారాయణరెడ్డితో కలిసి విజయారెడ్డి నివాసం ఉంటున్నారు. విష్ణు స్టేట్‌బ్యాంకు ప్రాంతీయ కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కుమార్తె సీతకు ఏడాది క్రితం వివాహం కాగా ఆమె హైదరాబాద్‌లో ఉంటుంది. విజయారెడ్డి ఏడాదిన్నర క్రితమే ఫ్లాట్‌ను కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చారు. ప్రసుత్తం వారు ఉంటున్న ఫ్లాట్‌ను రూ.1.35కోట్లకు బేరం పెట్టింది. ఇంతలో ఈ దారుణం జరిగిపోయింది. అంతా మిస్టరీయే తాము ఉంటున్న ఫ్లాట్‌ను విజయారెడ్డి అమ్మకానికి పెట్టడంతో ఈ నెల 23న భీమిలికి చెందిన హేమంత్ అనే వ్యక్తి తన అత్త రాధికను తీసుకుని చూసేందుకు వచ్చాడు. ఫ్లాట్ అంతా చూసుకుని ఆదివారం అడ్వాన్స్ ఇస్తామని, సోమవారం డీడీ రూపంలో నగదు ఇస్తామని విజయారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో బయట నుంచి భర్త విష్ణురెడ్డి ఇంటికి రావడంతో అతనికి హేమంత్‌తోపాటు అతని అత్తను విజయారెడ్డి పరిచయం చేసింది. అనంతరం ఆదివారం రావడం కుదరడం లేదని, సోమవారం వస్తామని ఆమెకి ఫోన్ చేసి హేమంత్ చెప్పాడు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే విష్ణు నారాయణరెడ్డి ఉద్యోగానికి వెళ్లిపోయారు. అనంతరం భార్యకు ఫోన్ చేస్తే తీయలేదు. కుమార్తె సీత ఫోన్ చేసినా తీయలేదని ఆమె తండ్రికి తెలియజేసింది. ఇంతలో విష్ణురెడ్డికి హేమంత్ ఫోన్ చేసి... తాను మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మేడమ్ దగ్గరకు వచ్చానని, ఆమె ఫోన్ పనిచేయకపోవడంతో అక్కయ్యపాలెం వద్ద దింపానని... అక్కడ ఆమె ముగ్గురు వ్యక్తులతో మాట్లాడారని... ఇంతలో తన స్నేహితుడు రావడంతో వెళ్లిపోయానని చెప్పాడు. దీంతో సాయంత్రం అపార్ట్మెంట్ వద్దకు విష్ణురెడ్డి వచ్చి చూడగా సెల్లారులో కారు కనిపించలేదు. ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఎప్పుడూ వేసిన తాళం కాకుండా వేరే తాళం వేసి ఉంది. వెంటనే వాచ్మెన్ దగ్గరకు వెళ్లి మేడం ఎక్కడకు వెళ్లారని వాకబు చేయగా తాను చూడలేందటూ సమాధానం చెప్పాడు. ఇంతలో వేరే పని మీద వెళ్లానని, ఫోన్ పనిచేయడం లేదు... రేపు మధ్యాహ్నం వస్తానని చెప్పి తన ఫోన్‌కు భార్య నుంచి సందేశం రావడంతో విష్ణు అనుమానంతో ఆమె స్నేహితుల ఇళ్లలో వాకబు చేశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో సోమవారం రాత్రి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఉదయం వస్తామని చెప్పడంతో మంగళవారం ఉదయం వరకు సెల్లారులో ఉండి పోలీసులు రాగానే వారి సమక్షంలో తలుపులు పగలగొట్టారు. లోనికి వెళ్లి చూడగా బెడ్రూంలో రక్తపుమరకలు కనిపించాయి. బాత్రూంలో రక్తపు మడుగులో విగతజీవిగా విజయారెడ్డి పడి ఉండడాన్ని గమనించారు. దీంతో ఒక్కసారిగా భర్త, బంధువులు బోరున విలపించారు. అప్పటికే డాగ్ స్క్యాడ్, క్లూస్ టీం సభ్యులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలానికి నగర పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్రలడ్డా చేరుకొని పరిశీలించారు. అక్కడున్న సీసీ కెమెరాలు పరిశీలించారు. హత్యకు సంబంధించి భర్త విష్ణురెడ్డిని సీపీ విచారించారు. హేమంత్ అనే వ్యక్తి తనకి ఫోన్ చేసినట్లు సీపీకి విష్ణు చెప్పారు. అనంతరం సీపీ మీడియాతో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నామని, నిందితులను పట్టుకుంటామని చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. డీసీపీ రవీంద్రబాబు, డీసీపీ సురేష్‌బాబు, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం పోస్టుమర్టం నిర్వహించనున్నారు. బాత్ రూంలో రక్తపుమడుగులో మృతదేహం ,ఎన్జీవోఎస్ కాలనీలో విజయారెడ్డి నివాసం ఉంటున్న అపార్టుమెంట్ పోలీసు బృందాలతో దర్యాప్తు మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్యపై లా అండ్ ఆర్డర్, సీసీఎస్, టాస్క్ఫోర్సు, స్పెషల్‌బ్రాంచ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలిస్తున్నారు. హేమంత్పై దృష్టి పెట్టిన పోలీసులు భీమిలి వెళ్లినట్లు తెలిసింది. అసలు హేమంత్ ఎవరు, ఎక్కడ ఉంటాడనే కోణంలో పరిశీలిస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ భోగసముద్రం విజయారెడ్డి(53) దారుణ హ త్యకు గురయ్యారని తెలుసుకున్నÐ వైఎస్సార్ సీపీ గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, సీనియర్ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ జియ్యాని శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు మంత్రి రాజశేఖర్ పరామర్శించారు. కాల్‌డేటా విశ్లేషణ విజయారెడ్డి, ఆమె భర్త విష్ణునారాయణరెడ్డి వాడుతున్న ఫోన్ల కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. శనివారం నుంచి మంగళవారం వరకు జరిగిన సంభాషణలపై విచారణ వేగవంతం చేశారు. అలాగే హేమంత్ అనే వ్యక్తి ఎవరు అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. అయన ఫోన్ మంగళవారం మధ్యాహ్నం వరకు పనిచేసింది. అనంతరం పనిచేయడం ఆగిపోయింది. అయితే కాల్ డేటా ప్రకారం గీతం కాలేజ్ వరకు హేమంత్ ఫోన్ పనిచేసిందని, తరువాత స్విచ్ ఆఫ్ వస్తోందని పోలీసులు గుర్తించారు. విజయారెడ్డి హత్యతో దిగ్భ్రాంతి గాజువాక: మహిళా కాంగ్రెస్ నగర మాజీ అధ్యక్షురాలు భోగసముద్రం విజయారెడ్డి హత్యకు గురయ్యారన్న వార్తతో గాజువాక ప్రాంతీయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చురుకైన మహిళా నాయకురాలిగా గుర్తింపు పొందిన ఆమె గాజువాక మున్సిపాల్టీకి 1995లో జరిగిన ఎన్నికల్లో 13వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేయలేదు. అప్పుడు కూడా గాజువాక మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో విజయారెడ్డిని ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా నియమించారు. దీంతో ఆమె పదేళ్లపాటు గాజువాక పట్టణ ప్రజలకు సేవలందించారు. ఆ తరువాత ఆమె నివాసాన్ని నగరానికి మార్చుకున్నారు. అయినప్పటికీ గాజువాక మహిళా కార్యకర్తలతో కొన్నాళ్లపాటు సంబంధాలను కొనసాగించారు. సుమారు ఆరేడేళ్ల నుంచి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నగరంలోని అక్కయ్యపాలెంలో తన అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో హత్యకు గురయ్యారన్న విషయం తెలుసుకున్న ఈ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు, ఆమెతోపాటు కౌన్సిలర్లుగా పని చేసిన వారు హుటాహుటిన నగరానికి బయల్దేరి వెళ్లారు. సీసీ కెమెరా ఫుటేజీ కోసం యత్నాలు అపార్టుమెంట్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నప్పటికీ ఫుటేజీ స్టోరేజీ ఉన్న మిషన్ పనిచేయకపోవడం పోలీసుల దర్యాప్తునకు ఇబ్బందికరంగా మారింది. దీంతో టెక్నీషియన్‌ను తీసుకొచ్చినా ఫలితం లేకపోయింది. దీంతో ఫుటే జీ కోసం స్టోరేజ్ ఉన్న మిషన్‌ను పోలీస్ కమిషనరేట్‌కు పంపించారు. హత్య జరిగిన తరువాత నిందితుడు కారు తీసుకుపోయి ఉంటాడని, ఆ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తిమై ఉంటాయని భావిస్తున్నారు. హత్యకు జరిగిన తరువాత ఎవరెవరు కారులో వెళ్లారన్న సమాచారం సేకరించేందుకు యత్నిస్తున్నారు. హత్యకు కారణాలపై పోలీ సులు వాచ్‌మెన్‌ను స్టేషన్‌కు తరలించి విచా రించారు. అక్కడి పనిమనిషి నుంచి కొంత సమాచారం సేకరించారు. -
కాంగ్రెస్ మహిళ నేత దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం : కాంగ్రెస్ మాజీ మహిళ కార్పొరేటర్ విజయారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. రక్తపు మడుగులో బాత్రూంలో శవమై తేలిన ఆమెను అపార్ట్మెంట్ కోనుగోలు చేయడానికి వచ్చినవారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కయపాలెం ఎన్జీఓఎస్ కాలనీలోని పద్మ భాస్కర అపార్ట్మెంట్లోని అయిదో ఫ్లోర్లో ఆమె నివాసం ఉంటున్నారు. విశాఖ నగర మాజీ కార్పోరేటర్ అయిన విజయారెడ్డి హత్యకు గురవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతురాలి భర్త బ్యాంక్ ఉద్యోగి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని, సీసీ టీవీ పుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నాడు శత్రువులు.. నేడు మిత్రులు
బంజారాహిల్స్: రాజకీయాల్లో శాశ్వత మిత్రులు/శత్రువులు ఉండరు. అందుకు ఈ రెండు ఉదంతాలే నిదర్శనం. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాజీ సీబీఐ డైరెక్టర్ విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గంలో బరిలోకి దిగారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఇద్దరూ పార్టీల పరంగా బద్ధ శత్రువులు. మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఇప్పుడు వారిద్దరినీ టీఆర్ఎస్ ఒక్కటి చేసింది. ఇటీవల టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ఖైరతాబాద్ టిక్కెట్ కేటాయించగా టీఆర్ఎస్లోనే ఉన్న విజయరామారావు మద్దతు కావల్సి వచ్చింది. దీంతో నాగేందర్ శనివారం విజయరామారావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. 2009లో ఇద్దరూ పోటీపడ్డ విషయాన్ని సరదాగా గుర్తుచేసుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ అభ్యర్థిగా విజయారెడ్డి పోటీ చేశారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ బరిలో నిలిచారు. ఈ ఇద్దరు హోరాహోరీ తలపడ్డారు. ఈ ఎన్నికల అనంతరం విజయారెడ్డి టీఆర్ఎస్లో చేరి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ కార్పొరేటర్‌గా గెలిచారు. ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన దానం నాగేందర్‌కు ప్రస్తుతం ఖైరతాబాద్ టిక్కెట్ దక్కడంతో.. నాడు పోటీలో నిలిచి ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్న విజయారెడ్డి వద్దకు వెళ్లి ఆమె మద్దతు కోరారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరని ఈ రెండు సంఘటనలు కళ్లకు కట్టాయి. తొలి మహిళా మంత్రి హైదరాబాదీ పరదా ధరించే సంప్రదాయం.. మగవాళ్ల మధ్యలోకి రావద్దంటూ ఆంక్షలు..ఆపై రజాకార్ల ఆగడాలు.. ఇంతటి ఆంక్షల చట్రంలోనూ ఉన్నత చదువులు పూర్తిచేసి, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు మాసుమా బేగం! హైదరాబాదీ అయిన మాసుమా బేగం చిన్నప్పట్నుంచే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. తల్లి ద్వారా సరోజిని నాయుడుతో పరిచయం ఏర్పడింది. 1928లో బొంబాయిలో తొలిసారిగా నిర్వహించిన మహిళా సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్ స్టేట్‌లో 1952లో జరిగిన ఎన్నికల్లో శాలిబండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ సాయుధ పోరాటంలో కీలకంగా వ్యవహరించిన కమ్యూనిస్టు యోధుడు మఖ్దూం మొహియుద్దీన్పై 780 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. మొహియుద్దీన్ పీడీఎఫ్ టికెట్‌పై.. మాసుమా బేగం కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేశారు. హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాసుమా బేగం డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. ఆంధ్ర, హైదరాబాద్ రాష్ట్రాల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో çఫత్తర్‌గట్టి నుంచి శాసనసభ్యురాలిగా విజయం సాధించారు. 1960లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ప్రభుత్వంలోనూ మాసుమా బేగం మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. -
స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొందాం : విజయారెడ్డి
హైదరాబాద్ : హైదరాబాద్‌ను సుందరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ చేపట్టిన 'స్వచ్ఛ హైదరాబాద్' కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఖైరతాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకురాలు పి. విజయారెడ్డి అన్నారు. శుక్రవారం పంజగుట్ట డివిజన్ పరిధిలోని తబేలా బస్తీలో ఆమె స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. తబేలాబస్తీలో ఉన్న మజీద్‌లో ప్రార్థనల అనంతరం పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రమదానం చేసి ఆయా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. మట్టికుప్పలు, చెత్తను పూర్తిగా తొలగించారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మాట్లాడుతూ.. స్వచ్ఛ హైదరాబాద్ ఓ బృహత్తర కార్యక్రమమని, దీన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. మన పరిసరాలు బాగుంటేనే మనం బాగుంటామని, ప్రతి ఒక్కరూ వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. -
రీడింగ్ స్పాట్
ఇంద్రధనుస్సు ఎలా వస్తుంది.. చెట్లు ఎక్కడి నుండి వస్తాయి.. చిన్నారుల ప్రశ్నల పరంపరకు అడ్డుకట్ట వేయలేం. అయితే నేటి బిజీలైఫ్‌లో వీటికి సమాధానం చెప్పేంత టైమ్ తల్లిదండ్రులకు ఉండటం లేదు. అలాగని వాటన్నింటికి స్కూల్స్‌లోనూ పూర్తి సమాచారం దొరకకపోవచ్చు. ఇలాంటప్పుడు చిరు ప్రశ్నలే పేరెంట్స్‌కు పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. దీనికి పరిష్కారం చూపెడుతున్నాయి సిటీలో ఏర్పాటవుతున్న కిడ్స్ లైబ్రరీలు. విజయారెడ్డి చదివితే పోయేదేం లేదు అజ్ఞానం తప్ప అన్నట్టుగా... రీడింగ్‌కు దూరమవుతున్న చిన్నారులకు పుస్తకాలను చేరువ చేసేందుకు ఆధునిక తల్లిదండ్రులు పడుతున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. పిల్లల ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసేందుకు, రీడింగ్ కల్చర్‌ను ఇంప్రూవ్ చేసేందుకు వీరు పడుతున్న ఆరాటం నుంచి పుట్టుకొచ్చినవే ఈ కిడ్స్ లైబ్రరీలు. చదువు... ఆట విడుపు... ఈ లైబ్రరీలు పిల్లలకు అటు రీడింగ్ హాబీని అలవరుస్తూనే ఇటు ఆటవిడుపుగానూ ఉంటున్నాయి. పెద్దవాళ్ల లైబ్రరీ కల్చర్‌కు ఇవి భిన్నంగా ఉంటున్నాయి. లైబ్రరీ అంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా సైన్స్‌కు సంబంధించిన ప్రతి అంశాన్నీ ప్రాక్టికల్‌గా చిన్నారుల ద్వారా చేయించడం వీటిలో కనిపిస్తుంది. ఉదాహరణకు రెయిన్బో ఎలా వస్తుందనే విషయాన్ని తీసుకుంటే వైట్ పేపర్ని తీసుకుని లెన్స్ ఉపయోగించి టార్చ్ లైట్ ఫోకస్‌తో రెయిన్‌బోని చూపిస్తారు. అలాగే విత్తనం ఎలా మొలకెత్తుతుందనే సందేహాన్ని తీర్చేందుకు పెద్ద సైజు డిస్బోజబుల్ వాటర్ గ్లాస్లో సగం వరకు మట్టి నింపి అందులో ఏదైనా ఒక విత్తనం పిల్లల చేత నాటిస్తారు. అది మొలకెత్తేవరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతారు. ఇలా చదువుతో పాటు ప్రాక్టికల్‌గా ఉపకరించే ఎన్నో విషయాలను పిల్లలకు నేర్పించడం సిటీలోని కిడ్స్ లైబ్రరీల ప్రత్యేకత. ప్రతి వారం చిన్నారులకు సంబంధించిన వర్క్‌షాపులు నిర్వహిస్తారు. ఇంగ్లిష్ బాషపైన పట్టు. స్పేస్‌లో జరిగే వింతలూ విశేషాలు, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా ఉంటాయి. వారంలో శుక్ర, శని, ఆదివారాల్లో ఇవి అందుబాటులో ఉంటున్నాయి. చదివే అలవాటు వల్లే... నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి రకరకాల బుక్స్ చదివే అలవాటు ఉండేది. దీని వల్ల నా దగ్గర 5 వేల పుస్తకాలు పోగయ్యాయి. ఎంబీయే పూర్తి చేసి ఐదు సంవత్సరాల పాటు ముంబైలో ఐసీఐసీఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా పనిచేశా. హైదరాబాద్‌కు వచ్చాక మా పిల్లల నాలెడ్జ్‌కి దోహదపడే సెంటర్స్ ఏవీ లేకపోవటంతో... నా జీతం డబ్బులు జాగ్రత్త చేసి 10 వేల పుస్తకాలతో మూడేళ్ల క్రితం చిన్నారుల లైబ్రరీ ఏర్పాటు చేశా. మా లైబ్రరీలో పిల్లలకు సంబంధించిన ప్రతి పుస్తకం దొరుకుతుంది. కేవలం పుస్తకాలే కాకుండా విభిన్న అంశాలపై పిల్లల్లో విజ్ఞానం పెరిగేందుకు వర్క్‌షాప్‌లు కండక్ట్ చేస్తున్నా. - వర్షా రమేష్, బుక్ ఎండ్ మోర్, వెస్ట్‌మారేడ్‌పల్లి -
అభిమాని కోసం అడ్రెస్
సినిమాల్లో తారల డ్రెస్‌లు చూసి మనసుపడతాం. అలాంటి ట్రెండీ డిజైన్లు ధరించాలని ముచ్చటపడతాం. కానీ.. సేమ్ టు సేమ్ ఎక్కడ దొరుకుతాయి! అదిగో ఆ హీరో వేసుకున్న డ్రెస్... ఇదిగో ఈ తార కట్టుకున్న చీరలాంటివే కావాలంటే..? షాపులన్నీ తిరిగినా ఆ వెరైటీలు కనిపిస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటివారి అభిరుచిని గమనించి ఆన్లైన్లో ఓ స్టోర్ ఓపెన్ చేశారు సిటీ కుర్రాళ్లు చిన్మయ్ రాజు, మామిడి రాజా. బీటెక్ చదివిన వీరు మంచి ఉద్యోగాలు వదిలేసి ‘క్లాప్వన్.కామ్’ను రూపొందించారు. చిన్మయ్ చెల్లెలు హీరోయిన్ సమంత అభిమాని. ఈగ సినిమాలో ఆమె వేసుకున్న టాప్లాంటిదే కావాలని అన్నయ్యను అడిగింది. సిటీలో ఎక్కడ వెతికినా దొరకలేదు. ఈ అనుభవం ఓ బిజినెస్ ఆలోచనకు దారి తీసింది. స్నేహితుడు రాజాతో కలసి క్లాప్వన్ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించాడు చిన్మయ్. దీనికి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సాంకేతిక, ఆర్థిక సహకారం అందించింది.వీళ్లు కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకున్నారు. కొత్త సినిమాల్లో తారలు వేసుకున్న డ్రెస్‌లు పరిశీలించి వాటి డిజైనింగ్ వివరాలు, కలర్స్‌ను డిజైనర్లు అందిస్తారు. అలాంటివే సిద్ధం చేసి ఆన్లైన్లో డిస్ప్లే పెడతారు. సదరు తారల ఫొటోలనే వెబ్సైట్లో పెడతారు. కావల్సినవారు ఆ తారల ఫొటోలు క్లిక్ చేస్తే ఆన్లైన్ స్టోర్‌లోకి ఎంటర్ అయ్యి కొనుగోలు చేయవచ్చు. మింత్రా, ఫ్లిప్‌కార్ట్, జబాంగ్, ఫ్యాషనోరా వంటి వెబ్సైట్లతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వెబ్‌సైట్‌ను రోజుకు 50 వేల మంది వీక్షిస్తున్నారంటే తారల డ్రెస్‌లను ఫాలో అయ్యేవారు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. - విజయారెడ్డి -
జష్న్ - ఎ - నిఖా
జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయే వేడుక పెళ్లి. ఈ పండుగను ఘనంగా నిర్వహించడానికి ఇంటిల్లిపాదీ శ్రమిస్తుంది. సంబంధాలు చూడటం మొదలు.. అప్పగింతలు అయ్యే వరకు ప్రతి ఘట్టం ఎంత అపురూపమైనదో.. అంత సున్నితమైనది కూడా. మ్యాట్రిమోనియల్ సర్వీస్ నుంచి.. ఇన్విటేషన్ కార్డ్ డిజైనర్స్.. ఫొటో, వీడియోగ్రాఫర్స్, టూర్ ఆపరేటర్స్, వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా పెళ్లి తంతులో ప్రధానమైన వాటన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చింది ‘జష్న్-ఎ-నిఖా’ ఎక్స్పో. ప్రత్యేకంగా ముస్లింల కోసం నాంపల్లిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పోలోని వెరైటీలను డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, టీఆర్ఎస్ నాయకురాలు విజయారెడ్డి ఆసక్తిగా తిలకించారు. అత్తరు గుబాళింపు.. కళ్లు చెదిరే డ్రెస్సింగ్.. నవ వధువును మెరిపించే ఆభరణాలు... ఇవన్నీ నిఖాలో కనిపిస్తాయి. ముస్లింల కోసమే పత్య్రేకంగా వెడ్డింగ్ కలెక్షన్ ఎక్స్పో ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. ఆదివారం వరకు కొనసాగే ఈ ఎక్స్పోలోని 70 స్టాల్స్‌లో జ్యువెలరీ, కాస్మొటిక్స్, డిజైనింగ్ వేర్ వంటివెన్నో ఉన్నారుు. - శిరీష చల్లపల్లి -
డెనిమ్ ట్రెండీ..
డెనిమ్... డ్రెస్ల్లో డిగ్నిఫైడ్‌గా ఒదిగిపోతుంది. పాదరక్షల్లో ఫంకీగా మారిపోతుంది. రూపుమారినా... చూపు తిప్పుకోనివ్వని ఘనత డెనిమ్దే. చలిలో వెచ్చగా, వేసవిలో వేడికి ఉపశమనంగా, వర్షంలో తడిసినా పాడవని డెనిమ్ షూ ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలకు హాట్ ఫేవరెట్ అయ్యింది. కాస్త ఫంకీగా, కొంత ట్రెండీగా కనిపించాలనుకునే కుర్రకారుకు నప్పేలా డెనిమ్‌తో కొత్త ప్రయోగాలు ప్రపంచమంతా జరుగుతున్నాయి. అందులో భాగంగా యువతను ఆకట్టుకునేలా డెనిమ్ చెప్పులు, శాండల్స్, బూట్లు సిటీకి వచ్చేశాయి. ఇవి జీన్స్, స్కర్టులాంటి ఆధునిక ధుస్తుల మీదికి అందంగా నప్పుతాయి. కిక్ ఇచ్చే కిక్స్... మైక్రో ఫైబర్‌తో రూపిందించే చెప్పులకు దీటుగా డెనిమ్ చెప్పులు, షూలలో రకరకాల డిజైన్లు, రంగులు వస్తున్నాయి. దీంతోపాటు పూసలు, రాళ్లు, కుందన్స్‌తో అదనపు అందాలను చేర్చడంతో ఇవి మరింత ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఇక వీటిలో స్నీకర్స్, శాండల్స్, హీల్స్, బూట్లు, లోఫర్స్, కిక్స్, ఇలా అన్నింటిలోనూ డెనిమ్ అందాలున్నాయి. ఏ తరహా డ్రెస్లకైనా ఇవి చక్కగా సరిపోతాయి. ప్రత్యేకమైనవి... వర్షంలో తడిసినా పాడవుతాయన్న దిగులు లేదు. ఎన్నిసార్లు వేసినా మాసినట్లు కనిపించకపోవడమే వీటి ప్రత్యేకత. లెవిస్, నైక్ లాంటి బ్రాండ్లతో పాటు ఇతర అన్బ్రాండెడ్లోనూ ఎన్నో డిజైన్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.500 నుంచి లభిస్తున్నాయి. - విజయారెడ్డి -
కిర్రాఖీ
అన్నా చెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. పేగుతో పంచుకున్న అనుబంధాన్ని దారంతో ముడివేసి తోబుట్టువు గుర్తు చేస్తే.. చిన్ని దారానికే వెన్నలా కరిగిపోయి అన్ని వేళల్లా తోడుంటానని సోదరుడు ఇచ్చే భరోసాకు సందర్భమే రాఖీపండుగ. అలాంటి పండుగకు నాలుగు రోజుల ముందునుంచే కళకళలాడుతోంది నగరం. కొనుగోలు దారులతో స్టాల్స్ సంద డిగా మారాయి. అయితే ఏయేటికాయేడు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కస్టమర్లు. వారి అభిరుచికి అనుగుణంగా రాఖీల తయారీలో క్రియేటివిటీని చూపిస్తున్నారు తయారీదార్లు. మార్కెట్లో ఈ యేడూ భిన్నమైన రాఖీలు తమ వైవిధ్యాన్ని చాటుకుంటున్నాయి. ఆకట్టుకుంటున్న థాలీ ఇదేదో భోజనం అని కంగారుపడిపోకండి. కొత్తదనాన్ని కోరుకునే హైదరాబాదీలకు కనువిందు చేస్తోంది ఈ రాఖీ. సాధారణంగా రాఖీ అనగానే... రాఖీలు ఒక చోట, అందుకు అవసరమైన కుంకుమ మరోచోట.. ఇక స్వీట్స్ ఇంకో చోట.. ఇలా షాపుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఈ థాలీతో ఆ బెడద తప్పినట్లే. వెడల్పాటి ఆకర్షణీయమైన ప్లేటు(థాలీ), అందులో అందంగా అలంకరించిన డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, కుంకుమ, రాఖీతో కలిపి తయారీదారులు ఒక ప్యాకేజీగా అందిస్తున్నారు. చూడగానే ఆకట్టుకునేలా ఉండటంతో పాటు, అన్నీ ఒకే చోట ఉండటంతో ఎంపిక సమయమూ కలిసి వస్తోంది. దీంతో ఈ థాలీ కోసం వాలిపోతున్నారు కస్టమర్లు. అందుబాటులో ఉండే విధంగా వీటి ధరలు 100 నుంచి 1,000 రూపాయల వరకు ఉన్నాయి. పిల్లల కోసం.. మారుతున్న జనరేషన్‌తో పాటు పిల్లల రాఖీల్లో ట్రెండ్స్ మారిపోతున్నాయి. గతంలో టెడ్డీ బేర్ రాఖీలకు డిమాండ్ ఉండేది. పిల్లల మనసుకు దగ్గరగా వెళ్లి వారికి నచ్చేలా తయారుచేసిన రాఖీలెన్నో మార్కెట్లో కొలువుదీరాయి. వాటిలో రకరకాల కార్ల బొమ్మలు, లైట్ గన్స్, జంతువుల బొమ్మలు.. పిల్లలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ బొమ్మ రాఖీలు 40 నుంచి 150 రూపాయల వరకు పలుకుతున్నాయి. టాయ్స్ తరువాత పిల్లలు అత్యధికంగా ప్రిఫర్ చేస్తున్న రాఖీలు కార్టూన్ క్యారెక్టర్స్వి. చోటాభీమ్, యాంగ్రీబర్డ్స్, బెన్‌టెన్, క్రిషర్ రాఖీలు కార్టూన్ రాఖీల కొనుగోలులో ముందు వరసలో ఉన్నాయి. వీటితోపాటు పిల్లలు ఇష్టపడుతున్న రాఖీల్లో మిక్కీ మౌస్, డోనాల్డ్డక్, ట్వీటీ, మోగ్లీ, క్యాస్పెర్, స్పైడర్‌మ్యాన్ కూడా ఉన్నాయి. ‘ప్రతి ఏడూ రాఖీ తయారీలో కొత్త దనం తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాం. నిజానికి ఈ రాఖీ థాలీని మార్వాడీల కోసం తయారు చేయించేవాళ్లం. ఆకర్షణీయంగా కనిపిస్తున్న వీటిని చూసి, మిగిలినవారూ ఆసక్తి చూపుతున్నారు. దీంతో రక్షాబంధన్‌కి థాలీ మార్కెట్ బాగుంది. పిల్లల రాఖీలు కావాలని రకరకాల బొమ్మలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించాం.’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు శ్రద్ధ ఎక్స్టెన్షన్ యజమాని ఉమాకాంత్. మోస్ట్ పాపులర్.. మోడీ రాఖీ అన్నింటినీ మించి ఈ ఏడాది ఆకట్టుకుంటున్న రాఖీ మరోటి ఉంది. అది ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ. దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడవుతున్న రాఖీల్లో ఇది ఒకటి. పార్లమెంటులో అడుగుపెడుతూనే ప్రధానిపీఠాన్ని అధిష్టించిన ఈ పొలిటికల్ హీరో రాఖీ కొనేందుకు జనం ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. - విజయారెడ్డి -
లిటిల్ కిచెన్
ఒకప్పుడు చిన్నారులు ఆడుకునే వస్తువులు చెక్క బొమ్మలు.. లక్క పిడతలు. ఎలక్ట్రానిక్ కార్లు.. బేబీ డాల్స్ తర్వాతి తరం పిల్లలకు ఆట వస్తువులయ్యాయి. ఈ తరం పేరెంట్స్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. పసి తనంలో వారు మిస్సయిన ఆటలు పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నారు. చిన్నారుల కళ ్లల్లో ఆనందమే కాదు.. మస్తిష్కంలో సృజనాత్మకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏకంగా బొమ్మరిల్లునే ఇంటికి తెస్తున్నారు. అమ్మానాన్నలను, టీచర్లను అభినయిస్తూ ఆడుకోవడం చిన్నారులందరికీ సరదా. స్కూల్ నుంచి రాగానే టీచర్‌గా మారిపోయి పాఠాలు చెప్పేస్తుంటారు. వంటగదిలో అమ్మ చేసే పనులు గమనించి చిట్టి చిట్టి చేతులతో ఉత్తిత్తి వంట చేయడం ఆడపిల్లలకు మహా ఇష్టం. ఒకప్పుడు ఇంట్లో ఉండే గిన్నెలు, చెంచాలతోనే వంటింటి ఆట కానిచ్చేసే వారు. కానీ నేటి పిల్లలకు అచ్చంగా కిచెన్‌ను పోలి ఉండే మినియేచర్ కిచెన్లు అందుబాటులోకి వచ్చాయి. రేటు కొద్దీ వసతి కిడ్ క్రాప్ట్, వరల్ట్ టాయ్స్, లిటిల్ కొలరాడో లాంటి అనేక కంపెనీలు ఈ బుల్లి కిచెన్లను తయారు చేస్తున్నాయి. ఈబే, అమెజాన్ వంటి ఆన్లైన్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక వీటి ధర రూ.800 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి. అచ్చంగా వంటిల్లే.. పోపుల పెట్టె నుంచి గ్యాస్ స్టవ్ వరకు అన్ని రకాల వంట సామగ్రి ఈ బొమ్మల కిట్‌లో ఉంటుంది. కూరగాయలు, పండ్లే కాదు బ్రెడ్డు, పిజ్జా ఇవన్నీ ఆటకు మరింత కిక్కునిస్తాయి. ప్లాస్టిక్, వుడెన్, స్టీల్‌తో తయారైన కిచెన్ సెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. బ్యాటరీలతో పని చేసే కిచెన్ సెట్లు.. పిల్లలకు అచ్చంగా వంట చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. స్టవ్ ఆన్ చేయగానే వెలిగినట్లే ధ్వని వస్తుంది. నూడుల్స్నో, పాస్తానో పాన్‌లో (అన్నీ ప్లాస్టిక్‌వే) వేయగానే ఇప్పుడు పాస్తా చేద్దాం అంటూ స్టవ్ నుంచి సౌండ్ వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ కిడ్ కిచెన్ సెట్లు.. పిల్లలనే కాదు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. పెద్దలను అనుకరిస్తూ ఆడుకోవడం వల్ల చిన్నారుల్లో మానసిక పరిపక్వత పెరగడానికి దోహదం చేస్తుంది. - విజయారెడ్డి -
రెడీ మెయిడ్.. ఆన్లైన్లో మన మనిషి
‘ఇవ్వాళ పనమ్మాయి వస్తుందో రాదో.. ఒకవేళ వచ్చినా, మళ్లీ ఏదో ఒక వంకతో ఊరికి వెళతా అంటుందేమో.. పోనీ తను వెళుతుంటే కనీసం వేరే పనమ్మాయినైనా పెడుతుందో లేదో..’ పొద్దున్న బెడ్ మీద నుంచి లేచీలేవకముందే సిటీలోని గృహిణుల బుర్రలో నిద్రలేచే భయాలివన్నీ. ఇది ఒక్క పనిమనిషి విషయంలో మాత్రమే కాదు.. స్థాయి, అవసరాన్ని బట్టి కారుడ్రైవర్ నుంచి ఓల్డేజ్ పర్సన్స్ కేర్‌టేకర్స్ వరకూ ఇంటింటా కనిపించే తంటానే ఇది. వీరి అవసరాలనే తమ వ్యాపారానికి అనుగుణంగా మార్చుకుంటున్నాయి కొన్ని సంస్థలు. డొమెస్టిక్ హెల్ప్ సర్వీస్ పేరుతో లభిస్తున్న సేవలిపుడు సిటీజనులను ఆకర్షిస్తున్నాయి. నేటి బిజీ లైఫ్‌లో ఇంట్లో పనులన్నీ ఒక్కరే చేసుకోవడం కష్టమైపోతోంది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే వారి కష్టాలు చెప్పనక్కర లేదు. అందుకే పనిమనుషులు తప్పనిసరి అయ్యారు. అయితే సరైన పనివారు దొరకకపోతే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పైగా ముక్కూ మొహం తెలియనివారిని పనిలో నియమించుకుంటే.. వారు అరాచకాలకు పాల్పడుతున్న సంఘటనలూవెలుగులోకి వస్తుండటం తెలిసిందే. అందుకే నమ్మకమైన, నైపుణ్యమున్నవారిని చూసి.. సర్టిఫికెట్ ఇచ్చి మరీ పనిమనుషులను అందిస్తున్నాయి కొన్ని సంస్థలు. సెర్చ్ చేస్తే సరి సర్వెంట్స్ కావాలనుకున్నవారు గూగుల్‌లో డొమెస్టిక్ సర్వీసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే.. వివిధ సంస్థల లిస్ట్ వస్తుంది. ఆయా సంస్థల వెబ్సైట్లలోకి లాగిన్ అయితే వివరాలన్నీ వారి ముందు ప్రత్యక్షమవుతాయి. ఎలాంటి సర్వెంట్ కావాలి, వారి వయస్సు ఎంత ఉండాలి, చదువు ఉండాలా.. లేదా, ఎంత టైమ్ పని చేయాలి.. లాంటి వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేసుకున్న తర్వాత సదరు సంస్థవారు మీతో కాంటాక్ట్‌లోకి వస్తారు. వీరందించే సేవల్లో కుక్స్, ఆయాలు, డ్రైవర్లు, పెట్స్ బాగోగులు పర్యవేక్షించేవారు, ఇంట్లో పెద్ద వయసు వారికి సేవలు చేసేవారు.. ఆయా సంస్థల సేవల్లో ప్రధానం. వీరి నియామకం విషయంలో ఈ సంస్థలు చాలా కసరత్తు చేస్తాయి. పనివారిని నియమించుకోవడానికి స్లమ్ ఏరియాలలో తమ సంస్థ గురించి ప్రచారం చేస్తారు. ప్రయోజనాలు తెలుసుకుని, పనిచేసేందుకు ఇష్టపడినవారిని నిబంధనల ప్రకారం ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. అన్ని విధాలా బాగున్నారని రూఢీ చేసుకున్నాకే సంస్థలో నియమించుకుంటారు. వారికి ఇంటిని శుభ్రపర్చడం, వంట చేయడం, సర్వ్ చేయడం.. తదితర అంశాలపై పది రోజుల శిక్షణ ఇస్తారు. నియామకానికి ముందే వారికి సంబంధించిన గత చరిత్ర మొత్తం సేకరిస్తారు. వారి ప్రవర్తన, తీరుతెన్నులు పరిశీలిస్తారు. భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన పనివారికి ముందుజాగ్రత్తగా స్థానిక పరిస్థితులపై అవగాహన కూడా కలిగిస్తారు. వివిధ సంస్థల నుంచి పనికి వెళ్లేవారు ఎక్కవగా మహిళలే. అందుకే ఈ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికయితే సర్వెంట్ అవసరమో వారి విషయాలన్నింటినీ ముందుగా సేకరిస్తారు. ఇరుపక్షాలూ ఓకే అన్నాకే కాంట్రాక్ట్ కుదుర్చుకుంటారు. పనిగంటలను బట్టి నెలకు రూ.7వేల నుంచి రూ.15వేల వరకు వర్కర్స్కు జీతాలుంటాయి.కేవలం ఇళ్లకు మాత్రమే కాదు గెస్ట్‌హౌస్‌లు, ఫామ్‌హౌస్‌లను చూసుకోవడానికి అవసరమైన కేర్‌టేకర్స్‌ను నియమిస్తారు. ఒకవేళ మనకు వాళ్లు పంపిన వ్యక్తి పనితీరు నచ్చకున్నా, అవసరానికి సరిపడా లేకున్నా తిప్పి పంపిస్తే మరొకర్ని పంపుతారు. అలాగే పని మనుషుల బాగోగులు కూడా ఆయా సంస్థల ఎగ్జిక్యూటివ్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంటారు. వారికి యజమానుల నుంచి ఇబ్బందులు రాకుండా చూస్తుంటారు. ‘బంజారాహిల్స్‌లో ఒక డాక్టర్ ఇంట్లో వంట పని, ఇంటి పని ఆరు నెలలుగా చేస్తున్నా. నెల జీతం, పనివేళల గురించి ఎప్పటికప్పుడు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి బాగోగులు అడుగుతుంటారు. ఈ విధానం వల్ల చాలా హాయిగా ఉంది..’ అంటూ శ్రావణి సంతోషం వ్యక్తం చేసింది. ‘గతంలో నేను పనిచేసే చోట వేధింపులు ఎదుర్కొన్నా. ఈ సంస్థ ద్వారా ఒక ఉద్యోగిని ఇంట్లో పనికి కుదిరాను. వంటపని, ఇంటి పని చేస్తున్నా. మా మేడమ్ బాగా చూసుకుంటారు. నా క్షేమసమాచారాల గురించి ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి అడుగుతుంటారు’ అంటోంది సౌమ్య. మొత్తమ్మీద కస్టమర్స్, కేర్టేకర్స్ల మధ్య సంధానకర్తలుగానే కాకుండా సమన్వయం బాధ్యత కూడా ఆయా సంస్థల బాధ్యులు తీసుకోవడం వల్ల అందరి పని సులువవుతోంది. మాది గోల్డ్ బిజినెస్. వ్యాపార నిమిత్తం ఎక్కువగా బయట తిరగాల్సి ఉంటుంది. ఇద్దరు చిన్న పిల్లలున్నారు. వారిని చూసుకోవడానికి గతంలో ఒకరిని బయటి నుంచి నియమించుకుంటే ఇంట్లో దొంగతనం జరిగింది. పిల్లలు ఎలా ఉన్నారోనని చాలా టెన్షన్ పడేదాన్ని. ఏడాదిన్నరగా పిల్లలను చూసుకోవడానికి ఒకరు, ఇంటి పనికి ఒకరిని ఆన్లైన్ ద్వారా ఓ సంస్థ నుంచి నియమించుకున్నా. ఇప్పుడెలాంటి భయాలూ లేవు. - ప్రీతి దుగ్గిరాల, హబ్సిగూడ మా సంస్థ ద్వారా కేర్‌టేకర్స్, సర్వెంట్స్‌ని నియమించుకున్న వారు చాలా కంఫర్ట్‌గా ఫీలవుతున్నారు. ఈ విధానంలో ఉన్న నిబంధనలు పాటించడం వల్ల అటు పనివారికి, ఇటు వారిని నియమించుకున్నవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. - ఉపేందర్, మేనేజర్, గెట్ డొమెస్టిక్హెల్ప్ డాట్ కామ్ - విజయారెడ్డి ఫొటోలు : ఠాకూర్ -
కేర్‌మన్నా.. కనిపిస్తుంది
స్క్రీన్ మీద ఒక వీడియో రన్ అవుతోంది... అందులో ఒక పనిమనిషి నెలల పిల్లాడిని మంచం మీదకు విసిరేసింది. తిరిగి పెకైత్తి మళ్లీ అలాగే విసిరేసింది. అలా పదే పదే చేసింది. అక్కడి నుంచి పసిబిడ్డని మళ్లీ హాల్లోకి తీసుకువచ్చి కుర్చీలో విసిరింది. కసి తీరా అలా ఒకటికి పదిసార్లు చంటి బిడ్డను రాక్షసంగా విసిరేసింది. ఇటీవల మీడియాలో ఈ దృశ్యం చూసినవారంతా.. ముఖ్యంగా పిల్లలను సర్వెంట్లకు అప్పచెప్పి వెళ్లే తల్లిదండ్రులంతా బెంగటిల్లారు. ఇలాంటివారి దిగులు తీర్చేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. - విజయారెడ్డి కెమెరా-మోడల్స్ వైర్లెస్ నెట్వర్క్ కె మెరా డేనైట్ నెట్వర్క్ కెమెరా క్లవ్డ్ నెట్వర్క్ కెమెరా వైఫై బేబీ కెమెరా ఇదో యాంత్రిక ప్రపంచం.. ఉరుకులు, పరుగుల జీవనం. ఇదివరకు పురుష పుంగవులకే పరిమితమైన డ్యూటీ, హడావుడి.. ఇప్పుడు మహిళలకూ తప్పనిసరైంది. దాంతో ఆలూమగలు ఇద్దరూ బాక్స్‌లు పట్టుకుని మోటారు బళ్లు ఎక్కి బయలుదేరుతున్నారు. ఎలాగూ ఉమ్మడి కుటుంబాలు మాయమయ్యాయి. మరి కడుపున పుట్టిన పిల్లల సంగతేంటి? వారి ఆలనాపాలన ఎవరు చూస్తారు? క్రచ్‌లు, కేర్ సెంటర్లు, ప్లేస్కూల్స్ ఉండనే ఉన్నాయి. ఆలనాపాలన కోసం ఇంట్లో మెయిడ్‌ని పెట్టుకోవడం మహానగరాల్లో మాములైపోయింది. అయితే పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన వర్ణనాతీతం. కానీ ఇకపై ఆ మనసులకు సాంత్వన కల్గించే దుర్భిణీలు వచ్చేశాయ్.. అవే వీడియో బేబీ మానిటర్ కెమెరాలు! అంటే జస్ట్లైక్ సీసీ కెమెరాల మాదిరిగా అన్నమాట. వై ఫై నెట్‌వర్క్‌తో పనిచేసే ఈ బుజ్జి కెమెరా రాత్రి పూట కూడా పనిచేస్తుంది. గదిలో టెంపరేచర్ తేడాలు కూడా కనిపెడుతుంది. బేబీ మానిటర్ కెమెరా: సుమారు పదివేల ఖరీదు చేసే బేబీ మానిటర్ కెమెరాని మీ ఇంట్లో అమర్చుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్తూ నిర్భయంగా చిన్నారిని ఇంట్లోనే ఉంచేసి వెళ్లొచ్చు. ఆఫీసులకు చేరుకున్నాక కూడా ఇంట్లో మీ పిల్లల్ని కదలికల్ని చూడొచ్చు. వీడియో పాటలు, రైమ్స్ రిమోట్ యాక్సిస్ ద్వారా వారికి వినిపించవచ్చు. అటు నుంచి పిల్లల ఏడుపులు తదితర సౌండ్లను వినొచ్చు. రూమ్ టెంపరేచర్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్, ల్యాప్‌టాప్, పీసీ తదితరాల్లోనూ ఈ ఆప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా కూడా ఇంట్లోని కెమెరాను పనిచేయించొచ్చు. అంతేనా చీకట్లోనూ ఈ కెమెరా చక్కగా పనిచేయడం అదనపు సౌకర్యం. అలా ఈ వైఫై టెక్నాలజీతో పిల్లల్ని ఏ బెంగా లేకుండా ఈజీగా పెంచొచ్చు. స్కూళ్లలో కూడా.. ఈ సౌకర్యం నగరంలోని పలు స్కూళ్లు కల్పిస్తున్నాయి. స్కూల్ ఎంట్రన్స్ నుంచే కెమెరాలు తమ పనిని ప్రారంభిస్తాయి. ప్రతి తరగతి గదిలో, లాన్లలో వెబ్ కెమెరాలుంటాయి. పిల్లలు స్కూల్లో ఎక్కడ ఉన్నా తల్లిదండ్రులు ఎంతదూరంలో నుంచయినా వారి కదిలికల్ని చూడొచ్చు. ‘ఈ సౌకర్యంతో పిల్లల గురించి బెంగపడకుండా తల్లిదండ్రులు ప్రశాంతంగా తమ పనుల్లో లీనమవ్వచ్చు. ఫలానా టైమ్‌లో తమ పిల్లలు ఏమి చేశారో చూడాలనుకున్నా సాధ్యమే. అవసరమైతే వీడియో ఫుటేజీని కూడా వారికి అందిస్తాం’ అంటున్నారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ఎస్పారెంజా స్కూల్ నిర్వాహకులు. -
బ్యూటీ & gym
బాడీ ఫిట్నెస్ అంటే రకరకాల జిమ్ సెంటర్లు గుర్తుకొస్తాయి. వాటిలో ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. మహిళలు ఇలాంటి ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అలాంటి వారికోసం కాలనీలోని ప్రతి బ్యూటీ పార్లర్లలోనూ లేడీస్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. లక్ష నుంచి రెండు లక్షల రూపాయల ఖర్చుతో జిమ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచుతున్నారు. బ్యూటీ పార్లర్లలో ఉన్న ఈ జిమ్‌లపై కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులతో పాటు గృహిణులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఫీజు కూడా తక్కువే ఉండటంతో ఈ సెంటర్లకు క్యూ కడుతున్నారు. వీటికి వెళుతున్న మహిళలు ఎక్కువగా ట్రెడ్ మిల్, సిటప్స్, సైక్లింగ్ వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తున్నట్టు ఓ జిమ్ ఉద్యోగిని స్వప్న తెలిపారు. విజయారెడ్డి -
విద్యార్ధుల ఆత్మకు శాంతి చేకూరాలి-విజయారెడ్డి
-
ఖైరతాబాద్‌లో దూసుకుపోతున్న విజయారెడ్డి
హైదరాబాద్ : ఖైరతాబాద్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. కడపటి వార్తలు అందే సరికి 1200 ఓట్ల ఆధిక్యంలో ఆమె ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీమంత్రి దానం నాగేందర్ బరిలో ఉన్నారు. -
కంటతడి పెట్టిన వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి విజయారెడ్డి
-
విశాఖలో కాంగ్రెస్‌కు షాక్
విశాఖ :ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా... మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయా రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ లోక్‌సభ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. విజయా రెడ్డితో పాటు కొత్తవలస కాంగ్రెస్ అధ్యక్షుడు నెక్కల నాయుడు, ఉత్తర నియోజకవర్గం టీడీపీ నేత నారాయణ స్వామి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
ఉక్కిరి బిక్కిరి
దానం, వీహెచ్ ఎదురీత ఖైరతాబాద్‌లో గడప దాటని.. దానం సికింద్రాబాద్‌లో వెనకబడి పోయిన జయసుధ గ్రేటర్లో వీఐపీలకు ముచ్చెమటలు పడుతున్నాయి. బుల్లెట్లా దూసుకుపోతున్న ప్రత్యర్థుల ప్రచార హోరుతో హేమాహేమీలనుకున్న అభ్యర్థులు హడలిపోతున్నారు.అంబర్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డితో గట్టిపోటీని ఎదుర్కొంటుండగా, ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, పీజేఆర్ కూతురు విజయారెడ్డి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సికింద్రాబాద్‌లోనూ కాంగ్రెస్ అభ్యర్థి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు. - సాక్షి, సిటీబ్యూరో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాకు తోడు రాష్ర్ట కేబినెట్ మంత్రిగా అన్ని నియోజకవర్గాల్లో అన్నీ తానై వ్యవహరించే ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ ప్రస్తుతం నియోజకవర్గ గడపదాటని స్థితి నెలకొంది. గత ఐదేళ్లలో నియోకజవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటంతో పాటు ఆయన అనుచరల భూకబ్జాలు, సెటిల్మెంట్లు, ఉద్యమ కారులపై దాడులకు పూనుకుని సంపాదనే లక్ష్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలతో సాధారణ జనమంతా దూరమైయ్యారు. దీనికి తోడు ఖైరతాబాద్ నియోకజవర్గంలో బలమైన అభిమానులు, అనుచరవర్గం ఉన్న పీజేఆర్ కూతురు విజయారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆమె ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఈ నియోకజవర్గంలో వైఎస్సార్ - పీజేఆర్ అభిమానులు విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో దానం నాగేందర్‌కు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. విజయారెడ్డి ప్రచారానికి వెళుతున్న కాలనీల్లో విద్యుత్ కోత విధించేలా చూడటం, క్రియాశీలక కార్యకర్తలకు డబ్బు ఎర వేయటం, ఆయా సంఘాలకు మూడు దఫాలుగా మొత్తాన్ని ముట్ట చెబుతానని హామీలతో కాలం గడిపే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు నియోకజవర్గంలో ఫలితాన్ని శాసించే స్థితిలో ఉన్న ముస్లిం, క్రిస్టియన్లు దానం తీరుకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయిం చటంతో ఆయన పరిస్థితి గందరగోళంగా మారింది. కేవలం డబ్బు పంపిణీతోనే గట్టెక్కే ఆలోచనతో పావులు కదుపుతున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో ఊపందుకుంది. లష్కర్... మసకబారిన సినీ గ్లామర్ సికింద్రాబాద్ శాసనసభ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంఎల్ఏ, సినీ నటి జయసుధ ప్రచారంలో పూర్తిగా వెనకబడి పోయారు. తొలుత తనకు ఎంఎల్ఏ టికెట్ ఇస్తారా? లేదా? అన్న అయోమయంలో కాలం గడిపిన జయసుధ ప్రచారాన్ని ఆలస్యంగా ప్రారంభించారు.గత ఎన్నికల్లో ఆమెకు అండగా నిలిచిన ఆదం విజయ్‌కుమార్ ప్రస్తుతం ఇదే నియోకజవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దూసుకుపోతున్నారు. ఆదం వెంట బలమైన కాంగ్రెస్ కేడర్, అభిమానులు వెంట నడుస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ గ్లామర్ ఒక్క సారిగా తగ్గిపోయింది. ఐదేళ్లు ఎంఎల్ఏగా పనిచేసినా కూడా బస్తీల వారీగా సమస్యలపై అవగాహన పెంచుకోకపోవటం, కార్యకర్తలు, ముఖ్య నాయకులను సైతం గుర్తు పట్టలేని పరిస్థితి ప్రస్తుతం జయసుధ ను పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు తెలంగాణ తామే తెచ్చామంటూ టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు సైతం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌ను గండికొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అంబర్‌పేటలో ఢిల్లీకి..గల్లీకి పోటీ ముఖ్యమంత్రి రేసులో తాను ఉన్నానంటూ ఎన్నికల గోదాలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వి.హన్మంతరావు పరిస్థితి ఆశాజనకంగా లేదు. బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డితో తీవ్ర పోటీని ఎదుర్కుంటున్నారు. అధ్యక్షునిగా ఉన్న కిషన్ర్రెడ్డి పని ఒత్తిడి ఎలా ఉన్నా.. వారంలో ఐదు రోజులు నియోజకవర్గంలో పర్యటించటం అలవాటుగా చేసుకోవటం కిషన్‌రెడ్డికి కలిసి వచ్చింది. అంబర్‌పేటకు చెందిన హన్మంతరావు అధిక సమయం ఢిల్లీలోనే గడిపేయటంతో ప్రస్తుతం నియోజక వర్గంలో గల్లీకి - ఢిల్లీకి పోటీలా మారింది. కిషన్‌రెడ్డి గల్లీగల్లీలోనూ అక్కడి బస్తీ నాయకుల పేర్లతో పలకరిస్తుంటే.. అంబర్‌పేట వాసినని చెప్పుకునే హన్మంతరావు ఆయా బస్తీల రూట్లు కూడా మరిచిపోవటం ఆయనకు ఇబ్బందికర అంశంగా మారింది. దీంతో కిషన్‌రెడ్డి గల్లీకి - ఢిల్లీకి మధ్యే పోటీ అంటూ అంబర్‌పేటలో దూసుకువెళుతున్నారు.. హన్మంతరావు గత 15 ఏళ్లుగా అంబర్‌పేటలోనే తాను నివాసముంటున్నా ఇక్కడి బస్తీల అభివృద్ధికి కృషి చేయలేదనే అపవాదు ఉంది. తన రాజ్యసభ నిధుల నుండి కనీసం రెండు శాతం నిధులు కూడా అంబర్‌పేట నియోజకవర్గానికి కేటాయించలేదన్న అంశం కూడా అంబర్‌పేట ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశమైంది. -
విజయారెడ్డి గెలవడం ఖాయుం: విజయమ్మ
హైదరాబాద్, ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయూరెడ్డి భారీ మెజారిటీలో విజయుం సాధిస్తారని వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయువ్ము అన్నారు. ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ వేసిన విజయూరెడ్డికి వుద్దతుగా విజయువ్ము వచ్చారు. ys vi అనంతరం వూట్లాడుతూ.. ఖైరతాబాద్‌లో పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు ఇంకా మరచిపోలేదని, ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేస్తుందని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయుం కోసం ప్రచారం చేస్తానని వెల్లడించారు. -
నాగేందర్ ఆటలు ఇక సాగవు
వైఎస్సార్ సీపీ నేత విజయారెడ్డి బంజారాహిల్స్, న్యూస్‌లైన్: చిన్నచిన్న కేసులున్నాయంటూ సామాన్య కార్యకర్తలను బైండోవర్లు చేస్తున్న పోలీసులు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులున్న మాజీ మంత్రి దానం నాగేందర్‌ను ఎందుకు బైండోవర్ చేయడంలేదని వైఎస్సార్ సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గం కన్వీనర్ పి.విజయారెడ్డి ప్రశ్నించారు. పెద్దలకు ఓ న్యాయం, పేదలకు మరో న్యాయమా అని పోలీసుల తీరుపై మండిపడ్డారు. శనివారం బంజారాహిల్స్ రోడ్డు నెం.10లోని గౌరీశంకర్ కాలనీలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు తీసుకెళ్తుంటే వాహనాల తనిఖీల్లో దొరికాయంటూ ప్రకటనలు ఇస్తున్న పోలీసులకు మాజీ మంత్రి దానం ఇంటి వద్ద నిత్యం డబ్బు జాతర జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని బైండోవర్లు జరుగుతున్నాయని, ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్‌కు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. తాము కాలనీల్లో పాదయాత్ర చేస్తుంటే పోలీసులు వెంబడిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని, పోలీసులే తమ కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్‌లో తిరగాలంటూ ఆదేశిస్తున్నారన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని గత ఎన్నికల్లో గెలిచిన నాగేందర్ ఇప్పుడు పీజేఆర్ అనుచరులను తొక్కిపెట్టడమే లక్ష్యంగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌లో దానంకు గడ్డు పరిస్థితులు ఉన్నాయని వైఎస్సార్సీపీ హవా కొనసాగుతుందని సర్వేలు చెప్పడంతో ఏమీచేయలేక ఆయన ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. ఎన్బీనగర్లోని బడుగులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు వస్తే తాను లాయర్‌ను ఏర్పాటు చేసి కోర్టులో పోరాడి వారికి న్యాయం చేశానన్నారు.అయిదేళ్ల పాలనలో ఖైరతాబాద్‌లో పేద, ధనిక అన్న తేడా లేకుండా అధికార పార్టీ నరకం చూపించిందని, విసుగెత్తి అందరూ వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో నాగేందర్ ఎంత డబ్బు వెదజల్లినా ఇంటికే పరిమితమవుతారన్నారు. అధికారం కోసం రాత్రికి రాత్రే పార్టీలు మార్చిన నాగేందర్‌కు తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. భీంరావ్బాడలో పేదల ఇళ్లను నామరూపాల్లేకుండా చేసిన దానం నోటీసుల పేరుతో అనేక బస్తీలను అతలాకుతలం చేస్తున్నారని, మరోసారి గెలిస్తే బస్తీలు మిగలవన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. -
దానం అనుచరులు వేధిస్తున్నారు: విజయా రెడ్డి
రాత్రికి రాత్రే పార్టీలు మార్చే వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి పరోక్షంగా మాజీ మంత్రి దానం నాగేందర్‌ను విమర్శించారు. శనివారం హైదరాబాద్‌లో విజయారెడ్డి మాట్లాడుతూ...దానం అండ చూసుకుని అటు అనుచరులు ఇటు పోలీసులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు. దానం అనుచరులు అందరినీ వేధిస్తున్నారని విమర్శించారు. దానం అనుచరులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. -
'దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది'
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనను ప్రచారం చేయకుండా దానం నాగేందర్ అనుచరులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి పీజేఆర్ కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. దానం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని విజయారెడ్డి అన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన దానంకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డిపై దానం అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించారు. -
విజయారెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు వైసీపీ
-
పెదల పై అధికారపార్టీ నేతల ఆగడాలు