PJR Daughter
-
ముగ్గురూ.. ముగ్గురే..!
రాజకీయ పరిపాలనానుభవం పుష్కలం... ప్రజలతో సంబంధాలు మెండు... నిత్యం ప్రజల మధ్యే తిరిగిన అనుభవం... ప్రతి గడపా గుర్తు పట్టేంతగా ముఖపరిచయం... అందరూ విద్యావంతులే... ఇదీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పారీ్టల నుంచి పోటీ పడుతున్న ముగ్గురు దిగ్గజ అభ్యర్థుల అనుభవాల పరంపర. బంజారాహిల్స్: ఇప్పటికే ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డితో పాటు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వీరికి తోడు 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అనుభవం ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి పి.విజయారెడ్డి ఎవరికి వారే దిగ్గజ రాజకీయ నాయకులుగా నియోజకవర్గ ప్రజల్లో గత రెండు రోజుల నుంచి చర్చనీయాంశంగా మారారు. ఎక్కడ చూసినా ఈ ముగ్గురిపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ►హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా ముగ్గురు బలమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గంగా ఖైరతాబాద్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎవరికి వారే గట్టి అభ్యర్థులు కావడంతో పోటీ తీవ్రంగా ఉంటుందని గెలుపు ఎవరిదో స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థిగా విజయారెడ్డిని ప్రకటించడంతోనే నియోజకవర్గంలో అసలైన కదలిక వచి్చంది. నువ్వా.. నేనా అనే రీతిలో ఈ పోటీ జరగబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ► విజయారెడ్డి దివంగత జనహృదయ నేత పీజేఆర్ వారసత్వాన్ని పునికిపుచ్చుకొని ప్రస్తుతం పోటీలో ఉండగా అయిదుసార్లు ఎమ్మెల్యేగా తలపడుతున్న దానం నాగేందర్‌కు ఇప్పుడామె సవాల్‌గా నిలిచారు. దీనికి తోడు చాపకింద నీరులా తమ క్యాడర్‌ను విస్తరించుకుంటూ ప్రజల్లోకి గత రెండేళ్లు నుంచి పాతుకుపోయిన బీజేపీ ఈ ఇద్దరు అభ్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకోవడానికి నియోజకవర్గంలో సమస్యలు కోకొల్లులుగా ఉన్నాయి. కేసీఆర్ బొమ్మతోనే... ఖైరతాబాద్ నియోజకవర్గంలో అధికార పార్టీ సంక్షేమ పథకాలు ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు అందాయి. కొన్ని చోట్ల అభివృద్ధి ఆగిపోయినా, చాలా చోట్ల దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపారు. అయితే కేసీఆర్ బొమ్మతోనే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు బాటలో నిలవాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు పేర్కొంటున్నారు. రకరకాల సమస్యలు బీఆర్ఎస్ అభ్యర్థని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి ఒకసారి రోడ్డు మీదికి వస్తే పరిస్థితులో మార్పు వస్తుందని సర్వత్రా భావిస్తున్నారు. పీజేఆర్ బొమ్మతో... ఖైరతాబాద్ అంటేనే పీజేఆర్... పీజేఆర్ అంటేనే ఖైరతాబాద్... ఇప్పుడు ఈ నినాదాన్ని ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకెళ్లునున్నారు. ఇప్పటికీ పీజేఆర్‌కు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన బొమ్మ చూస్తే ఓటర్లలో మార్పు రాకమానదు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ నరనరాన నిలిచిపోయింది. అదే పార్టీ తరపున ఆయన కూతురు పోటీ చేస్తుండటంతో నియోజకవర్గం ప్రజలు ఇప్పటికే స్వాగతిస్తున్నారు. కొంత కాలంగా ఆమె ప్రజల్లోనే తిరుగుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గం మొత్తం ఆమె పరిచయం అయిపోయినట్లే. అధికార పార్టీ వైఫల్యాలే ఎజెండాగా... అయిదు సంవత్సరాల్లో అధికార పార్టీ వైఫల్యాలు తనకు అనుకూలిస్తాయని వాటిని ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ అభ్యర్ఙి చింతల రామచంద్రారెడ్డ ఎజెండా రూపొందించుకున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా గత నాలుగేళ్లుగా ఆయన ప్రజల చుట్టే తిరుగుతున్నారు కరోనా సమయంలో జనంలో తిరగడంతో అది బాగా కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చాలా చోట్ల నిలిచిపోవడంతో వాటినే అ్రస్తాలుగా మలుచుకోనున్నారు. -
