రాత్రికి రాత్రే పార్టీలు మార్చే వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి పరోక్షంగా మాజీ మంత్రి దానం నాగేందర్ను విమర్శించారు.
రాత్రికి రాత్రే పార్టీలు మార్చే వారికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి పరోక్షంగా మాజీ మంత్రి దానం నాగేందర్ను విమర్శించారు. శనివారం హైదరాబాద్లో విజయారెడ్డి మాట్లాడుతూ...దానం అండ చూసుకుని అటు అనుచరులు ఇటు పోలీసులు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
దానం అనుచరులు అందరినీ వేధిస్తున్నారని విమర్శించారు. దానం అనుచరులపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నవారిపై పోలీసులు బైండోవర్ కేసులు పెడుతున్నారని విజయారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.