Khairatabad constituency
-
కాంగ్రెస్‌లో చేరిన పీజేఆర్ కూతురు విజయారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పీజేఆర్ కుమార్తె, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో గురువారం విజయారెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'ఖైరతబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను పార్టీ మారడం ఒక్క రోజు తీసుకున్న నిర్ణయం కాదు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు నన్ను బాధించాయి. షీ టీమ్‌లు పెట్టామని గొప్పగా చెప్పుకుంటున్నా.. మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.రాష్ట్ర ప్రజల బాగోగులు పక్కన పెట్టారు. కాంగ్రెస్ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుంది. సోనియా, రాహుల్ నాయకత్వంలో పని చేయడానికే కాంగ్రెస్‌లోకి వచ్చాను అని విజయారెడ్డి అన్నారు. చదవండి: (సీఎం కేసీఆర్‌కు హైకోర్టు నోటీసులు.. ఎందుకో తెలుసా..?) -
స్త్రీశక్తితోనే క్లీన్‌సిటీ
‘స్వచ్ఛ హైదరాబాద్’కు మహిళలు నడుం కట్టాలని సీఎం పిలుపు ♦ 19న స్వచ్ఛ కమిటీలతో సమావేశం, అభివృద్ధి పనులపై నిర్ణయం ♦ ఇకపై ప్రతి నెలా 17న కమిటీలతో సమీక్ష.. ఢిల్లీ తరహాలో చెత్త తరలింపు ♦ ఎంత ఖర్చయినా డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యం కావాలంటే మహిళలదే కీలకపాత్ర అని, వారు ముందుంటేనే క్లీన్‌సిటీ సాకారమవుతుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులైన సందర్భాన్ని పురస్కరించుకుని తాను ఇన్చార్జిగా ఉన్న బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్టలో స్థానికులతో కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, పిల్లలను శుభ్రంగా తయారు చేసి స్కూళ్లకు పంపడం తెలిసిన అక్కాచెల్లెళ్ల వల్లనే క్లీన్‌సిటీ సాధ్యమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘నేనొస్తున్నానని సున్నం వేసిండ్రు. అయినంత మాత్రాన కంపు పోతదా.. కడుపులోది బయటకు వచ్చేలా తిప్పుతోంది. ఎన్నేళ్లనుంచో ఉన్న ఈ దరిద్రం ఇప్పటికిప్పుడు పోదు. మనమిప్పుడు పనులు మొదలుపెట్టినం. ఏడాది, రెండేళ్లు పడుతుంది. అన్నం వండాలన్నా అరగంట.. కూరకు ఇంకో పావుగంట పడతది కదా’ అని కేసీఆర్ అన్నారు. గత నెలలో ఐదురోజుల పాటు నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ వల్ల స్వచ్ఛ కమిటీ బృందాలకు, ప్రభుత్వానికి సమస్యలపై అవగాహన వచ్చిందన్నారు. శుక్రవారం(19న) నిర్వహించే సమావేశంలో పనులపై పూర్తి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పారిశుధ్యం, పేదలకు ఇళ్లు, నాలాల ఆధునీకరణ తదితరమైన వాటిని అమలు చేసి చూపిస్తామన్నారు. చెత్త సమస్య పరిష్కారానికి ఢిల్లీ, నాగ్‌పూర్ నగరాల్లో అమలవుతున్న మంచి విధానాలను అమలు చేస్తామన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ఇంటింటికీ రెండు రంగుల డబ్బాలను మున్సిపల్ అధికారులు అందజేస్తారని, వాటిని తీసుకుని వెళ్లేందుకు నెల రోజుల్లోగా 2,500 ఆటో ట్రాలీలను అందుబాటులోకి తెస్తామని సీఎం చెప్పారు. ఆ చెత్తను ఎరువుల తయారీ, విద్యుదుత్పత్తి కేంద్రాలకు తరలించనున్నట్లు వివరించారు. ఢిల్లీలో మాదిరిగా నిర్మాణ వ్యర్థాల నుంచి కంకర, ఇసుక తయారుచేసే ప్రాజెక్టులను చేపడతామన్నారు. ప్రతి నెలా 17వ తేదీన స్వచ్ఛ కమిటీల సమావేశం నిర్వహించి భవిష్యత్ పనులను ఖరారు చేస్తామన్నారు. నాలాలపై ఉన్న నివాసాలను తొలగించి వారికి మరో చోట డబుల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని పునరుద్ఘాటించారు. యూనివర్సిటీ స్థలాల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామంటే కొందరు నానా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎకరానికి రూ. 5 కోట్లు వెచ్చించైనా పేదలకు ఇళ్లు కట్టించి తీరతామని స్పష్టం చేశారు. చిలకలగూడలోని రైల్వే స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామన్నారు. నేడు వేములవాడకు కేసీఆర్ వేములవాడ అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం కరీంనగర్ జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. బుధవారం రాత్రి కరీంనగర్ చేరుకున్న సీఎం అక్కడి తెలంగాణ భవన్లో బస చేశారు. గురువారం ఉదయం 10కి వేములవాడ వెళ్తారు. స్వామి వారి దర్శనం అనంతరం ఆలయంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అంతకుముందు కరీంనగర్ వెళుతూ మార్గమధ్యంలో మెదక్ జిల్లా ఎర్రవెల్లి, నర్సన్నపేట తదితర గ్రామాల్లో సీఎం రైతులతో మాట్లాడారు. కరీంనగర్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఏపీ సీఎం చంద్రబాబు పని అరుుపోరుునట్లేనని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ పర్యటనకు వెళ్లిన ఆయన బుధవారం రాత్రి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, ముఖ్యనేతలతో సమావేశమయ్యూరు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. బుధవారం ఆరు గంటల పాటు సుదీర్ఘంగా నిర్వహించిన ఏపీ కేబినెట్ భేటీలో కేవలం తనను ఎలా ఇరికించాలన్న ఆలోచనలే చేశారని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. చివరకు తన భాష మీద, తాను మాట్లాడిన అంశాలమీద వివాదం రేపాలని చూస్తున్నారని చెప్పినట్లు సమాచారం. -
విన్నపాలు వేనవేలు
- ‘స్వచ్ఛ హైదరాబాద్’ రెండో దశలో దరఖాస్తుల వెల్లువ - తొలివిడత సమస్యలు ఎక్కడివక్కడే - అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం - పరిష్కారానికి సీఎం, మంత్రుల హామీ సాక్షి,సిటీబ్యూరో: మహా నగరంలో బుధవారం నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ రెండో దశ కార్యక్రమంలోనూ అనేక చోట్ల పాత సమస్యలపైనే వినతులు వెల్లువెత్తాయి. అధ్వాన్న రహదారులు, పునరుద్ధరణకు నోచుకోని పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, పొంగిపొర్లుతున్న మ్యాన్‌హోళ్లు, ఇళ్ల స్థలాలు, పారిశుద్ధ్య సమస్యలు, వెలగని వీధి దీపాలు, కలుషిత జలాలు, మురుగు సమస్యలపైనే మంత్రులు, అధికారులకు ఫిర్యాదులు అందాయి. పార్శిగుట్టలో సీఎం కేసీఆర్, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆనంద్ నగర్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, నోడల్ ఠమొదటిపేజీ తరువాయి అధికారులు పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. గత నెలలో జరిగిన స్వచ్ఛ హైదరాబాద్ మొదటి దశ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులను ఆరా తీశారు. తొలివిడత వినతులు ఇప్పటి వరకు పరిష్కారానికి నోచుకోలేదని వివిధ ప్రాంతాల ప్రజలు అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో కంగుతిన్న అధికారులు, మంత్రులు వాటి తక్షణ పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రెండో విడత సాగిందిలా... - ఖైరతాబాద్‌లోని ఆనంద్ నగర్ కమ్యూనిటీ హాల్లో గవర్నర్ నరసింహన్ స్థానికులతో సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిసరాల పరిశుభ్రతపై రాజీ పడవద్దని సూచించారు. - సోమాజిగూడలోని బీఎస్ మక్తాలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పర్యటించారు. స్థానికంగా చెత్త కుప్పలు పేరుకుపోవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పైప్లైన్ల మరమ్మతులకు రూ.25 లక్షలు, రహదారులకు రూ.25 లక్షలు కేటాయిస్తున్నామన్నారు. - ఎల్బీనగర్ నియోజకవర్గం... మన్సూరాబాద్ డివిజన్ 328 యూనిట్ చంద్రపురి కాలనీలో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి యూనిట్‌కు 15 మందితో కూడిన పౌర కమిటీలను నియమించారు. - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆజంపుర డివిజన్లోని మార్కస్లో పర్యటించారు. స్థానికంగా ఉంటున్న 110 కుటుంబాలకు రెండు గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఓల్డ్ మలక్‌పేట శంకర్ నగర్లో పర్యటించారు. మూసీ నదిలో పడి చనిపోయిన చిన్నారి కుటుంబీకులను పరామర్శించారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు, నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. - అక్కడినుంచి మూసీ పరీవాహక ప్రాంతానికి వెళ్లి... కబ్జాకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించారు. నాలా చుట్టూ రిటైనింగ్ వాల్స్ నిర్మించాలని అధికారులకు సూచించారు. అనంతరం అక్బర్‌బాగ్ డివిజన్ పల్టాన్లో పర్యటించారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. - బంజారాహిల్స్ రోడ్ నెం.12లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఎన్బీటీ నగర్, ఎన్బీ నగర్ కాలనీ, శ్రీరాంనగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో ఇప్పటి వరకు జరిగిన, చేపట్టాల్సిన పనులపై సమీక్షించారు. - వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెస్ట్‌మారేడ్‌పల్లిలో పర్యటించారు. స్థానికులు మురుగు సమస్యలు, పారిశుద్ధ్యంపై ఫిర్యాదు చేయగా... వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. - అబిడ్స్‌లోని మురళీధర్‌బాగ్, కట్టెలమండి ప్రాంతాల్లో ైవె ద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి పర్యటించారు. మురళీధర్‌బాగ్‌లో పేద ప్రజలకు త్వరలోనే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. గోషా మహల్ నియోజకవర్గంలో తొలివిడత కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సమర్పించిన నివేదికలను పరిశీలించారు. పనులు చేపట్టాలని ఆదేశించారు. - కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పర్యటించారు. నాలా అభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కమ్యూనిటీ హాలులో రెండోఅంతస్తు నిర్మాణం చేపట్టాలని, కలుషిత జలాల సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. - బాలానగర్‌లో ఏడు బస్తీల అసోసియేషన్లు స్వచ్ఛ హైదరాబాద్‌పై సమావేశమయ్యాయి. పారిశుద్ధ్య పనులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించాయి. అక్రమంగా వెలసిన చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాయి. - ఖైరతాబాద్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ నగర్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటించారు. స్థానికంగా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని, నీటి శుద్ధి కేంద్రాలను బాగు చేయించాలని ప్రజలు కోరగా.. ఆమేరకు పనులు చేపడతామని ఆయన వారికి హామీ ఇచ్చారు. - అంబర్పేట్ నియోజకవర్గంలో 210 మందికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి చెప్పారు. అంబర్‌పేట అభివృద్ధికి రూ.50 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. మోయిన్ చెరువును మిషన్ కాకతీయలో చేర్చి శుద్ధి చేయించేందుకు అంచనాలు సిద్ధం చేశామన్నారు. ఇదిలా ఉండగా... ‘గతంలో ఇచ్చిన ఫిర్యాదులను ఇప్పటి వరకు పరిష్కరించ లేదు. మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వీధుల్లో పర్యటిస్తున్నారు?’ అంటూ జైస్వాల్ గార్డెన్ వాసులు అధికారులను నిలదీయడం గమనార్హం. - ఉప్పల్‌లో మౌలిక సదుపాయాలకు రూ.17 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినట్టు డిఫ్యూటీ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. కమ్యూనిటీ హాళ్లు, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. - రామంతాపూర్ టీవీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ స్థలాన్ని పరిశీలించారు. త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. గణేశ్‌నగర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన సమావేశంలో స్థానికులు అధికారులను నిలదీశారు. - అల్వాల్‌లో ఐపీఎస్ అధికారి రాజేశ్ కుమార్ పాల్గొన్నారు. ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యం నెరవేరుతుందన్నారు. పనుల్లో నాణ్యత, పారదర్శకత కోసం అధికారులు, స్థానికుల ఫోన్ నెంబర్లతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశారు. - మల్కాజ్గిరి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో అధికారులు కేవలం సమావేశాలకే పరిమితం కావడం, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పర్యటించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. - అమీర్‌పేట ప్రాంతంలో హోం శాఖ కార్యద ర్శి వెంకటేశం పర్యటించారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హమీలు ఎంతవరకు నెరవేరాయన్న దానిపై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. - బల్కంపేట్‌లోని కంజర్ల లక్ష్మీనారాయణ యాదవ్ మున్సిపల్ పార్కును మెంటార్ ప్రభాకర్ సందర్శించారు. సమస్యల పరిష్కారంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. చిన్న చిన్నవి పరిష్కారమయ్యాయని, నిధులు కేటాయించాల్సినవాటి విషయంలో జాప్యం జరుగుతోందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం సాక్షి,సిటీబ్యూరో: స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం బుధవారం జీహెచ్ఎంసీలోని 400 యూనిట్లలో విజయవంతమైందని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పార్శిగుట్టలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బీఎస్‌మక్తాలో స్వచ్ఛ కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్యాట్రన్లుగా ఉన్న 35 యూనిట్లకుగాను 23 మంది హాజరయ్యారన్నారు. 400 మంది మెంటార్లు ఉండగా... 361 మంది పాల్గొన్నట్టు తెలిపారు. 400 మంది నోడల్ అధికారులు, 2595 స్వచ్ఛ యూనిట్ అధికారులు కార్యక్రమాల్లో పాల్గొన్నారని వివరించారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపణీ
-
పేదలకు ‘పట్టా’భిషేకం
- నేడు ప్రారంభించనున్న సీఎం - జంట జిల్లాల్లో 81,777 మందికి - పట్టాల పంపిణీ - ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పేద ప్రజల చిరకాల వాంఛ నేరవేరబోతోంది. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్బీటీ నగర్లో 7 వేలకు పైగా కుటుంబాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 3,300 మందికి పట్టాలు అందజేస్తారు. పాతబస్తీలోని వివిధ మండలాల పరిధిలో గుర్తించిన పట్టాదారులకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ పట్టాలను పంపిణీ చేస్తారు. అంబర్‌పేట్‌లోని అలీ కేఫ్ ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్లో మలక్‌పేట్ నియోజకవర్గానికి చెందిన 114 మందికి... అంబర్పేట్ నియోజకవర్గంలోని 503 మందికి, చార్మినార్‌లోని 112 మందికి మహమూద్ అలీ పట్టాలు అందిస్తారు. కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ చౌరస్తాలోని న్యూ నేషనల్ ఫంక్షన్ హాల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 393 మందికి... యాకత్‌పురలోని 161 మందికి, బహదుర్‌పురాలోని 26 మందికి, రహీంపురలోని ఎస్కే ఫంక్షన్ హాలులో నాంపల్లి నియోజకవర్గంలోని 381 మందికి, కార్వాన్‌లోని 793 మందికి, గోషా మహల్‌లోని 174 మందికి ఆయన పట్టాలు అందజేస్తారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని 1186 మందికి లోయర్ ట్యాంక్ బండ్‌లోని తెలగ, బలిజ, కాపు భవన్లో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టాలు అందజేస్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 7,817 మందికి స్థానిక ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో... జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 5,314 మందికి యూసుఫ్‌గూడ చౌరస్తాలోని సవేరా ఫంక్షన్ హాలులో మంత్రి నాయిని పట్టాలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 495 మందికి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు. మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 1910 మందికి ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు పట్టాలుఅందజేయనున్నారు. తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాలులో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 646 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. జంట జిల్లాల్లో 81,777 పట్టాలు నగరంలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా భావించిన సర్కారు.. 125 చదరపు గజాలలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని కట్టడాలను క్రమబద్ధీకరించింది. జంట జిల్లాల్లో మొత్తం 81,777 పట్టాలు పంపిణీ చేయనుంది. హైదరాబాద్ జిల్లాలో జీవో 58 కింద 61,461 ఉచిత దరఖాస్తులను యంత్రాంగం స్వీకరించింది. అర్జీల వడపోత, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 20,025 మందిని అర్హులుగా గుర్తించి... పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ స్థలాలు, కోర్టు కేసులు, ఖాళీ స్థలాలు, రక్షణ, అటవీ శాఖ, వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లకు సంబంధించి 36,945 దరఖాస్తులను పక్కన పెట్టింది. రంగారెడ్డి జిల్లాలో 1,49,471 దర ఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం 73,284 ఇళ్లు క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చింది. ప్రస్తుతం 61,752 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అసైన్డ్ పట్టాలే.. 125 గజాలలోపు ఇళ్లకు ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తున్న సర్కారు... వీటిని అనుభవించుకోవడానికే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఉచిత కేటగిరీలోని ఇళ్లకు అసైన్డ్ పట్టాలను జారీ చేస్తోంది. దీంతో విక్రయానికి చట్టం అనుమతించదు. ఒకవేళ జీఓ 59 కింద చెల్లింపు కేటగిరీలోకి మారినా/వర్తించినా వాటి క్రయ విక్రయాలకు ఇబ్బంది ఉండదు. -
బరితెగించిన కాంగ్రెస్
బంజారాహిల్స్,న్యూస్‌లైన్: పోలింగ్‌కు ముందే ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణుల ఆగడాలు మితిమీరాయి. ఆది నుంచి వైఎస్సార్సీపీ అంటే గిట్టని ఆ పార్టీ శ్రేణులు దర్జాగా దాడులకు దిగారు. కార్యకర్తల ఇళ్లకు వెళ్లి మరీ బయటకు పిలిచి దాడి చేసేందుకు యత్నించారు. తమ కార్యకర్తలపై దాడులకు దిగుతూ భయభ్రాం తులకు గురిచేస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోకవర్గ అభ్యర్థి పి.విజయారెడ్డి మంగళవారం బంజారాహిల్స్ ఏసీపీ రమేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకొని వెంటనే వారిన బైండోవర్ చేయాలని కోరారు. బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి తనయుడు భానుప్రకాశ్ తమ శ్రేణులను బెదిరిస్తున్నారని, వెంకటేశ్వరనగర్‌లో నివసించే లక్ష్మి అనే మహిళా నాయకురాలిని ఇంట్లో నుంచి బయటకు రావాలంటూ హెచ్చరిస్తూ బయటకొస్తే దాడిచేసేందుకు యత్నిం చారని ఆరోపించారు. విషయం తెలి సినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. నందినగర్తోపాటు దాని చుట్టుపక్కల పోలింగ్‌బూత్‌ల వద్ద గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పారామిలటరీ బలగాలను మోహరించాలని ఆమె డిమాండ్ చేశారు. స్పందించిన ఏసీపీ తక్షణం చర్యలు తీసుకుంటానని హామీఇచ్చారు. అదనపు బలగాలను మోహరిస్తామని, ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చూస్తానని చెప్పారు. అర్ధరాత్రి పోలీసుల హడావుడి: కాంగ్రెస్ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లల్లోకి చొరబడి తనిఖీలు నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో కాంగ్రెస్‌కు చెందిన బాక్సర్ అశోక్ సైఫాబాద్ పోలీసులపై ఒత్తిడి పెంచి ఖైరతాబాద్‌లో నివసిస్తున్న పలువురు వైఎస్సార్సీపీ నేతల ఇళ్లల్లో డబ్బులు పంచుతున్నారని తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో వారు కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకొని వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తల ఇళ్లల్లోకి అర్ధరాత్రి చొరబడి తనిఖీలు చేశారు. విషయం తెలుసుకున్న విజయారెడ్డి వెంటనే ఖైరతాబాద్‌కు చేరుకొని పరిస్థితి తెలుసుకున్నారు. అసలు దొంగలను వదిలి తమ కార్యకర్తల ఇళ్లల్లోకి ఎలా చొరబడతారని ఎస్ఐని నిలదీశారు. మీకు ఎవరు ఫిర్యాదు చేశారని విజయారెడ్డి సదరు ఎస్ఐను నిలదీయగా మొదట సీఐ అని ఆ తర్వాత ఏసీపీ అంటూ నీళ్లు నమిలారు. మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులను వదిలి తమను లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టా రు. ఈ ఘటనతో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడ్నుంచి జారుకున్నారు. -
విజయారెడ్డికి విజయం తథ్యం: వైఎస్ విజయమ్మ
హైదరాబాద్ : ఖైరతాబాద్ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న పి.విజయారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. విజయారెడ్డి బుధవారం నామినేషన్ వేసిన సందర్భంగా విజయమ్మ ఆమెకు మద్దతుగా నామినేషన్ కేంద్రానికి వచ్చారు. అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడుతూ 60 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అభివృద్ధి వైఎస్సార్ చేసి చూపించారని స్పష్టం చేశారు. మహానేత చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తామని..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేస్తుందన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో దివంగత పీజేఆర్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలు మరిచిపోలేదని ఆయన వారసురాలిగా వస్తున్న విజయారెడ్డిని తప్పక ఆశీర్వదిస్తారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో త్వరలో అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని, భారీమెజార్టీతో విజయం సాధిస్తారని విజయమ్మ అన్నారు. కాగా నామినేషన్ సందర్భంగా కోలాహలం నెలకొంది. పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. -
'దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుంది'
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో తనను ప్రచారం చేయకుండా దానం నాగేందర్ అనుచరులు అడ్డుకుంటున్నారని ఎన్నికల సంఘానికి పీజేఆర్ కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయారెడ్డి ఫిర్యాదు చేశారు. దానం అనుచరులు దౌర్జన్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ దానం నాగేందర్‌కు ఓటమి భయం పట్టుకుందని విజయారెడ్డి అన్నారు. పీజేఆర్ పేరు చెప్పుకుని పదవులు సంపాదించిన దానంకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెప్తారని హెచ్చరించారు. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనేఉన్న వెంకటేశ్వరనగర్‌లో ఆదివారం పాదయాత్ర చేపట్టిన వైఎస్సార్సీపీ ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ విజయారెడ్డిపై దానం అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ‘మా అన్న (దానం నాగేందర్) ఈ బస్తీలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను తిరగనివ్వవద్దని చెప్పారు..ఇక్కడి నుంచి వెళ్లిపోండి’ అంటూ బెదిరించారు.