అజారుద్దీన్‌కు టికెట్.. విష్ణువర్థన్ రెడ్డి రియాక్షన్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. టికెట్ ఆశించి భంగపడిన నేతలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీ నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. సమయం చూసి వేరే పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో టికెట్ ఆశించినా అది దక్కకపోవడంతో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ టికెట్ దక్కకపోవడంతో విష్ణువర్ధన్ రెడ్డి సీరియస్ అవుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ జూబ్లీహిల్స్ టికెట్‌ను మాజీ క్రికెటర్, సీనియర్ నేత అజారుద్దీన్‌కు కేటాయించింది. ఈ క్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి శనివారం పార్టీ అనుచరులతో సమావేశం కానున్నారు. హైకమాండ్ తీరుపై విష్ణువర్ధన్ రెడ్డి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణువర్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నాకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదో అర్థం కావడం లేదు. ఒకే కుటుంబంలో రెండు టిక్కెట్లు చాలా మందికి ఇచ్చారు. మాకెందుకు ఆ నిబంధన అడ్డు వచ్చింది? నేను జూబ్లీహిల్స్‌లో గెలుస్తానని అన్ని రిపోర్టులు చెప్తున్నాయి. కావాలనే నాకు టిక్కెట్ ఇవ్వలేదు. టికెట్ ఇస్తామని ఢిల్లీ పెద్దలు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. కానీ, అనూహ్యంగా జాబితాలో నా పేరు లేకపోవడంతో నేనే షాక్ అయ్యాను. పార్టీకి ఎవరు ముఖ్యమో అది ముందు గమనించాలి. కార్యకర్తల సమావేశం తర్వాత నా భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తాను. నన్ను పార్టీ నుంచి పొమ్మనలేక పొగ పెడుతున్నారు. నేనే వేరే పార్టీలో చేరితే మంచి స్థానం ఇస్తామని ఇప్పటికే పలు ఆఫర్లు వచ్చాయి’’ అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అనుచరులతో భేటీ తర్వాతే పార్టీ మార్పు లేదా తదితర అంశాలపై నిర్ణయం తీసుకుంటానన్నారు. ఇది కూడా చదవండి: రేవంత్‌కు కొత్త టెన్షన్.. 19 స్థానాల్లో ఎవరు? -
కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
-
వారసులు: కొందరు గెలిచారు.. మరికొందరు ...
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల పోరులో నిలబడ్డ వీఐపీల కుటుంబసభ్యులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారు. బంజారాహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మీ ఐదు వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ముషీరాబాద్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాసరెడ్డి పదకొండు వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. ఖైరతాబాద్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి 12వేల పైచిలుకు మెజారిటీతో కార్పోరేటర్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మల్కాజిగిరి ఎంఎల్ఏ చింతల కనకారెడ్డి కోడలు విజయలక్ష్మీ అల్వాల్ డివిజన్ నుంచి ఆరు వేల మెజారిటీతో విజయం సాధించారు. గౌలిపురా డివిజన్లో కేంద్ర మాజీ మంత్రి ఆలె నరేంద్ర సతీమణి లలిత విజయం సాధించారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహిదీపట్నం నుంచి మరోసారి విజయం సాధించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్యనందిత (టీఆర్ఎస్) కవాడిగూడ నుంచి 11 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓడిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా జాంబాగ్ డివిజన్ నుంచి బరిలోకి దిగిన మాజీ మంత్రి ముకేశ్ తనయుడు మూల విక్రంగౌడ్ ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు గన్‌ఫౌండ్రీ డివిజన్ నుండి పోటీ చేసిన ముఖేష్ కుమార్తె శిల్ప సైతం ఓటమి పాలైయ్యారు. వీరిలో విక్రం నాలుగో స్థానంలో నిల్వగా, శిల్ప మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి తార్నాక స్థానంలో ఓడారు. ఆర్కే పురం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మహేశ్వరం ఎంఎల్ఏ తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి బీజేపీ అభ్యర్థి రాధా చేతిలో ఓటమిపాలయ్యారు. -
'దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది'
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనను ప్రచారం చేయకుండా దానం నాగేందర్ అనుచరులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి పీజేఆర్ కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. దానం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని విజయారెడ్డి అన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన దానంకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డిపై దానం అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించారు.