రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర.
బంజారాహిల్స్: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వీరికి తోడు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది.
►హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
► కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్‌కు ఇప్పుడామె సవాల్‌గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్‌ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి.
కేసీఆర్ బొమ్మతోనే...
ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్‌ఎస్ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు.
పీజేఆర్ బొమ్మతో...
ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్... పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే.
అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా...
అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే
అ్రస్తాలుగా మలుచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment