విశాఖ :ఓ వైపు ఎన్నికలు దగ్గర పడుతున్నా... మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు విజయా రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. విశాఖ లోక్సభ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకున్నారు. విజయా రెడ్డితో పాటు కొత్తవలస కాంగ్రెస్ అధ్యక్షుడు నెక్కల నాయుడు, ఉత్తర నియోజకవర్గం టీడీపీ నేత నారాయణ స్వామి తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.