'దానం నాగేందర్కు ఓటమి భయం పట్టుకుంది' | Danam Nagender fear of Election, says Vijaya Reddy | Sakshi
Sakshi News home page

'దానం నాగేందర్కు ఓటమి భయం పట్టుకుంది'

Published Mon, Mar 10 2014 7:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

'దానం నాగేందర్కు ఓటమి భయం పట్టుకుంది'

'దానం నాగేందర్కు ఓటమి భయం పట్టుకుంది'

హైదరాబాద్: ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో తనను ప్రచారం చేయకుండా దానం నాగేందర్‌ అనుచరులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి పీజేఆర్ కుమార్తె, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. దానం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దానం నాగేందర్కు ఓటమి భయం పట్టుకుందని విజయారెడ్డి అన్నారు. పీజేఆర్‌ పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన దానంకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని హెచ్చరించారు.

బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్‌సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డిపై దానం అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement