ఖైరతాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు.
హైదరాబాద్ : ఖైరతాబాద్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని విజయారెడ్డి ముందంజలో దూసుకుపోతున్నారు. కడపటి వార్తలు అందే సరికి 1200 ఓట్ల ఆధిక్యంలో ఆమె ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీజేపీ రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బీజేపీ నుంచి చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ తరపున మాజీమంత్రి దానం నాగేందర్ బరిలో ఉన్నారు.